ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి ఏప్రిల్ 8 నుండి 14 వరకు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి ఏప్రిల్ 8 నుండి 14 వరకు

మన జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలుపుతున్న వివరాల ప్రకారం., మీ రాశిచక్రాల ప్రభావం ఈ వారం లో ఎలా ఉండనున్నదో తెలుసుకోండి. ఈ అంచనాలు సూర్యమాన సిద్దాంతం ప్రకారం చెప్పబడినది.

మేషం మార్చి 21- ఏప్రిల్ 19

మేషం మార్చి 21- ఏప్రిల్ 19

బుధుడు మొదటి పాదంలో ఉండుట మూలంగా మీ ఆలోచనా విధానం, లక్ష్యం, శారీరిక ఆరోగ్యం, మరియు వ్యక్తిత్వం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే దిశగా ఉంటాయి. ఈ వారంలో ఏ విషయానికైనా మీరు కాస్త అధిక శ్రమను చేయవలసి ఉంటుంది. మీ మాటలు కాస్త పదునుగా ఉండే అవకాశాలు లేకపోలేదు, కావున ఆలోచించి మాట్లాడవలసినదిగా సూచించడమైనది. కానీ మీ గతానుభవాలు మీకు కొన్ని దారులను చూపుతాయి. కొన్ని విషయాల నందు పట్టుదల పనికిరాదు.

వృషభం ఏప్రిల్ 20 – మే 20

వృషభం ఏప్రిల్ 20 – మే 20

మీకు ఈ వారమంతా రక్షణ, మరియు ఆత్మ విశ్వాసాన్ని అనుభూతిగా కలిగి ఉంటారు. కొన్ని మార్పులు , మీ భవిష్యత్తుకి శుభసూచకాలుగా గోచరిస్తాయి. మీరు పెళ్లికాని వారైతే, ఈ వారంలో మీకు మంచి భాగస్వామిని కనుగొనే సూచనలు కనిపిస్తున్నాయి.

కానీ మీరు కొన్ని విషయాల గురించి కాస్త అంతరాత్మతో చర్చించుకున్నాకే నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. తద్వారా మీ భవిష్యత్తుకు చక్కటి పునాదులు పడుతాయి. ఈ వారం వృషభ రాశి వారికి అనువుగా ఉందని చెప్పబడుతున్నది.

మిధునం మే 21- జూన్ 20

మిధునం మే 21- జూన్ 20

మీరు మాట్లాడేవిధానం, నడవడిక మీదనే ఈ వారం ఆధారపడి ఉంటుంది. ఈ వారం మిమ్ములను ఇతరులు కాస్త అసహనానికి గురిచేస్తూ ఉంటారు. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధిత వ్యక్తులే కాకుండా, మరికొందరు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున నిర్ణయాలకు ముందు ఆలోచనలకు పదునుపెట్టాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం జూన్ 21- జూలై 22

కర్కాటకం జూన్ 21- జూలై 22

మీ భావోద్వేగాలను ప్రణాళికా బద్దంగా నియంత్రించుకోవలసిన అవసరం గోచరిస్తుంది. ఒకవేళ హద్దులను దాటి ప్రవర్తిస్తే, వాదనలు గొడవలే కాకుండా మీ గౌరవానికి కూడా కళంకం తెచ్చేలా తయారవుతారు. కావున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. కానీ మీ అంతరాత్మ తో చర్చ చేయడం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

మీ ఆర్ధికపరమైన విషయాలయందు జాగ్రత్త అవసరం. పరిధిని దాటి ఖర్చుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి భవిష్యత్తు సమస్యలకు పునాదులు కాగలవు. గమనించండి. ఒక్కోసారి ప్రతిష్ట కు ప్రాకులాడి డబ్బును వెచ్చిస్తుంటారు, కానీ ఇలాంటి సమయాల్లోనే ఆలోచనకు పదును పెట్టాలి. లేదా భవిష్యత్తు అంధకారమే అవుతుంది. నిర్ణయాత్మక ధోరణితో వ్యవహరిస్తే మాత్రం విజయం మీదే.

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

ఈ వారo, మీరు ఒక యుద్ద భూమిలో ఉన్న అనుభూతికి లోనవుతారు. అధిక ఒత్తిడి, చాలెంజులు మీ మార్గంలో అధికమవుతాయి. ప్రతి మలుపులో పని ఒత్తిడి ప్రధమంగా ఉన్నది. అనేకమంది కోపావేశాలకు కూడా గురవుతూ ఉంటారు, కానీ వారి కోపానికి మీరొక్కరే కారణం కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా తాత్కాలికమే, కానీ భవిష్యత్తు విజయాల ముందు ఇవన్నీ చిన్నవే అని గుర్తుంచుకోండి. మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతాయి. ఏమరుపాటుగా ఉండకండి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు కాకపోయినా రేపయినా ఖచ్చితంగా పొందుతారు. మీ కుటుంబసభ్యులు మీకు శత్రువులు కాదు, మీకోసం ప్రాణాలిచ్చే వారిలా ఉంటారు. తప్పుగా అర్ధం చేసుకోకండి. వారి ఆలోచనలకు కూడా విలువివ్వండి.

