For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెహ్రూ, ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ లది శారీరక సంబంధమేనా?

ఎడ్వినా తో నెహ్రూ నడిపిన ప్రేమ వ్యవహారం పబ్లిక్ గా తెలిసిందే. ఎడ్వినా కోసం నెహ్రూతోపాటు ముస్లిం లీగ్‌ అధినేత జిన్నా కూడా ప్రయత్నించేవాడట. ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడించిందని ఓ టాక్.

By Bharath
|

జవహర్‌ లాల్‌ నెహ్రూ మంచి నాయకుడు. ఆయనకంటూ భారతదేశ చరిత్రలో కొన్ని పేజీలున్నాయి. కానీ ప్రతి ఒక్కరికీ ఒక మైనస్ పాయింట్ ఉంటుందన్నట్లు నెహ్రూ కూడా కొన్ని మైనస్ పాయింట్లుండేవి. ఆయనకు కొంతమంది మహిళలతో అక్రమ సంబంధాలుండేవని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.

జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య ఏదో సంబధం ఉండడం వల్లే వారిద్దరూ అంతగా రాసుకుని పూసుకుని తిరిగేవారని టాక్.

శారీరక సంబంధం లేదు

శారీరక సంబంధం లేదు

అయితే తన ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూకు శారీరక సంబంధం లేదని భారత చిట్టచివరి వైస్రాయ్‌ లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటెన్‌ కుమార్తె పమేలా హిక్స్‌ ఆ మధ్య చెప్పారు. వారిద్దరి మధ్య పరస్పరం అనురాగం ఉన్న సంగతి వాస్తవమేనట.

బలమయిన సంబంధం

బలమయిన సంబంధం

మౌంట్‌బాటెన్‌ భారత వైస్రాయ్‌గా వచ్చినప్పుడు పమేలా హిక్స్‌ వయస్సు 17 ఏళ్లు. జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య బలమయిన సంబంధం పెరుగుతోందని అప్పుడు తనకు అనిపించేదట.

ఇంకా తెలుసుకుంటా

ఇంకా తెలుసుకుంటా

జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య ఉన్న సంబంధం గురించి పమేలా హిక్స్‌ ఇంకా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందట. నెహ్రూ తన తల్లికి రాసిన లేఖల ద్వారా నెహ్రూ అంతరంగాన్ని, తన తల్లిపట్ల ఆయనకున్న ఉన్న భావనలను గమనించిదట పమేలా హిక్స్‌.

నాకు బాగా కుతూహలం

నాకు బాగా కుతూహలం

జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య ఎంత గాఢానురక్తి ఉన్నదీ, పరస్పరం ఎంతగా గౌరవించుకుందీ పమేలాకు బాగా అర్థమైందట. వారి అనుబంధం శారీరకమా కాదా అన్నది తెలుసుకోవాలన్న కుతూహలం పమేలాకు ఉండేదట.

లేఖలు చదివాకా..

లేఖలు చదివాకా..

జవహర్‌ లాల్‌ నెహ్రూ మా అమ్మ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు రాసిన లేఖలు చదివిన తర్వాత వారి మధ్య ఉన్న అనుబంధం శారీరక సంబంధం కాదని పమేలాకు అర్థం అయ్యిందట. వారి మధ్య ఏకాంతానికి దాదాపుగా సమయమే ఉండేదికాదట.

వాళ్ల మధ్య వీళ్లు ఎలా గడుపుతారు

వాళ్ల మధ్య వీళ్లు ఎలా గడుపుతారు

జవహర్‌ లాల్‌ నెహ్రూ మా అమ్మ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ చుట్టూ ఎప్పూడూ సిబ్బంది, పోలీసు బలగం, ఇతరులు ఉండేవారు. అలాంటి వారి మధ్య వీరు ఎలా ఏకాంతంగా గడిపి శారీరక సంబంధాన్ని పెట్టుకోగలుతారని పమేలా డౌట్. అస్సలు అది జరిగి ఉండదు.

