వ్యక్తులపై నమ్మకాలను కూడా రాశిచక్రాలు ప్రభావితం చేస్తాయా:

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో మీకు ఉండే భయాలలో అత్యంత పెద్ద భయం ఏమిటి? మీరు నమ్మిన వాళ్ళు మీకు ఎక్కడ నమ్మక ద్రోహం చేస్తారేమో అని. లేదా నమ్మక ద్రోహం చేసినవాళ్లే తిరిగి మీ జీవితంలో ప్రవేశిస్తే, పరిస్థితులు పునరావృతం అవుతుందేమో అన్న ఆలోచన కూడా మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంది. అంతేనా?

మీ రాశిచక్రాన్ని అనుసరించి, మీ నమ్మకం పై ప్రభావితమయ్యే అంశాలను గురించిన వివరణ ఇవ్వడం జరిగింది.

trust issues as per zodiac

ఇక్కడ మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే, ప్రతి రాశిచక్రాన్ని గురించి క్షుణ్ణంగా చదివి వాటి వాటి ప్రభావిత అంశాలగురించిన అవగాహన తెచ్చుకోవడం.

మేషం మార్చి 21-ఏప్రిల్19

మేషం మార్చి 21-ఏప్రిల్19

వీరు తమ సంబంధాన్ని దెబ్బతీసే యే ప్రతికూల అంశాలను దగ్గరకు చేర్చడానికి ఇష్టంగా ఉండరు. ఒకవేళ ఈ ప్రతికూల అంశాలు మరింతగా ప్రభావితం చేస్తున్నాయి అన్న అనుమానం వస్తే, వీటిని దూరం చేయుటకు ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ వీరిని మోసం చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తారో చివరికి వారే భంగపడుతారు. అంత తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశిచక్రం వారు. ఒకవేళ వీరు మోసగింపబడితే కూడా, మోసం చేసిన వారి పశ్చాత్తాపం వీరిని తిరిగి సంబంధంలోకి ఆహ్వానించేలా చేస్తుంది. కానీ తిరిగి నమ్మకద్రోహం చేస్తారేమో అని ఆలోచన చేస్తూ ఉంటారు. అంత తేలికగా నమ్మకాన్ని ప్రదర్శించరు.

వృషభం ఏప్రిల్ 20 –మే 20

వృషభం ఏప్రిల్ 20 –మే 20

వీరు ఎక్కువగా సంబంధం ఒకేలా ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు. కానీ ఒకవేళ ఎవరైనా జీవితానికి సంబంధించిన మార్పులను సూచిస్తే అవి మంచికి అయినా కూడా పాటించుటకు సుముఖతను వ్యక్తం చేయలేని స్వభావం వీరిది. వీరికి వీరు మారాలని మారుతారే తప్ప, ఒకరు సూచించిన విధానాన్ని పాటించుటకు సిద్దంగా ఎప్పటికీ ఉండలేరు. కానీ వీరి ఇగోలను పక్కన పెట్టి, జరుగుతున్న పరిణామాలు మంచివో కాదో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది, అలా లేని పక్షంలో జీవితమoతా స్తబ్ధత నెలకొనడం ఖాయం.

మిధునం మే21- జూన్20

మిధునం మే21- జూన్20

వీరి ప్రత్యేకమైన నిబద్దతా లక్షణాల దృష్ట్యా , వీరు ప్రత్యేకించి ఎవరినీ నమ్ముటకు సుముఖంగా ఉండరు. మరోపక్క భాగస్వామిని నమ్మకుండా ఉండుటకు కారణాలను కూడా అన్వేషిస్తుంటారు. ఒకవేళ వీరు భాగస్వామిచేత ప్రేమించబడుతున్నట్లయితే , నమ్మకద్రోహం చేసిన ఎడల వీరికి పూర్తిగా తమభావాలను వ్యక్తపరచుటకు , నిజాన్ని తెలుపుటకు సిద్దంగా ఉంటారు.

కర్కాటకం జూన్ 21- జూలై 22

కర్కాటకం జూన్ 21- జూలై 22

వీరు సంబంధాలను వేరు పడడం సహించలేరు. వీరు ఒకరిని నమ్ముటకు ఎప్పటికీ సిద్దంగా ఉండరు, కానీ ఒక్కసారి నమ్మితే వారిపట్ల అత్యంత నమ్మకాన్ని కలిగి ఉంటారు. తద్వారా వీరు ఒక సంబంధంలో కొనసాగడానికి కూడా ఎక్కువ సమయమే పడుతుంది.

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

సింహం జూలై 23 – ఆగస్ట్ 23

వీరి నమ్మకాలపై ప్రభావం చూపడానికి ఎవరికైనా ఎక్కువ సమయం పట్టదు. వీరు ఒకరిని నమ్మడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు, తద్వారా వీరికి నమ్మదగిన వ్యక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు భావ వ్యక్తీకరణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు, మరియు వీరు నమ్మిన వ్యక్తులపట్ల ప్రేమని కూడా అధికంగా కలిగి ఉంటారు. కానీ వీరు నమ్మక ద్రోహాన్ని సహించలేరు, మరియు అలా ద్రోహం చేసిన వారిని తమ జీవితంలో ఉండుటను కూడా సహించలేరు. వీరితో తిరిగి సంబంధాలు కొనసాగించాలన్న ప్రయత్నం చేస్తే, అది జీవితకాలం సమయo కూడా పట్టవచ్చు.

