For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంట్లో ఇవి ఉంటే శని మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది

ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండడం లేదంటే కొన్ని రకాల వస్తువులను ఎలా అంటే అలా పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. అవి మీ సంసారంపై, మీ జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి.

By Bharath
|

ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండడం లేదంటే కొన్ని రకాల వస్తువులను ఎలా అంటే అలా పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. అవి మీ సంసారంపై, మీ జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. మరి ఎలాంటి వస్తువుల వల్ల మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందో మీరూ తెలుసుకోండి.

చీపురు ఎల్లప్పుడూ కిందకే ఉండాలి

చీపురు ఎల్లప్పుడూ కిందకే ఉండాలి

మన ఇంట్లో ఉండ చీపురు కూడా ఇంట్లో ఇబ్బందులు ఏర్పడడానికి కారణం అవుతుంది. చీపురును ఎప్పుడూ ఎలా అంటే అలా పడేయకూడదు. దాన్ని ఒక మూలకు ఉంచాలి. అది కూడా పిడి పైకి ఉండి ఊడ్చేటటువంటి వైపును కిందకు ఉంచి ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడవు. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇలాంటి ఆచారాన్ని గ్రామాల్లో ఎక్కువగా పాటిస్తుంటారు. ఇది చాలా శుభసూచకం.

కత్తెర అలాగే ఉంచాలి

కత్తెర అలాగే ఉంచాలి

కత్తెరను ఎలా అంటే అలా ఉంచకూడదు. దాన్ని రెండు కొనలు ఒకే చోట ఉండేలా దగ్గరకు ఉంచి ఉంచాలి. ఒకటి ఒక వైపు ఇంకోటి ఒక వైపు పెట్టి పెంచితే ఆ ఇంట్లో కచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీంతో మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా మీరు కత్తెరను దగ్గరగా ఉంచి ఉంచండి. దీని వల్ల మీ ఇంటినిండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చిత్రంలో చూపించినట్లు కత్తెరను విడిగా ఉంచకూడదు. దగ్గరకు ఉంచాలి.

విరిగినవి ఉంచుకోకండి

విరిగినవి ఉంచుకోకండి

మీరు వీలైనంత వరకు మీ ఇంట్లో విరిగినవి, పగిలినవి ఏవీ కూడా ఉంచుకోకండి. పగిలిపోయిన అద్దాలు, విరిగిన పాత్రలు వంటి వాటిని అస్సలు ఉంచుకోకండి. చాలా మంది వాటిని మరిచిపోయి ఇంట్లో పెట్టుకుని ఉంటారు. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. అందువల్ల మీరు వీలైనంత వరకు విరిగినవి, పగిలినవి ఇంట్లో ఉంచుకోకండి.

జంతువుల చర్మాలు, తోళ్లు, కొమ్ములు తదితర వాటిని ఉంచుకోకండి

జంతువుల చర్మాలు, తోళ్లు, కొమ్ములు తదితర వాటిని ఉంచుకోకండి

చాలా మంది ఇళ్లలో అలంకారంగా ఉండేదుంకు కొన్ని రకాల జంతువులు చర్మాలు, కొమ్ములు, తోళ్లు వంటివి ఉంచుకుంటారు. వాటిని ప్రిస్టేజ్ గా భావిస్తారు. అయితే దీని వల్ల మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి.

పాత, చినిగిన దుస్తులు

పాత, చినిగిన దుస్తులు

కొందరు ఏళ్ల తరబడి పాత దుస్తులను అల్మారాలలో ఉంచి ఉంటారు. అవి దుమ్ము పట్టి పోయింటాయి. కానీ ఎప్పుడూ వేసుకోరు. ధరించరు. అవి కూడా మీ ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ నింపుతాయి.

కృత్రిమ మొక్కలు, పువ్వులు, వాడిపోయిన పువ్వులు

కృత్రిమ మొక్కలు, పువ్వులు, వాడిపోయిన పువ్వులు

చాలామంది ఇంట్లో ఆర్టిఫిషల్ గా ఉండేందుకు పూల కుండీలను, మొక్కలను ఉంచుకుంటారు. ఇక అందులో కొందరు పువ్వులను ఉంచుతారు. అవి వాడిపోయిన వాటిని అలాగే ఉంచుతారు. అలాగే కృత్రిమ మొక్కలు, పువ్వులను కూడా ఉంచుతుంటారు. ఇలా చేయకండి. వాటి వల్ల మీ అదృష్టాలు కూడా వెనక్కి వెళ్లి పోతాయి. అందువల్ల వాటిని అలా పెట్టకండి.

పగిలిన అద్దాలు

పగిలిన అద్దాలు

పగిలిన అద్దం చాలా దరిద్రం. దాన్ని ఇంట్లో పెట్టుకున్నా దానిలో ముఖాన్ని చూసుకున్న కూడా చాలా దరిద్రం. అందువల్ల మీ ఇంట్లో అలాంటి అద్దాలు వెంటనే బయట పారేయండి. అద్దం ఇంట్లో పగిలిన కూడా దరిద్రమే. అందువల్ల మీరు అలాంటి అద్దాల్ని ఇంట్లో పెట్టుకోకండి. అందాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.

కొన్నిరకాల మొక్కలు

కొన్నిరకాల మొక్కలు

కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. కాక్టస్ వంటి వాటిని కూడా మీరు ఇంట్లో పెట్టుకోకండి. చాలా మంది బాల్కానీలో ఇలాంటి మొక్కలు పెడుతుంటారు. అది అంద మంచిది కాదు. దీని వల్ల మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంటికి మంచిని తెచ్చే మొక్కలను మాత్రమే మీరు ఇంట్లో ఉంచుకోండి.

English summary

these objects that spread negative energy around the house

these objects that spread negativeenergy around the house
Story first published:Saturday, January 6, 2018, 11:34 [IST]
Desktop Bottom Promotion