ఈ ప్రపంచంలోని అర్ధంలేని మూడనమ్మకాలు

Subscribe to Boldsky

తరాల నుండి ఆచరిస్తున్న కొన్నిఅసంబద్దమైన, అర్ధం లేని కొన్ని నమ్మకాలు సైన్సు నిరూపణ ద్వారా అవగాహనకు వచ్చాక అవి మూడనమ్మకాలు అని తెలిసి ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవిక ప్రపంచంలోకి వస్తున్నారు. కాని ఇంకా కొందరు వాటిని గుడ్డిగా అనుసరిస్తూనే ఉన్నారు శోచనీయంగా. కాని కొన్ని మూడనమ్మకాల ఉనికిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సరైన ఆధారాలు లభించక పరిశోధనలు అచేతనంగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. కొన్నిటికి అయితే ఇప్పటికీ సమాధానాలు అంతుచిక్కడం లేదు.

ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా వేల సంవత్సరాలుగా కొందరు ప్రజలు నమ్ముతున్న కొన్ని మూడనమ్మకాలను పొందుపరచడం జరిగినది.

వీటిని గమనించాక, ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారా ఈ ఆధునిక యుగంలో అన్న ప్రశ్న మీ మదిలో మెదులుతుంది.

బ్రెడ్ నమ్మకం!

బ్రెడ్ నమ్మకం!

ఫ్రెంచ్ ప్రజల విశ్వాసం ప్రకారం, బోర్లించిన బ్రెడ్ టేబుల్ పై ఉంటే, ఆకలి మరియు దురదృష్టాన్ని బ్రెడ్ ఇచ్చినవారికి, గ్రహీతకు ఇద్దరికీ తెచ్చిపెడుతుంది అని నమ్ముతారు. కావున బ్రెడ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు.

టేబుల్ నమ్మకం!

టేబుల్ నమ్మకం!

ఈ రూమర్ ప్రారంభమే ఒక ఆశ్చర్యం అని చెప్పాలి. రష్యాలో పెళ్ళికాని యువతీ యువకులు ఏదైనా టేబుల్ యొక్క కార్నర్ లో కూర్చోవడం వలన భాగస్వామి ఎంపికలో మరియు పెళ్ళి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు.

పైకప్పు టైల్స్ నమ్మకం!

పైకప్పు టైల్స్ నమ్మకం!

జర్మనీలో ఎవరైనా మరణించే సమయంలో కష్టాలు పడుతుంటే, ఆ ఇంటి పైకప్పున 3 పలకలు తొలగించుట ద్వారా మరణం తేలికపాటి అవుతుందని నమ్ముతారు. అనగా ఆత్మ ప్రయాణించే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు, ద్వారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సులభతరం చెయ్యవచ్చు అని వీరి నమ్మకం.

తెలుపు రంగు నమ్మకం!

తెలుపు రంగు నమ్మకం!

మీరు చైనాలో ఉన్నట్లయితే, మీరు ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడం కోసం మీరు ఈ నమ్మకం గురించి తెలుసుకోవాలి. అక్కడి ప్రజలు తెలుపు రంగు అనేది మరణం మరియు సంతాపంతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. తెల్లరంగులో ఉండే గ్రీటింగ్ కార్డు ఆహ్వానాలు లేదా పువ్వులు పంపడం వంటివి అక్కడ చెయ్యరాదు.

నిప్పు కూడా ఒక మూడనమ్మకం ఇక్కడ!

నిప్పు కూడా ఒక మూడనమ్మకం ఇక్కడ!

రష్యాలో అనారోగ్యంతో ఉన్న జంతువులు, మంటలు, లేదా ముందు రోజు ఉదయం తగలబెట్టబడిన ప్రదేశం ద్వారా వెళ్తాయని నమ్ముతారు!

నిద్ర నమ్మకం!

నిద్ర నమ్మకం!

జపాన్లో, ఎవరైనా వ్యక్తి నిద్రించు సమయంలో ఉత్తరం వైపు తలపెడితే వారి ఆయుష్షు తగ్గుతుంది అని నమ్ముతారు. ఇది మనదేశంలో కూడా ఉంది. కాని చనిపోయినప్పుడు మాత్రం అతని తలని ఉత్తరం వైపు ఉండునట్లే ఉంచి ఖననం చేస్తారు. అది ఎందుకో అర్ధం కాదు.

చూయింగ్ గం నమ్మకం

చూయింగ్ గం నమ్మకం

టర్కీలో, చూయింగ్ గమ్ ఊయడం ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇక్కడ ప్రజలు ఒక వ్యక్తి రాత్రి గమ్ నమలడం చేస్తే , వారు కుళ్ళిపోయిన మాంసాన్ని నములుతున్నట్లుగా నమ్ముతారు.

రింగ్ బెల్స్ నమ్మకం!

రింగ్ బెల్స్ నమ్మకం!

క్వీన్ ఎలిజబెత్ పాలనలో రింగ్ బెల్స్ నమ్మకం వచ్చింది. ఇది రెండు కారణాల వల్ల చేస్తారు. మంచం పాదాల వద్ద నిలబడిన దుష్టఆత్మలను తరమడానికి ఒకటైతే , మరొకటి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగజేయడం కోసం.

అలాంటి విచిత్రమైన నమ్మకాల గురించి మీకు మరేమన్నా తెలుసా? అయితే, క్రింద వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Superstitions That People Believe In | Bizarre Superstitions That People Believe Around The World

    There are many superstitious things that people have been following around the world. These beliefs seem too bizarre to even be believed in, let alone people following them. For example, chewing a gum at night in parts of Turkey is actually considered to be chewing rotting dead flesh!
    Story first published: Friday, March 9, 2018, 9:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more