For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ జన్మరాశులవారు జంటగా కన్నా స్నేహితుల్లా చక్కగా ఉంటారు

|

హిందూమత నమ్మకాల ప్రకారం, ఒక వ్యక్తి స్వభావం అతను పుట్టినపుడు గ్రహాల దిశనుబట్టి నిర్ణయమవుతుంది. ఇవి కేవలం అతని వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి మాత్రమే కాక, అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయి.అందుకని, జాతకచక్రాన్ని, భవిష్యత్తు జీవితం గురించి తెలుసుకోటానికి పుట్టిన సమయాన్ని నోట్ చేసుకోటం చాలా ముఖ్యం.

ఇక,మంచి హృదయం ఉన్నవారు, బలమైన వ్యక్తిత్వం కలిగివుంటారు కానీ ఒకరికొకరు సరిపోకపోవచ్చు. వారు ఒకరికొకరు సరిపోయినా, ఒక రకమైన బంధంలో అందంగా ఇమిడిపోగలరు కానీ అన్నిటిలో కాదు.

These zodiac signs are better off as friends than as a couple

మరోవైపు, ఒకరంటే ఒకరికి అస్సలు పడకపోయినా, ఒక బంధంలో చక్కగా ఇమిడిపోవచ్చు (ఆ బంధం చాలా విజయవంతం అవుతుంది కూడా). ఉదాహరణకి,రెండు వేర్వేరు జన్మరాశులకి చెందిన ఇద్దరు స్నేహితుల్లా చాలా బాగా ఉండవచ్చు, కానీ ఏదన్నా బంధంలోకి ప్రవేశిస్తే మాత్రం ఏవీ చక్కగా జరగవు.

మీ జన్మరాశి ప్రకారం ఈ వ్యక్తులతో కలిసి ఉండండి

అదే వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. అలాంటివి ఏమన్నా జరిగితే,ఒకరిపైఒకరు లేదా పరిస్థితిపై నిందించుకోటం మానేసి, వారి జన్మరాశుల ప్రకారం వారు కేవలం స్నేహితుల్లా బాగుంటారేమో ఆలోచించండి. దీనిలో మీకు సాయపడటానికి, ఈ ఆర్టికల్ లో జంటగా కన్నా స్నేహితుల్లా బాగుండే జన్మరాశుల గురించి చర్చించటం జరుగుతుంది.

కర్కాటకం, ధనస్సు

కర్కాటకం, ధనస్సు

కర్కాటక రాశికి చెందినవారు ప్రేమగా,సంరక్షణ తీసుకునేవారిలో మేటి. వాళ్ళు బంధాల కోసం ఏదీ ఆశించకుండా కష్టపడతారు. ఈ రకం వ్యక్తులు తమ సొంతవారిని ఎప్పుడూ కాపాడుతూ చాలా లోతుగా ప్రేమిస్తారు.అందుకనే ధనూరాశి వారితో వీరు చక్కగా సరిపోతారు.ధనూరాశికి చెందినవారు కేర్ ఫ్రీగా ఉంటూ వారివైపు నుంచి ఎక్కువ ఏదీ చేయకుండా ఆరోగ్యకరమైన బంధాలను కోరుకుంటారు. కానీ, ఈ రెండు జన్మరాశులవారు పెళ్ళి చేసుకుంటే, వారికి కేవలం దుఃఖం మిగులుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎక్కువ కాపాడే మనస్తత్వంతో ఉంటారు, ధనూరాశికి చెందిన వారు (ముఖ్యంగా స్త్రీలు) ఇది ఇష్టపడరు.

మిథునం, మకరం

మిథునం, మకరం

మిథునరాశికి చెందినవారు బయట ప్రపంచంపై ఎక్కువ ధ్యాసపెట్టరు. వారు మీకు స్నేహితులైతే, మీరు చెప్పే ఏ వివరాలైనా వారు సాధారణంగా మర్చిపోతారు. ఈ రకం వ్యక్తులు వారి ప్రపంచం వారు ఏర్పర్చుకుంటారు. మీరు వారికి అంత దగ్గరైతే,ఇక మిమ్మల్ని వారు దూరంగా వెళ్ళనివ్వరు,మిథునరాశి వారు ఇక పూర్తిగా మీపైనే ధ్యాస పెడతారు. మరోవైపు,మకర రాశివారు చుట్టుపక్కల వారి ధ్యాస వారిపైనే ఉండాలని కోరుకుంటారు. మకరరాశి వారిని అందరూ భరించలేరు. వారితో ఉండటానికి సహనం అవసరం మరియు అది మిథున రాశివారిలో ఉంటుంది. ఇలాంటి వారు ఒక ప్రేమ బంధంలోకి ప్రవేశిస్తే, వారి జీవితాల్లోంచి ప్రేమ పోయి, ఇద్దరూ దూరంగా జరిగిపోతుంటారు.