అన్నీ బుక్ లో రాశా

అన్నీ బుక్ లో రాశా

జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య జరిగిన విషయాల్లో తనకు తెలిసిన వాటిని బుక్ లో రాసింది పమేలా. డాటర్‌ ఆఫ్‌ ఎంపైర్‌: లైఫ్‌ యాజ్‌ ఎ మౌంట్‌బాటెన్‌ అనే పుస్తకంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు మధ్య జరిగిన విషయాలు పమేలా వివరించింది.

ఉంగరం ఇద్దామనుకుంది

ఉంగరం ఇద్దామనుకుంది

"జవహర్‌ లాల్‌ నెహ్రూకు మా అమ్మ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ భారత్‌ ను వీడే ముందు మరకతపు ఉంగరాన్ని ఇవ్వాలనుకుంది. కానీ ఆయన అందుకు అంగీకరించరన్న సంగతి అమ్మ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ కు తెలుసు. అందుకే ఇందిరకు ఇచ్చారు." అని పమేలానే ఆ మధ్య ఒక సారి స్వయంగా చెప్పింది.

ఉంగరాన్ని అమ్ము

ఉంగరాన్ని అమ్ము

"నెహ్రూ దాతృత్వానికి పెట్టింది పేరు. ఎప్పుడైనా ఆయనకు ఆర్థిక సమస్యలు ఎదురయితే ఆయన కోసం ఆ ఉంగరాన్ని అమ్ము అని ఇందిరకు మా అమ్మ చెప్పింది." అని పమేలానే చెప్పింది.

చక్కని సాంత్వన

చక్కని సాంత్వన

మౌంట్‌బాటెన్లకు వీడ్కోలు ఇస్తూ ఎడ్వినాను ఉద్దేశించి నెహ్రూ చాలా మాట్లాడారు. ఎడ్వినా ఎక్కడకు వెళ్లినా ఓ చక్కని సాంత్వన. ఒక చిరు ఆశ. గొప్ప ప్రోత్సాహాన్ని వెంట తీసుకొస్తారు అని నెహ్రూ స్వయంగా చెప్పారు.

చివరి వైస్రాయ్

చివరి వైస్రాయ్

మౌంట్‌బాటెన్‌ బ్రిటీష్-ఇండియా చివరి వైస్రాయ్ గా 1947 ఫిబ్రవరి 12 నుంచి ఆగస్టు 15దాకా భారతదేశంలో ఉన్నారు. అనంతరం స్వతంత్ర భారత గవర్నర్‌ జనరల్‌గా 1948 జూన్‌ 21దాకా వ్యవహరించారు. ఆయన వైస్‌రాయ్‌గా ఇక్కడకు వచ్చేటప్పటికి పమేలా వయసు 17 ఏళ్లు.

చాలా మందితో సంబంధాలు

చాలా మందితో సంబంధాలు

లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ భార్యా అయిన ఎడ్వినా మౌంట్‌బాటెన్‌కు జవహర్‌లాల్ నెహ్రూతో పాటు చాలా మందితో సంబంధాలున్నట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. చార్లెస్టన్, ఫ్రెడ్ అస్టైర్ వంటి వారితో పాటు.. అనేక మంది ప్రముఖులకు ఎడ్విన్ మౌంట్‌బాటెన్‌కు సంబంధాలు ఉన్నట్టు లండన్ పత్రికలు పలు రకాల కథనాలను అప్పట్లో ప్రచురితమయ్యాయి.

భార్యాభర్తలకు అంతగా పడేది కాదట

భార్యాభర్తలకు అంతగా పడేది కాదట

ఎడ్వినా, ఆమె భర్త లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్‌ లు మంచి దంపతులుగా అందరి దగ్గర పేరు పొందారు. అయితే వారిద్దరి వైవాహిక జీవితం బాగుండేది కాదంట. వీరిద్దరు ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ వేర్వేరు బెడ్ రూమ్ లను ఉపయోగించేవారంట. అలాగే వేర్వేరు జీవితాలు గడిపారంట.

ఆధ్యాత్మిక సంబంధమే

ఆధ్యాత్మిక సంబంధమే

ఇక పండిట్ నెహ్రూతో తన తల్లికి కేవలం ఆధ్యాత్మికపరమైన సంబంధాలు మాత్రమే ఉండేవని పమేలా చెప్పారు. ఇద్దరూ ఒంటిరితనంతో బాధడేవారన్నారు. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఒకరికొకరు సహాయం చేసుకునే వారంట.

