For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశి ఫలాలు అక్టోబర్ 1 నుంచి 7 వరకు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి

|

జీవితమన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణంగా ఉంటాయి. కొన్ని రోజులు అంతటా సానుకూలంగా ఉన్నా, కొన్ని రోజులు మాత్రం గడ్డు రోజులు నడుస్తున్నాయి అన్న అనుభూతికి లోను చేస్తుంటాయి. కావున రాశి ఫలాలను అనుసరించి రాబోవు రోజులలో నిర్ణయాలు తీసుకునేలా కొందరు అడుగులు వేస్తుంటారు. జ్యోతిష్య పండితుల సూర్యమాన సిద్దాంతం ప్రకారం, ఇక్కడ ఈ వారం అక్టోబర్ 1, 2018 నుండి అక్టోబర్ 7, 2018 వరకు గల వార ఫలాలను పొందుపరచడం జరిగింది.

1. మేష రాశి : 21 మార్చి - 20 ఏప్రిల్

1. మేష రాశి : 21 మార్చి - 20 ఏప్రిల్

ఈ వారంలో మీ జీవితం మొత్తానికి పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ వారం మీ సంబంధాలలో మరియు వృత్తి కార్యకలాపాలలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు లేదా అపరిష్కృతమైన సమస్యలపై పనిచేయడానికి సరైన సమయంగా ఉంటుంది. అపరిపక్వ మనస్తత్వం నుండి దూరంగా ఉండాలని నిర్ధారించుకోండి. తెలివితేటలకు పని చెప్పాల్సిన సమయంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాకపోవచ్చు, ప్రత్యేకించి మీరు ఒక సంబంధం నుండి బయటకు వచ్చినప్పుడు, జాగ్రత్త తప్పని సరిగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మొదటికే మోసం తెస్తాయని మరవకండి.

మీ ఆర్ధిక స్థితిగతులు గడచిన కాలానుగుణంగానే ఉంటుంది కానీ, మార్పులు పెద్దగా కనపడకపోవచ్చు. ఈ వారం, వృత్తి మరియు కుటుంబ సంబంధిత అంశాలలో, చేతిలో పగ్గాలను తీసుకోవటానికి మరియు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుకు మార్గo సుగమం చేయడానికి, మరియు భవిష్యత్తులో ఆర్ధికపరమైన ఎదుగుదలకు సహాయపడే ఒక కార్యాచరణను నిర్మించడానికి ఉత్తమమైన సమయంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన విషయాలలో, కొందరు వ్యక్తులతో వీలైనంత దూరంగా మసలుకోవడమే మేలు. లేనిచో ఆర్ధిక, ఆరోగ్య సంబంధిత అంశాల పట్ల ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

2. వృషభ రాశి : 21 ఏప్రిల్ - 21 మే

2. వృషభ రాశి : 21 ఏప్రిల్ - 21 మే

ఈ వారం, మీరు మానసిక చైతన్యాన్ని కలిగి ఉండకపోతే, అదృష్టం మీనుండి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యతిరేక శక్తులు మీ మార్గంలో అడ్డంకులను కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని విస్మరించకుండా, ఆలోచనతో ముందుకు నడవండి. క్రమంగా ఫలితాలు మీ వెన్నంటే ఉంటాయి. వ్యాపారులు తమ ఉత్పత్తుల దృష్ట్యా పూర్తి శ్రద్ద వహించవలసి ఉంటుంది, మార్కెటింగ్ నైపుణ్యాలను పెంచుకోవడం మీద దృష్టి సారించాలి. మీ ఆలోచనా ధోరణి ఇక్కడ కీలకంగా ఉంటుంది. క్రమంగా వ్యాపారాభివృద్ధిలో ఆశాజనక ఫలితాలను చూడడం జరుగుతుంది. మీరు అవివాహితులై, కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎడల, ఈ వారం మీకు అనువైన సమయంగా ఉండనుంది.

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా ఈ వారం మీకు ఫలప్రదమైనవిగా ఉంటాయి. మరియు గత రోజులతో పోలిస్తే ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. క్రమంగా కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. క్రమంగా ఈ వారం, మానసికంగా చింతలు లేని జీవితం వలె ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి. అన్ని వేళలా గ్రహాలే కాదు, మానవ తప్పిదాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని మరువకండి. ముఖ్యంగా ఈ వారం దూర ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కావున, తగిన జాగ్రత్తలతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. కొన్ని వార్తలు మీకు సంతోషాన్ని అందివ్వగలవు.

