ఈ ఏప్రిల్ నెలలో మీ రాశిచక్రాల ప్రభావాలు ఇలా ఉంటాయి .. !

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ ఏప్రిల్ మాసంలో మీ రాశిచక్రాల ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వ్యాసం మీకోసమే.

ప్రతి ఒక్కరికీ రేపటి గురించిన ఆలోచనలు ఉండడం సహజం. తద్వారా తర్వాతి నెలలో , తర్వాతి సంవత్సరంలో అయినా ఇలా జరిగితే బాగుటుంది అని ఊహాగానాలు చేస్తుండడం సహజం.

what-each-zodiac-sign-should-look-forward-to-in-april

మరియు జరుగుతున్న కాలాల మీద నిర్దేశిత లక్ష్యాలు కూడా ఉంటాయి, వాటి ఫలితాల గురించిన ఆలోచనలు మనసును ఉక్కిరిబికిరి చేస్తుంటాయి. ఇక్కడ మీ రాశి చక్రాలు ఈ ఏప్రిల్ మాసంలో ఎలాంటి ఫలితాలను ఇవ్వనున్నాయో తెలుపబడినది. తద్వారా మీరు ఒక అంచనా ఏర్పరచుకుని ముందుకు సాగగలరని ఆశించడమైనది.

మేషం మార్చి21–ఏప్రిల్19

మేషం మార్చి21–ఏప్రిల్19

ముఖ్యంగా మీరు మీ మానసిక బలాన్ని గుర్తెరిగి, తద్వారా మీరు లక్ష్యాల నందు ఆలోచనలు జరపాలి. మీకష్టానికి ప్రపంచంతోడుగా నిలిచి మిమ్ములను లక్ష్యసాధనలో గెలుపు దిశగా అడుగులు పడేలా చేయగలదు. మరో వైపు మీరు మీ ఆద్యాత్మికభావనలను కూడా గౌరవించాల్సి ఉంటుంది, తద్వారా మీరు మనశ్శాంతి, దైవానుగ్రహాలతో లక్ష్యసాధనలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు. మరియు మీకు మీకుటుంబo నుండి స్నేహితులనుండి పూర్తి సహకారం ఉంటుంది. కావున మీలక్ష్యానికి సంబంధించిన విషయాలను చర్చించడంలో వెనకడుగు వేయకండి.

వృషభం ఏప్రిల్20–మే20

వృషభం ఏప్రిల్20–మే20

మీరు మీ వ్యక్తిత్వలక్షణాలను మరియు మానసిక బలాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. మీ ఆరోగ్యపరమైన విషయాలలోకూడా జాగ్రత్త తీసుకొనవలసి ఉంటుంది. మీకు విశ్రాంతి అవసరం అని మీరు గ్రహించాలి. మరోవైపు మీ ఉన్నతమైన ఆలోచనలతో లక్ష్యసాధనలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలనైనా ఎదుర్కుని ధైర్యంగా ముందుకు సాగగలరు. కానీ ఉన్నపళంగా ఆలోచనలను ఏప్రిల్ చివరి రోజులలో చేయకండి.

మిధునo మే21–జూన్20

మిధునo మే21–జూన్20

మీరు ఊహాలోకంలో ఎక్కువగా ఉంటారు. ఈ ఊహాలోకం మీ నిజజీవితంపై ప్రభావం చూపనుందని గ్రహించాలి. మీరు కోరుకున్నవి వరుసగా జరగడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. మీ వృత్తిపరoగా, కుటుంబపరoగా సానుకూల దృక్పధాలు ఏర్పడి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తాయి. కానీ మీరు ఎక్కువగా ఆశిస్తున్న లక్ష్యం గురించిన జాగ్రత్త తీసుకోవడంలో మాత్రం ఏమరపాటు పనికి రాదు.

కర్కాటకం జూన్21-జూలై22

కర్కాటకం జూన్21-జూలై22

మీరు ఈనెలలో అత్యంత శక్తివంతులుగా కనిపిస్తుంటారు, ముఖ్యంగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించడం లేదా, మీ వృత్తిపరంగా కొన్ని విజయాలు సాధించే లక్షణాలు ఈ రాశి చక్రంలో కనిపిస్తున్నాయి. మరో వైపు మీ ఊహకు కూడా అందని, మీ ఆలోచనలతో దగ్గరగా ఉండే కొత్త వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది, మీ భావాలను వారితో పంచుకునేందుకు సుముఖంగా ఉంటారు కూడా. ఈనెల మద్యలో మీ సంబంధoలో సానుకూల ఫలితాలు కనపడే సూచనలు కనిపిస్తున్నాయి.