కాశ్మీరీ పండిట్

కాశ్మీరీ పండిట్

జవహర్ లాల్ నెహ్రూ పండిట్ వంశస్ధుడే. మోతీలాల్ నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులకు చెందినది. జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీరీ పండిట్ ల వంశంలో జన్మించారు. వారి కుటుంబం 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఇండియాకు వలస వచ్చింది.

ఆయనేం పండితుడు

ఆయనేం పండితుడు

‘డిస్కవరి ఆఫ్ ఇండియా' పుస్తకం రాశారు కనుక ఆయన మేధో సంపద కలిగిన పండితుడు అని వాదించేవారు ఉన్నారు. కానీ చదువులో ఆయన పెద్దగా రాణించలేదు అన్న సంగతి తెలిసినవారు మాత్రం ‘ఆయనేం పండితుడు?' అని ప్రశ్నిస్తారు.

చదువు

చదువు

తన 16వ యేట వరకు ఆంగ్ల ట్యూటర్ల వద్ద విద్యాభ్యాసం నెరిపిన జవహర్ లాల్ నెహ్రూ అనంతరం లండన్ లోని హ్యారో స్కూల్ లో చేరి చదువుకున్నారు. హ్యారో స్కూల్ లో చేరక ముందు ఒక భారతీయ ట్యూటర్ వద్ద హిందీ, సంస్కృతం నేర్చుకున్నారని చెబుతారు. హ్యారో స్కూల్ తర్వాత ట్రినిటీ కాలేజీలో, ఆ తర్వాత కేంబ్రిడ్జిలో ఆయన చదివారు. కేంబ్రిడ్జిలో నేచురల్ సైన్స్ లో హానర్స్ పూర్తి చేశాక, ‘ఇన్నర్ టెంపుల్ లో బారిస్టర్ విద్య చదివారు.

కాశ్మీరులు బాగా వ్యతిరేకించారు

కాశ్మీరులు బాగా వ్యతిరేకించారు

మోతీలాల్ నెహ్రూ సంతానంలో జవహర్ లాల్ నెహ్రూయే అందరిలో పెద్ద. ఆయన చెల్లిలు విజయ లక్ష్మి పండిట్ ఐరాస జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. కాశ్మీర్ నుండి అలహాబాద్ వలస వచ్చిన నెహ్రూ వంశంలో పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ, తమకు తీరని ద్రోహమే చేశారని కాశ్మీరీలు భావిస్తారు. కాశ్మీర్ లో ‘ఫ్లెబిసైట్' జరిపిస్తానని హామీ ఇచ్చిన నెహ్రూ దానిని నెరవేర్చలేదు. పైగా హామీ నెరవేర్చాలని కోరినందుకు షేక్ అబ్దుల్లాను దాదాపు 17 సంవత్సరాలకు పైగా జైలు పాలు చేశారు.

ఆయన పుట్టింది ఆనంద్ భవన్ లో కాదు

ఆయన పుట్టింది ఆనంద్ భవన్ లో కాదు

నెహ్రూ జన్మస్థలం అందరూ ఆనంద్ భవన్ అనుకుంటారు. కానీ, ఇది అసలైన జన్మస్థలం కాదు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ తన రెండో భార్య అయిన స్వరూపరాణి తుస్సుతో కలిసి అలహాబాద్ లోని మీర్ గంజ్ ప్రాంతంలో ఓ పాత భవనంలో నివసించేవారట. అక్కడే ఆమె నెహ్రూకి జన్మనిచ్చింది. విషయము ఏమిటంటే అది అప్పటినుచి ఇప్పటి వరకు వేశ్యా గృహం. అయితే తర్వాత పరిస్థితుల దృష్ట్యా వారిద్దరిని మోతీలాల్ ఆనంద్ భవన్ కు మకాం మార్పించాడట.