3. మిధున రాశి : 22 మే - 21 జూన్

3. మిధున రాశి : 22 మే - 21 జూన్

ఈ వారంలో మీ వృత్తి మరియు వ్యాపారాల నందు కీలకమైన అభివృద్ధిని చూడగలుగుతారు. ముఖ్యంగా ఈ అభివృద్దిలో మీ పాత్రే కీలకంగా ఉండనుంది. కానీ మీ ఈ ప్రయత్నంలో కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. మీ కార్యాలయంలో మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందడం మీకు విజయానందంతో పాటు కూసింత విజయ గర్వాన్ని కూడా తీసుకుని వస్తుంది. కావున మీరు ఈ సమయంలో ఇతర వ్యక్తులతో వ్యవహరించే విధానంలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్త వహించడం మంచిది. లేనిచో కొన్ని విధానాలు, సంబంధాలను దూరం చేసే అవకాశాలు లేకపోలేదు. మరియు మీరు మెలిగే విధానమే మీ నిజమైన పాత్రను ధృవీకరిస్తుందని మరువకండి.

మీసంబంధాల పరంగా స్వీయ కేంద్రీకృతమై ఉంటారు, మరియు మీ ఈ పద్దతి భాగస్వామితో గొడవలకు ప్రధాన కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు మరియు వృత్తి సంబంధిత అంశాలలో కొన్ని మీకు అనుకూలంగా మారడాన్ని గ్రహించవచ్చు. కొన్ని అనుకోని షాపింగ్ ఖర్చుల మూలంగా ఆర్ధిక స్థితిగతులు కొంతమేర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఖర్చుల పట్ల శ్రద్దవహించండి.

4. కర్కాటక రాశి : 22 జూన్- 22 జూలై

4. కర్కాటక రాశి : 22 జూన్- 22 జూలై

ఈ వారం వృత్తిపరమైన అంశాలలో కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితిగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని చెప్పబడింది. కావున కొన్ని అదృష్టాలను ఒడిసిపట్టుకునే క్రమంలో ప్రతి అంశం పట్ల జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది. మీ మానసిక చైతన్యం కారణంగా మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు మీ విజయానికి తోడుగా ఉండడమే కాకుండా, మీ విజయం తమ విజయం అనేలా గర్వపడడం మీ సంబంధాల పటిష్టతను మీకు తెలియజేస్తుంది. అయితే, మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్ని చిన్ని చిడి తగాదాలు ఉన్నా, అవి మీ సంబంధాన్ని దెబ్బతీసేవిగా ఉండవు. కావున మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు, వారి మనస్థితిని అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది.

కలిసి కూర్చుని మీ వైరుధ్యాల మూలాలను కనుగొనటానికి ప్రయత్నిస్తే మీ సమస్యలు కొంతమేర తీరవచ్చు. వారు మీ కోసం మరింత శ్రద్ధ కనబరుస్తున్నారని గ్రహిస్తే, మానసికంగా అంగీకరించడానికి సిద్దంగా ఉండండి. రక్తపోటు ఉన్నవారికి ఉద్రిక్త వాతావరణం కూడదు అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా రక్త పోటు, హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు, కొన్ని వాగ్వాదాలకు దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఆర్దిక సామాజిక మరియు సంబంధాలపరంగా వారాంతానికి మంచి లాభాల దిశలో దూసుకుని వెళ్తారు.

5. సింహ రాశి : 23 జూలై - 21 ఆగస్టు

5. సింహ రాశి : 23 జూలై - 21 ఆగస్టు

ఈ వారం మీ స్పష్టమైన ఆలోచనలు మరియు వ్యూహ రచనలు, మీ వృత్తి మరియు సామాజిక అంశాలలో మీ లక్ష్యాలను సాధించడానికి సహాయం చేసేవిలా ఉంటాయి. అయితే, మీ వ్యక్తిగత జీవితం కొంతమేర అస్తవ్యస్తంగా ఉంటుంది మరియు మీ ఆధిపత్య ధోరణి మీ భాగస్వామితో అబిప్రాయ భేదాలకు కారణం కావొచ్చు. పరిస్థితిని నిలబెట్టుకోవటానికి బదులుగా, మీరు ఇచ్చే కొన్ని ఉచిత సలహాలు వారి మనసు నొచ్చుకునేలా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆర్థిక పరమైన అవకాశాలు అనేకం చూడవచ్చు.