తుల సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తుల సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

మీ వ్యక్తిత్వo నలుగురికీ ఆదర్శంగా కనిపిస్తుంది. మీకు ఈ వారం చాలా అనువుగా ఉన్నది. కానీ మిమ్ములను దూరం పెడుతూ వస్తున్న ఒక వ్యక్తి గురించిన నిజం ఒకటి తెలుస్తుంది. మరో పక్క మీ మార్గానికి ప్రతికూల ప్రభావాలు సృష్టిస్తున్న వారు, నెమ్మదిగా తప్పుకుంటారు. తద్వారా కొన్ని సానుకూల ఫలితాలను చూడగలుగుతారు. భావోద్వేగాలకు లోనుకాకుండా ఎటువంటి సమస్యనైనా తెలివితో సరిచేయగలరు.

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

ఈ వారం మీకు పని ఒత్తిడి అధికంగా ఉండనుంది. మరియు మీ కుటుంబ సభ్యులతో సైతం సమయం వెచ్చించలేని పని ఒత్తిడికి గురవుతారు. ముందు రోజులతో పోలిస్తే ఈ వారం మీకు కష్టంగా అనిపిస్తుంది. కనీసం విశ్రాంతికి కూడా సమయం దొరకనంతగా ఈ వారం ఉంటుంది. ఈ వారం మీకు అదృష్టమే తోడుగా ఉండాలి , లేకుంటే కాస్త కష్టమే.

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ఈ వారంలో మీకు అనేక అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సానుకూల, ప్రతికూల ప్రభావాల మేళవింపుతో మిశ్రమ ఫలితాలతో ఉండనుంది. ముఖ్యంగా మీరు పనిచేయు ప్రదేశాలలో ఇటువంటి మార్పును గమనిస్తారు. కొన్ని ముఖ్యమైన పరిణామాలు కూడా చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవలసిన అవసరం ఉంది. శత్రువులు పొంచి ఉన్నారు. మిశ్రమ ఫలితాలతో ఈ వారం నడవనుంది.

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

మీకు ఈ వారం అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు మీకు ఎదురుపడే అవకాశాలు లేవు. కానీ కొందరి నుండి మీకు అబద్దాలు, ఏమరపరచే అంశాలు మాత్రం ఎదురవుతాయి. మీ గురించిన చర్చలు జరుగుతాయి కూడా. ఏది ఏమైనా మీ పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందగలరు. కాస్త మానసిక ఒత్తిడి, భవిష్యత్తు ప్రణాళికల పై ఆందోళనలు ఉంటాయి, కానీ అన్నిటికీ ఒక పరిష్కారం మాత్రం కనిపిస్తుంది.

కుంభం జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం జనవరి 21- ఫిబ్రవరి 18

మీ చుట్టూ శత్రువులు కాపుకాచి ఉంటారు. ముఖ్యంగా మీకు తెలిసిన వారే ఉండడం శోచనీయం. కానీ వారు మీ జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరు. ఈ వారం చివరిలో మీకు శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి.

కొన్ని ప్రతికూల ప్రభావాలు మిమ్ములను మానసిక అశాంతికి గురించేసినా కూడా, అవన్నీ తాత్కాలికమే అని గ్రహించండి. మిమ్ములను సాధారణంగా ఒక తెలియని చింత వేధిస్తూ ఉంటుంది. గతించిపోయిన జ్ఞాపకాలలో పడి భవిష్యత్తును అంధకారంలో ఉంచకండి.

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

మీ గురించిన ఇతరుల అభిప్రాయం తెలుసుకొనుటకు ఈ వారం అనువుగా ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు మాత్రం ఈ వారం మీకు అనువుగా లేదు. వాటిని వాయిదా వేయడం మంచిది. కొన్ని ప్రతికూల ప్రభావాల వలన మీ కష్టం వృధా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఎటువంటి విషయముల గురించైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించడమే మంచిది.

English summary

These Weekly Predictions Reveal What's In Store For You!

Astrology experts reveal everything that you need to know about your weekly predictions. The stars which will be in their best form to the things that you need to be cautious about, it is everything that you need to know. And various happenings that you will face during the week can be revealed with weekly predictions.
Story first published: Tuesday, April 10, 2018, 7:00 [IST]