సింహం జూలై23-ఆగస్ట్23

సింహం జూలై23-ఆగస్ట్23

మీరు మీ పాతజ్ఞాపకాలను మరియు సంఘటనలను ప్రతికూల పరిస్థితులను పక్కన పెట్టి, కొత్త జీవితం దిశగా అడుగులు వేయడానికి సిద్దంగా ఉంటారు. ఇక్కడ మీ లక్ష్యసాధనకై మీ తెలివితేటలకు పని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తిని కనపరుస్తారు, మరియు మీ స్నేహితులతో సంబంధాలు మీకు మానసిక ఆనందాన్ని కలగజేస్తాయి. ఈ నెల చివరిలో మీ జీవితంలో కొన్ని స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, మీ తెలివితేటలకు పని చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

కన్య ఆగస్ట్24- సెప్టెంబర్23

కన్య ఆగస్ట్24- సెప్టెంబర్23

మీసహనాన్ని పరీక్షించే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవనంలో. మరియు కొన్ని ఒత్తిడులను కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి చట్టపరమైన సమస్యలు కూడా కావొచ్చు. మీరు అత్యంత జాగరూతులై మెలగవలసిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ మీకు ఓర్పు,సహనం ఖచ్చితంగా అవసరం.

తుల సెప్టెంబర్24-అక్టోబర్23

తుల సెప్టెంబర్24-అక్టోబర్23

ఈనెలలో మీ భాగస్వామితో ఎంతో సంతోషంగా సంబంధాలను కొనసాగిస్తారు. లేదా మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న వారు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు మీ భాగస్వామికి మద్య అన్యోన్యత పెరుగుతుంది . తద్వారా రాబోవు రోజుల గురించిన భవిష్యత్ కార్యాచరణల విషయంలో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుoటారు. తద్వారా మీ సంబంధాన్ని ఉన్నతంగా మలచడమే కాకుండా, లక్ష్య సాధనలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా చూడగలరు.

వృశ్చికం అక్టోబర్24-నవంబర్22

వృశ్చికం అక్టోబర్24-నవంబర్22

మీ స్నేహసంబంధాలు, మరియి కుటుంబ సంబంధ భాంధవ్యాలు మెరుగుపడడంలో ఈ మాసం మీకు ఉపయుక్తంగా ఉంటుంది . ఈ మాసంలో మీరు ఆహార ప్రణాళికలపైన మరియు వ్యాయామాల మీద దృష్టిసారించవలసి ఉంటుంది. తద్వారా ఎన్నో సానుకూల ఫలితాలను మీరు మీ మార్గంలో చూడగలరు.

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

మీరు మీ భయాలకు , అభద్రతా భావాలను పక్కన పెట్టి మీ సంబంధాల నిలుపుదలకై కృషిచేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈ మాసం చివరలో ఆర్ధిక పరమైన సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నది. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోని పక్షంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది .

మకరం డిసెంబర్23 – జనవరి20

మకరం డిసెంబర్23 – జనవరి20

ఈ నెలలో మీరు మీ కుటుంబానికి ,మీ సంబంధాలకు ప్రాధాన్యతని ఇచ్చేలా ఉంటుంది. మీ జీవితానికి మీరు కొన్ని లక్ష్యాలను ఒక ప్రణాళికా బద్దంగా నిర్మించుకుంటారు, ఇవి కుటుంబంలోసమాజంలో మీ గౌరవ ప్రతిష్టలను పెంచుతాయి. తద్వారా మీరు ఇతరులకు ఆదర్శంగా కనిపిస్తారు. మీరు కొన్నిలక్ష్యాలను సాధించడం ద్వారా నలుగురికీ ఉన్నతంగా కనిపిస్తారు, మీ ఆర్ధిక పరిస్తితి కూడా మెరుగవుతుంది.

కుంభం జనవరి21 – ఫిబ్రవరి18

కుంభం జనవరి21 – ఫిబ్రవరి18

మీ లక్ష్యసాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి, కావున ప్రతి అడుగులోనూ ప్రత్యేకమైన శ్రద్దను తీసుకోవలసి ఉంటుంది. జాగ్రతత్ లేని పక్షంలో మీకు సవాళ్ళు ప్రతిసవాళ్ళతోనే ఈ నెల గడుస్తుంది. కానీ కొందరు నమ్మక ద్రోహులు మీ మార్గంలో ఎదురవుతారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సివస్తుంది.

మీనం ఫిబ్రవరి19- మార్చి 20

మీనం ఫిబ్రవరి19- మార్చి 20

మీరు ఆర్ధికపరమైన ఎదుగుదలను చూస్తారు. ఆర్ధికంగా, ఆద్యాత్మికంగా,తెలివితేటల పరoగా ఎన్నో సానుకూల అంశాలు మీకు తొడవుతాయి. మీ జీవితానికి అవసరమైనవి, అవసరంలేనివి అని నిర్ధారించుకుని లక్ష్య సాధనలో ప్రణాళికలు వేసుకుని రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. తద్వారా సమాజంలో, కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

English summary

ఈ ఏప్రిల్ నెలలో మీ రాశిచక్రాల ప్రభావాలు ఇలా ఉంటాయి .. !

what-each-zodiac-sign-should-look-forward-to-in-april,