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

వీరు ఏ విషయo గురించి అయినా చాలా తీవ్రంగా ఆలోచన చేస్తుంటారు. తద్వారా వీరు ప్రతి విషయం గురించిన పూర్తి అవగాహనకు రావడం అనేది జరగదు. ముఖ్యంగా ఈ ప్రభావం సంబంధాలలో కనిపిస్తుంది. కానీ ఒక్కసారి వీరు పూర్తిగా నమ్మకాన్ని కనపరిస్తే, జీవితాంతం భాగస్వామి పట్ల లేదా సన్నిహితులపట్ల విధేయులై ఉండగలరు.

తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

వీరు తమ నిర్ణయాలను కఠినంగా తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వీరి నిర్ణయాలు, పూర్తిగా ఏకపక్షమై ఉండి సంబంధాలను నాశనం కూడా చేస్తుంటుంది. వీరు ఆత్మ విశ్వాసాన్ని తక్కువగా కలిగి ఉంటారు, తమ బలాల పై అపనమ్మకాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు తద్వారా అభద్రతాభావానికి లోనై జీవిస్తుంటారు . మరో వైపు తప్పుడు మనుషులను నమ్మడం ద్వారా అనేక సమస్యలు జీవితంలో ఎదురవుతాయని ఒక ఆలోచనను కలిగి ఉంటారు, తద్వారా వీరు వ్యక్తులను అంత తేలికగా విశ్వసించలేరు. ఒకవేళ విశ్వసిస్తే , అత్యంత నమ్మకాన్ని వారిపట్ల కలిగి ఉంటారు కూడా.

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వీరు చిన్ని అబద్దాలను సైతం తట్టుకోలేరు. తద్వారా సంబంధాలు దెబ్బతినేలా పరిణామాలు దారితీస్తాయి . వీరితో అత్యంత జాగరూతులై వ్యవహరించడం మేలు. చిన్ని విషయాలకు కూడా అబద్దాలు చెప్పేవారు, పెద్ద విషయాలదగ్గర నమ్మకం ప్రదర్శించలేరు అన్నది వీరి ప్రఘాడ విశ్వాసం.

ధనుస్సు నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23- డిసెంబర్ 22

వీరి సంబంధాలలో ఒక్కసారి నమ్మకానికి సంబంధించిన సమస్యలు తలెత్తితే , అవి శాశ్వత దూరానికి హేతువులుగా మారుతాయి. నమ్మక ద్రోహాన్ని అసలు భరించలేరు, అత్యధికంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. మరియు వీరు ఎక్కువగా స్వేచ్చా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యతను ఇస్తారు. తద్వారా వీరి స్వేచ్ఛకు భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించలేరు.

మకరం డిసెంబర్ 23- జనవరి 20

మకరం డిసెంబర్ 23- జనవరి 20

వీరు ఎక్కువగా ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. వీరు తమ జీవితపయనంలో తక్కువ తప్పులను కలిగి ఉంటారు, ఒక్కోసారి ఇవి నమ్మకాలకు సంబంధించినవిగా ఉంటాయి. కానీ ఒక సంబంధానికి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పాలన్న ఆలోచనకు వస్తే, అసలు నమ్మకానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవడానికి కలిగిన కారణాలను గురించిన ఆలోచనలు చేయడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కుంభం జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం జనవరి 21- ఫిబ్రవరి 18

వీరు ఎక్కువ ఊహాతీత ఆలోచనలు చేస్తుంటారు, తద్వారా కొన్ని జరగకపోయినా కూడా నమ్మకద్రోహం జరిగిందన్న భావనలో ఉండడం పరిపాటి. కావున సంబంధాలు విచ్ఛిన్నంకాకుండా ఒకటికి రెండుసార్లు వారితో చర్చించడం మంచిది. ఒకవేళ నిజంగా నమ్మకద్రోహానికి గురైనట్లు భావిస్తే , వారిని తమ జీవితంలోకి మరలా ఆహ్వానించుటకు మాత్రం ఎన్నటికీ సిద్దంగా ఉండరు.

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

వీరు తమ ప్రియమైన వారిపై అత్యధిక నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, మరియు ఎక్కువగా స్నేహితుల మాటలపై ప్రభావితం అయి ఉంటారు. వీరు ముఖ్యంగా ఇతరుల చర్చల కన్నా, అంతరాత్మతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వీరు భాగస్వామి పై నమ్మకాన్ని కలిగి ఉంటే మనస్ఫూర్తిగా కలిగి ఉంటారు. కానీ సున్నితమైన మనస్కులుగా ఉండడం మూలాన, నమ్మక ద్రోహాన్ని అస్సలు తట్టుకోలేరు.

English summary

What Triggers Your Trust Issues As Per Your Zodiac Sign

When we trust someone, we tend to hope that they will not do something that will destroy our faith in them. If we trust someone and they tend to betray us, it can at times be impossible for them to earn your trust again. On the other hand, trusting a person can be related to their zodiac signs as well!
Story first published: Tuesday, April 3, 2018, 11:33 [IST]