పెట్టుబడులు పెట్టేముందు ఆవేశ పూరిత నిర్ణయాలకు తావివ్వకుండా, అన్ని విధాలా ఆలోచనలు చేసిన పిదప, మీ ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆశ్చర్యానికి లోనయ్యేలా, పూర్తిగా ఊహించని కొన్ని మూలాలు ఆదాయం తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సామాజిక సంబందాల ప్రకారం ఒడిడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున కొన్ని పార్టీలకు, మీటింగులకు దూరంగా ఉండడమే మంచిదిగా సూచించబడుతుంది.

6. కన్యా రాశి : 22 ఆగస్టు - 23 సెప్టెంబరు

6. కన్యా రాశి : 22 ఆగస్టు - 23 సెప్టెంబరు

మీ కార్యాలయం అంతటా, విషయాలు మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో దూరం చేసుకున్న వ్యక్తులే మీ సహాయానికి అవసరం పడవచ్చు. కానీ విరిగిన బంధాలను చక్కదిద్దేందుకు ఇది ఒక మంచి పరిణామంగానే భావించండి. కొన్ని వృత్తి, వ్యాపార అవకాశాలు మరియు అభివృద్ధి కొరకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కొంత బిజీ షెడ్యూల్ అనుసరించవలసి ఉంటుంది. రాజీలు చేయడం అనేది వ్యాపారంలో ఒక భాగం, ఒక్కోసారి కొన్ని చిన్న చిన్న అంశాలే పెద్ద లాభాలకు దారి తీస్తుంటాయని మనసులో ఉంచుకోండి. సందర్భానుసారం, మీ భాగస్వామి సలహాతో, లేదా మీ సన్నిహితులతో చర్చలు జరపడం ద్వారా ఊహించని ఫలితాలను పొందగలరు.

స్వల్పకాలిక పెట్టుబడులు ఈ వారంలో అసాధారణంగా లాభదాయకంగా ఉంటాయి. మీ కార్యాచరణ ప్రణాళికలు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత తీరిక లేని పనివేళలను మీరు అనుభవిస్తున్నా మీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపడం మాత్రం మరచిపోకండి. లేనిచో మీరు వారి పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని బాధపడే సూచనలు ఉన్నాయి.

7. తులా రాశి : 24 సెప్టెంబర్ -23 అక్టోబర్

7. తులా రాశి : 24 సెప్టెంబర్ -23 అక్టోబర్

తులా రాశి వారికి ఈ వారం వృత్తి, వ్యాపార పరంగా అత్యంత అనుకూలంగా ఉండనుంది. మీ వ్యంగ్య వ్యాఖ్యలు, హాస్య చతురత కొందరిలో అసహనానికి కారణం అవుతుంది. ముఖ్యంగా కొందరు ప్రత్యర్ధులు, అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారికి మీరు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదు అని నిర్ధారించుకోండి. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ వ్యక్తులతో సంభాషణలు లేకుండా ఉండేలా ప్రయత్నించండి. కొన్ని సందర్భాలలో నొప్పింపక తానొవ్వక తప్పించుకుని తిరగడమే మేలని గుర్తుంచుకోండి.

ఈ వారం మీ ఆర్ధిక స్థితిగతులు ఆశాజనకంగా లేవు. మీరు మీ ఖర్చులతో అత్యంత జాగ్రత్తగా ఉండని ఎడల, మీ ప్రియమైన వారి నుండి సైతం ఆర్థిక సహాయానికి ఆలోచనలు చేయవలసి ఉంటుంది.

