For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కుంభరాశి వారి వద్ద అనకూడని ఏడు మాటలు

  By Gayatri Devupalli
  |

  ఈ నెలలో కుంభరాశి వారు ధైర్యవంతంగా, సాహసోపేతంగా అలాగే భయం లేకుండా ఉంటారు. ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ ప్రకారం మీరు ఈ నెలలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కలదు. ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారు. మీ తెలివితేటలు, ఉత్సాహం ఆలాగే నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యాన్ని తప్పక అభినందించి తీరాలి. ఈ నెల మీకు సానుకూలంగా ఉంటుంది. ఈ నెలంతా మీరు సంతోషంగా ఉంటారు. కుంభరాశికి చెందిన వారు దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. వీరు సందర్భానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు.

  అలాగే మృదుస్వభావం కలిగిన వారు. విభేదాలను నివారించేందుకు ప్రాముఖ్యం ఇస్తారు. వివిధ సోషల్ ఇష్యూల పట్ల వీరు ఆసక్తి కనబరుస్తారు. వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశికి చెందిన వారు ప్రకృతిని ఆరాధిస్తారు. సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగిస్తే వెనకడుగు వేయరు.

  Top 7 Things NOT To Say to an Aquarius

  వీరు స్వాప్నికులు. ఇతరులు అర్థం చేసుకోవాలని అనుకునే తత్త్వం కలవారు. మరోవైపు, వీరు తమ స్వతంత్రాన్ని హరించబడడాన్ని ద్వేషిస్తారు. మూవ్మెంట్ కి అనువుగా లేని చిన్న చిన్న స్పేస్ లలో చిరాకుకు గురవుతారు. ఈ లక్షణాలన్నీ ఈ రాశికి చెందిన వ్యక్తులను బాగా నిర్వచిస్తాయి. అయితే ఈ కుంభరాశివారి ఎట్టి పరిస్థిలోను ఈ ఏడు మాటలు అనకుండా ఉండటమే మంచిది... అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వీరిని ముభావంగా ఉండే వ్యక్తులని లేదా నిర్దయాహృదయులని అనకండి

  1. వీరిని ముభావంగా ఉండే వ్యక్తులని లేదా నిర్దయాహృదయులని అనకండి

  మీన రాశి వారి వలె వీరు కూడా రెండు లోకాల్లో విహరిస్తుంటారు. కానీ ఈ రెండు రాశుల వారి మధ్య ఉన్న ఒకే భేదం ఏమిటంటే కుంభరాశి వారు పదునైన మేధస్సు కలిగి ఉంటారు. ఏ విషయమైనా వీరి దృష్టిని దాటిపోవడం అరుదుగా జరుగుతుంది. వారు చూడటానికి ఏ విషయం పట్టించుకోరేమో అన్నట్టు కనిపించినా, పూర్తి పట్టు కలిగి ఉంటారు. కుంభరాశి వారి రూపాన్ని చూసి మోసపోకండి. వారు మీ మాట వినట్టుగా అనిపిస్తున్నా, వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వీరికి కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్తే, వారికి వారే మీ వద్దకు వస్తారు.

  2. వారిలో మూర్ఖత్వాన్ని వెతక్కండి

  2. వారిలో మూర్ఖత్వాన్ని వెతక్కండి

  కుంభరాశి వారు తమ మేధస్సును చూసుకుని మురిసిపోతారు. వారి మేధోపాటవాన్ని గౌరవించని యెడల, మీరు వారి మిత్రత్వాన్ని కోల్పోతారు. ఈ రాశి చిన్నారులు, వ్యక్తిగత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు, అసహజ హాస్య ధోరణికి మరియు చురుకుదనానికి పెట్టింది పేరు. ఈ రాశి వారు వివేకులు మరియు చమత్కారులై , విశ్లేషణాత్మక శక్తి కలిగి ఉంటారు. వారు భవిష్యత్తును గూర్చి దీర్ఘదృష్టి కలిగి ఉండి, తన తోటి వారితో పోలిస్తే అన్నిట్లో ముందు ఉంటారు. ఇది ఇతరులకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.