వృషభం, మీనం

వృషభం, మీనం

వృషభరాశి వారు సాధారణంగా ప్రాణస్నేహితుల్లా మారిపోతారు. వారు స్నేహితులుగా అన్నీ పంచుకుంటారు. మీనరాశి వారు మరోవైపు, దయాస్వభావం కలిగివుండి,వారికి తెలిసిన రహస్యాలన్నిటిని చచ్చేదాకా తమలోనే దాచుకుంటారు. అలాంటివారు మీనరాశి వారితో స్నేహం చేస్తే, వారి బంధం కాలపరీక్షకి కూడా ఎదురునిలుస్తుంది. ఇలా ఎందుకంటే ఈ రకం స్నేహంలో ఒకరు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడాలనుకుంటారు, మరొకరు వినడానికి ఇష్టపడతారు. కానీ జంటగా, ఈ ఇద్దరు జన్మరాశులవారు ఒకరికొకరు సరిపోరు. ఇది ఎందుకంటే తమ రహస్యాలు పంచుకోవాల్సి వస్తే మీనరాశి వారు అస్సలు సౌకర్యంగా ఉండరు.

సింహం, వృషభం

సింహం, వృషభం

ప్రపంచంలో అత్యంత ఆశావాదులు సింహరాశివారు. జీవితంపట్ల వారి సానుకూల దృక్పథం వారి స్నేహితులలో ప్రతిబింబిస్తుంది. ఇలాంటివారు చాలా నమ్మకస్తులుగా ఉంటారు,వారికి చాలాకాలంగా తెలిసినవారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటారు. అందుకని, ఎప్పుడైనా పాత నమ్మకస్తుడైన స్నేహితుడు, జీవిత భాగస్వామి మధ్య ఎంచుకోవాల్సి వస్తే, వారు స్నేహితుడినే ఎంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటారు. వృషభరాశి వారు తమ మనస్సులో ఉన్నదంతా ఇతరులకి చెప్పేస్తుంటారు. అందుకని వినేవారు సానుకూల సింహరాశివారైతే, అది ఇద్దరికీ లాభమే. కానీ వృషభరాశివారు చాలా అహం కలిగివుంటారు, వారి భాగస్వామి తమకి అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోతే,వెంటనే మనస్సు పాడుచేసుకుంటారు. దీనివల్ల ప్రేమ విషయంలో సింహరాశి వారికి నచ్చరు.

తులారాశి,సింహరాశి

తులారాశి,సింహరాశి

వీరు చాలా నేర్పరులు, లౌక్యం తెలిసినవారు. ప్రాక్టికల్ గా సమస్యలు పరిష్కరించే నైపుణ్యం వలన వారు ప్రత్యేకమవుతారు. వారు ప్రేమించిన అందరితో నమ్మకంగా ఉండి, అదే ఆశిస్తారు. తులారాశికి చెందినవారు తమ భాగస్వామికి ప్రాణం ఇచ్చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. అవతలివారివైపునుంచి కూడా అదే ఆశిస్తారు. అదే తిరిగి దక్కకపోతే,వెంటనే ఆ బంధంలోంచి బయటపడిపోతారు. సింహరాశివారు మరోవైపు,అన్ని బంధాలపట్ల చాలా సానుకూలంగా ఉండి చాలా సమయం వెచ్చిస్తారు. ఇది తులారాశి వారికి నచ్చదు ఎందుకంటే వారు తమ భాగస్వాములకి తామే ప్రపంచంగా ఉండాలని ఆశిస్తారు. కానీ స్నేహితులుగా, ఈ అపార్థం చోటుచేసుకోదు, ఈ రెండు రాశులవారు ప్రాణస్నేహితులుగా ఉంటారు.

English summary

These zodiac signs are better off as friends than as a couple

Two people can be best friends than a couple. Yes, we may assume at times that your best friend can be your best partner. But, there are times when this is not true. If you think so, Cancer and Sagittarius can be really good friends forever than being the best couple. So is the case with Gemini and Capricorn.
Story first published: Wednesday, May 2, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more