ముఖ్యంగా మీనుండి, అరువుకు ఆశించే వారి సంఖ్య పెరుగుతుంది. మొహమాటానికి కాదనలేక, మీరు ఇబ్బందుల పాలయ్యే సూచనలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామి పరంగా, మీకు వారి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎదుర్కొనే క్లిష్ట సమయాల్లో వారి తోడ్పాటు, కొన్ని అపార్థాలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. అన్నిటికన్నా మీకు స్వావలంభన ఇచ్చే విషయం ఏమిటంటే, మీ భాగస్వామితో అత్యుత్తమ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారే మీ బలం, వారే మీ బలహీనత అనేలా. సామాజికంగా, కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని సంబంధాల పట్ల జాగ్రత్త అవసరం. కానీ ఆర్ధిక పరమైన అంశాల పరంగా, మిమ్ములను అవసరానికి వాడుకుని వదిలేసే వారు కూడా లేకపోలేదు అని గుర్తుంచుకోండి., వేసే ప్రతి అడుగూ ముఖ్యమైనదే అని నిర్ధారించుకోండి. ఒక్కోసారి పేరు తెచ్చిపెట్టే వ్యక్తులే వెనుక గోతులు తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యంపట్ల శ్రద్ద అవసరం. డిప్రెషన్, ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

8. వృశ్చిక రాశి : 24 అక్టోబరు- 22 నవంబర్

8. వృశ్చిక రాశి : 24 అక్టోబరు- 22 నవంబర్

వృశ్చిక రాశి వారు, వృత్తిపరమైన అంశాలలో ఎన్నో హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు. సానుకూల దృక్పధంతో అడుగులు ముందుకు వేయండి, చివరికి ఫలితాలు మీ సొంతమవుతాయి. ఎప్పటికప్పుడు వాస్తవిక ధోరణిని అలవరచుకుంటూ, సమయానుసారం నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండేలా మీ ఆలోచనా విధానాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ ప్రియమైన వారే మీకు చేదోడువాదోడుగా ఉంటారు. మీ భాగస్వామి ఆలోచనలు మీకు సహకారం అందివ్వగలవు.

వారి నిర్ణయాలకు మద్దతునివ్వండి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆర్థికపరమైన అంశాలనందు, మీ తల్లిదండ్రుల సలహా మీకు ఉత్తమంగా పని చేస్తుంది. సాధారణ వ్యాయామ నిబంధనలకు బదులుగా, మీ ట్రైనర్ సూచించిన ప్రకారం కొన్ని నూతన విధానాలను అవలంభించడం అలవరచుకోండి. ఆరోగ్యం పరంగా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంత జాగ్రత్త తప్పనిసరి.

9. ధనుస్సు రాశి : 23 నవంబర్ - 22 డిసెంబర్

9. ధనుస్సు రాశి : 23 నవంబర్ - 22 డిసెంబర్

వృత్తి పరమైన అంశాలలో మీకు సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వసాధారణంగానే ఉంటాయి. బదులుగా, కొన్నిటిని ముఖ్యమైనవిగా భావించి, ఫలితాలను ఉత్తమంగా ఇచ్చేలా కృషిచేయండి. మీ కృషే మీకు పేరును తీసుకొస్తుందని మరవకండి. నక్షత్రాలు అనుకూలమైన స్థితిలో లేనందున మీ ఆర్థిక స్థితిగతులు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కొంతకాలం మీ డబ్బును పెట్టుబడికి పెట్టకుండా, సురక్షితంగా మీవద్దనే ఉంచండి.

సమయమే మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సమయంలో మీ భాగస్వామి తోడ్పాటు మీకు అండగా ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్వీయ వైద్యానికి బదులుగా వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమంగా సూచించబడింది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తడం లేదా, వేధించడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి.

10. మకర రాశి : 23 డిసెంబర్ -20 జనవరి

10. మకర రాశి : 23 డిసెంబర్ -20 జనవరి

మీరు మీ కార్యాలయాలలో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఈ వారం మీకు అనువుగా ఉంది. మీ యజమాని నుండి ప్రశoసలు కూడా అందుతాయి. వ్యాపార లావాదేవీలనందు, ఇదివరకటి కన్నా ఉత్తమ ఫలితాలు గోచరించే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మెచ్చుకోలుతో కూడిన ప్రతిఫలాలు మిమ్ములను సంతోషంలో ముంచెత్తవచ్చు. ఏదిఏమైనా ఆర్ధికసంబంధిత అంశాలలో కాస్త ఒడిదుడుకులు తప్పని సరి. ఈ సమస్యలన్నీ తర్వాతి వారంలో పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి చింతించకండి. వృత్తియందు మీ నిబద్దత, కొన్ని ముఖ్యమైన విషయాలను త్యజించేలా చేస్తుంది. వీటికి మీరు అదనపు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది కూడా. ఎన్ని అడ్డంకులు ఉన్నా, కొన్ని విషయాలలో కుటుంబసభ్యుల అభ్యర్ధనలను విస్మరించకూడదని నిర్ధారించుకోండి. మీ శారీరక శ్రమకు మానసిక ఆరోగ్యం తోడుగా ఉంటే విజయావకాశాలు మీ వెన్నంటే ఉంటాయని గుర్తుంచుకోండి.