ఆనంద్ భవన్ కూడా మోతీలాల్ సొంత భవనం కాదు

ఆనంద్ భవన్ కూడా మోతీలాల్ సొంత భవనం కాదు

అంతేకాదు మనం అనుకున్నట్లు ఆనంద్ భవన్ మోతీలాల్ సొంత భవనం కాదు. అది ఆయన యజమాని అయిన ముబారక్ అలీది. ముందు అది ఇష్రాత్ మంజిల్ గా పేరు ఉండేది. ఆ తర్వాత దానిని మోతీలాల్ కొనుగోలు చేసి పేరు మార్చి ఆనంద్ భవన్ గా చేశారట. ఇప్పుడది స్వరాజ్ భవన్ గా చెలామణి అవుతోంది. మొత్తానికి నెహ్రూ వేశ్యా గృహంలో జన్మించాడనేది నమ్మాల్సిన నిజం. దీనికి నిదర్శనంగా 8 ఏళ్ల ప్రాయం వరకు నెహ్రూ జ్నాపకాలేవీ భద్రపరచలేదన్నది దీనికి మరింత బలం చేకూరుస్తుంది.

విషం ఇచ్చి చంపమన్నాడంట

విషం ఇచ్చి చంపమన్నాడంట

జవహార్ అనే పేరు ఎలా వచ్చిందంటే... నెహ్రూ పూర్తి పేరు పండిట్ జవహార్ లాల్ నెహ్రూ. పండిట్ అనేది గౌరవ సూచకంగా వాడేది. కానీ, జవహార్ అన్నది ఎందుకు పెట్టారన్నదానిపై క్లారిటీ లేదు. దానిపై కూడా ఓ కథనం ఉంది. స్వరూప గర్భవతిగా ఉన్న సమయంలో ఓసారి దంపతులిద్దరూ కలిసి గంగా నది వద్దకు పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్లారట. అక్కడ ఓ సాధువు వీరిని చూసి మోతీలాల్ తో మాటలు కలిపాడట. అంతలో సాధువు నీ భార్య కడుపులో ఉంది భూతం, అది భయటికి వస్తే దేశం సర్వ నాశనమైపోతుంది. కాబట్టి జెహర్ (హిందీలో విషం) ఇచ్చి చంపేసేయ్ అని సలహా ఇచ్చాడట.

జవహార్ అని పెట్టమన్నాడు

జవహార్ అని పెట్టమన్నాడు

పాపం ఇదంతా కూత వేటు దూరంలో ఉండి వింటున్న ఆమె భార్య సాధువు జెహర్ అని ఎందుకన్నాడని మోతీని అడిగిందట. దానికి ఆయన సాధువు జెహర్ అనలేదని, పుట్టబోయే బిడ్డకు జవహార్ (హిందీలో ఆభరణం) అని పేరు పెట్టాలని సూచించాడని మోతీలాల్ అబద్ధం చెప్పాడట. అలా ఆయన పేరులో జవహార్ వచ్చి చేరింది.

అమ్మాయిల పిచ్చి ఎక్కువ

అమ్మాయిల పిచ్చి ఎక్కువ

నెహ్రూ చిన్నతనంలోనే భార్యను కోల్పోయారు. దీంతో ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉండేదని ఓ టాక్. ఎడ్వినా తో నెహ్రూ నడిపిన ప్రేమ వ్యవహారం పబ్లిక్ గా తెలిసిందే. ఎడ్వినా కోసం నెహ్రూతోపాటు ముస్లిం లీగ్‌ అధినేత జిన్నా కూడా ప్రయత్నించేవాడట. ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడించిందని ఓ టాక్.

సరోజినీ నాయుడు కూతురితో కూడా

సరోజినీ నాయుడు కూతురితో కూడా

ఇంకా దారుణమైన విషయమేంటంటే... సరోజినీ నాయుడు కూతురు పద్నాజ నాయుడు తో నెహ్రు గారి ప్రేమాయణం ఉండేదట. అది ఎంతవరకు వచ్చిందంటే... ఆయన పడక గదిలో ఆమె ఫోటో ఉండేదాకా. ఈ విషయమై కూతురు ఇందిరతో తరుచు నెహ్రూకి వాగ్వివాదం కూడా జరిగేదట.

Image Source :http://www.dailymoss.com

English summary

what exactly happened between nehru and edwina mountbatten

what exactly happened between nehru and edwina mountbatten
Desktop Bottom Promotion