  3. వారి ఆలోచనలను కొట్టిపారేయకండి

  3. వారి ఆలోచనలను కొట్టిపారేయకండి

  ఈ రాశి వారికి అధిపతి కుజుడు, జ్యోతిషశాస్త్రంలొనే, విపరీత ధోరణికి పెట్టింది పేరు. విశ్వంలోనే, కుజగ్రహం అత్యంత అసాధారణమైన మరియు మిరుమిట్లుగొలిపే గ్రహంగా పరిగణింపబడుతుంది. తాత్కాలికమే అయినప్పటికీ- కూజాగ్రహం గొప్ప ప్రకాశం కలిగి ఉంటుంది. కుంభరాశివారు విప్లవాత్మక ఆలోచనలకు మరియు రాడికల్ భావజాలం పట్ల అపారమైన నమ్మకానికి పేరుగాంచారు. వారు గెలుపును సాధించినా, లేకపోయినా, తమ కలలను సజీవంగా ఉంచుకుంటారు.

  4. వారి జ్ఞానాన్ని ప్రశ్నించకండి

  4. వారి జ్ఞానాన్ని ప్రశ్నించకండి

  చార్లెస్ డార్విన్, మొజార్ట్, అబ్రహం లింకన్, యోకో ఒనో మరియు ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు కుంభరాశికి చెందినవారు. వారికి ప్రతి విషయంపై అవగాహన ఉండటం వలన, "మీకు తెలియదు" అనే వాక్యాన్ని అసహ్యించుకోవడమే కాక, వారికి తెలుసనే భావనను దృఢంగా నమ్ముతారు. ఇది వీరి స్వాభావిక లక్షణం. వారి నోటి నుండి "నాకు తెలియదు" అనే వాక్యాన్ని మీరు చాలా అరుదుగా వింటారు. అంతకంటే వారు "మీకు నా గురుంచి పూర్తిగా తెలియదు" అని అంటారు.

  5. వారిని విమర్శించకండి

  5. వారిని విమర్శించకండి

  మీ జీవిత భాగస్వామి లేదా బిడ్డలు కుంభరాశికి చెందినవారైనట్లైతే, మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధం చేసుకోవాల్సిందే! వీరు పరుషమైన నాలుక కలిగి ఉంటారు. వీరి మాటల్లో తీవ్రత అధికం- ఇది నిజం. మీరు "వారి మెప్పు పొందడానికి ఏమి చేయాలి?" అని అనుక్షణం మనసులో ఆలోచిస్తూ ఉండాలి. కుంభరాశి వారూ మీ మీద విసుగు చెందక పూర్వమే, వారిని మీరు తీయని మాటలతో మెప్పించాలి లేదా మోసగించాలి.

  6. ప్రయాణాలను అసహ్యించుకోకండి

  6. ప్రయాణాలను అసహ్యించుకోకండి

  మీరు ఈ మాటను వారితో అన్నారంటే కనుక, వారికి మీమీద ఉన్న ఆసక్తి పోతుంది. కుంభరాశి వారికి సాహసాలు చేయడమంటే మక్కువ ఎక్కువ. వారు తొందరగా విసిగిపోయే స్వభావం కలిగి ఉన్నందున, స్థలమార్పిడి వలన వారి మనస్సుకు ఉత్సాహం కలిగి, మస్తిష్కం తేలిక పడుతుంది. వారికి కొత్తవారిని కలవడం, వివిధ సంప్రదాయాలను అనుభూతి చెందడం, వంటకాలను రుచి చూడటంను ఇష్టపడతారు. వీరు గొప్ప అన్వేషకులు.

  7. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు

  7. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు

  కుంభరాశి వారు అల్పమైన విషయాలను పట్టించుకోరు. ఈ రాశివారు " జీవించు, జీవించనివ్వు" అనే సూత్రాన్ని నమ్ముతారు. వీరు వద్ద పట్టుదలకు పోవద్దు. అలా చేస్తే వారి గౌరవాన్ని కోల్పోతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో, వారు మీతో అనుబంధాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కుంభరాశికి చెందినవారిలో మానవత్వం ఎక్కువ. వీరు తరచుగా నిరసన ర్యాలీలు మరియు జంతు సంరక్షణ ఆశ్రయాలలో దర్శనమిస్తారు.

  English summary

  Top 7 Things NOT To Say to an Aquarius

  Top 7 Things NOT To Say to an Aquarius,కుంభరాశి వారి వద్ద అనకూడని ఏడు మాటలు
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more