11. కుంభ రాశి : 21 జనవరి- 19 ఫిబ్రవరి

11. కుంభ రాశి : 21 జనవరి- 19 ఫిబ్రవరి

మీరు ఎన్నుకొన్న వృత్తిలో మీ సృజనాత్మతకు చోటులేదని మీరు భావిస్తున్న ఎడల, మీరు మీ ఉద్యోగాన్ని మారుటకు మంచి సమయంగా ఈ వారం ఉండనుంది. మీకు ఉద్యోగ అవకాశాలు కాస్త మెండుగానే ఉంటాయి. క్రమంగా మీ సృజనాత్మకతకు తగ్గ గౌరవం లభించే వృత్తిలో కొనసాగేలా చర్యలు తీసుకోవచ్చు. కొన్ని కీలకమైన నిర్ణయాలనందు, మీ భాగస్వామి ఆలోచనా విధానం మీకు సహాయపడగలదు. ఎట్టిపరిస్థితుల్లో వారి మాటను విస్మరించకండి. మరియు మీ నిర్ణయాలలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశావకాశాల కోసం ఎదురుచూసే విద్యార్థులు, వారికి అనుకూలమైన విషయాలు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆరోగ్యం మీద కాస్త దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మధుమేహం, ఉబ్బసం మరియు రక్తపోటు సంబంధిత సమస్యలతో భాధపడేవారు.

12. మీన రాశి : 20 ఫిబ్రవరి- 20 మార్చి

12. మీన రాశి : 20 ఫిబ్రవరి- 20 మార్చి

ఈ వారం మీ కార్యాలయంలో కొన్ని గణనీయ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వర్గవిభజన మిమ్ములను కొంత భాదపెట్టే సూచనలు ఉన్నాయి. కొందరు మీకు సానుకూలంగా స్పందిస్తే, కొందరు వ్యతిరేకులుగా ఉంటారు. అయితే, మీ వ్యూహాత్మకత మరియు దౌత్య పరమైన తెలివితేటల కారణంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటపడగలరు. మీ తెలివితేటలే మీ ఆయుధం అని మరువకండి. వ్యక్తిగతంగా, మీ భాగస్వామికి మరియు మీకు మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు, వీలైనంత త్వరగా ఈ విషయాలని పరిష్కరించడానికి, మీకు సహాయం చేసే కమ్యూనికేషన్ చానెల్స్ ఉన్నాయని నిర్ధారించుకోండి. లేనిచో సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ గ్రహాల స్థితిగతుల కారణంగా మీ ఆలోచనా విధానం ఈ వారం ఉత్తమంగా పనిచేస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ప్రబలమవుతాయి. క్రమంగా మీ సంబంధాలు మెరుగవుతాయి.

ఆర్ధిక పరమైన సమస్యలు ఉండవు. కాకపోతే, భవిష్యత్ ప్రణాళికలు చేసుకోవలసిన సమయంగా ఈ వారం ఉంటుంది. ఆరోగ్యం పరంగా శ్రద్దవహించడం మంచిది. కొన్ని సంక్రమణ వ్యాధులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కావున వైద్య పర్యవేక్షణ అవసరమని నిర్ధారించుకోండి. మీరు తరచుగా స్వీయ వైద్యానికి పూనుకుంటూ ఉంటారు. కానీ అన్ని వేళలా స్వీయ వైద్యం పనికి రాదని గుర్తుంచుకోండి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా వెంటాడవచ్చు. కావున వ్యాయామం, మరియు జీవన శైలిలో మార్పుల గురించిన ఆలోచనలు తప్పనిసరి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Weekly Horoscope for 01 october 2018 to 07 october 2018

Life is full of ups and downs. While some days have more ups, some days may be down. Find out all about your week ahead in our weekly integrated horoscope from 1st October to 7th October 2018 below.
Story first published: Monday, October 1, 2018, 17:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more