మీ కోపాలకు రాశిచక్రాలు కూడా కారణమా ?

Subscribe to Boldsky

మీ కోపానికి కూడా రాశిచక్రాలు ప్రభావితం చేస్తాయని ఊహించగలరా ? ఆశ్చర్యంగా ఉంది కదా..!

మీ ఆందోళన హెచ్చుతగ్గులలోనూ, తద్వారా భావోద్వేగాల నియంత్రణపై కూడా రాశి చక్రాల ప్రభావం ఉంటుందని చెప్పబడినది. మీ రాశిచక్రాలు ఏవిధంగా మీ కోపానికి కారణం అవుతాయో ఇక్కడ వివరించడం జరిగినది.

మేష రాశి : మార్చి 21-ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21-ఏప్రిల్ 19

ఈ రాశిచక్రానికి చెందిన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకొనుటకు సిద్దంగా ఉండరు, దీనికి కారణం వీరికి ఓర్పు సహనం చాలా తక్కువగా ఉండడమే. వీరు ఏదైనా ప్రణాళికా బద్దంగా పని చేయునప్పుడు సమయం వృధా చేయడం వీరికి నచ్చదు. ఎవరైనా అలా వ్యవహరిస్తుంటే మనసు వారితో ఏకీభవించ లేరు. మరియు పని పూర్తయ్యేదాకా విశ్రాంతి తీసుకొనుటకు సుముఖంగా ఉండరు , తద్వారా కోపం అనేది సహజంగానే ఉంటుంది.

వృషభ రాశి ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి ఏప్రిల్ 20-మే 20

మీకు ఏ తప్పుడు చర్యలలోనైనా తప్పించుకోడానికి చెప్పే కారణాలు అంటే నచ్చవు . వేరే ఇతర రాశిచక్రాలతో పోల్చి చూస్తే మీ రాశి చక్రం వారు మనసులో ప్రతివిషయాన్ని దాచుకుంటారు. తద్వారా కోపం వచ్చినప్పుడు మీ మనసు కకావికలమే అవుతుంది. మిమ్ములను ఎవరైనా ఎగతాళి చేసినా మీకు నచ్చదు, కానీ ఎక్కువగా మనసులో ఈ విషయాలను ఉంచుకోవడం ద్వారా మీకు ఆందోళన, కోపం ఎక్కువగానే ఉంటాయి.

మిధునం మే 21- జూన్ 20

మిధునం మే 21- జూన్ 20

మీరు మీ పనికి లభించే ఫలితాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు, యాజమాన్యం నుండి కానీ మీ ప్రియమైన వారి వద్ద నుండి కానీ తగిన గుర్తింపు రాని పక్షంలో మీకు కోపం నషాలానికి అంటుతుంది. మీరు కొన్ని సరిహద్దులు గీచుకుని ఆ చట్రంలోనే జీవనాన్ని గడపాలి అని అనుకుంటున్న వారు. కావున వీరు అనుకున్న విషయాలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు , ఆ పరిస్థితులను జీర్ణం చేసుకోలేక కోపానికి గురవుతూ ఉంటారు.

కర్కాటకం జూన్ 21 – జూలై 22

కర్కాటకం జూన్ 21 – జూలై 22

మీరు మీలో ఉన్న ఆలోచనల్లో అన్నిటికన్నా ఉత్తమమైనది ప్రదర్శించడానికే ఆలోచనలు

చేస్తారు. మీరు ఎక్కువగా సున్నిత మనస్కులై ఉండడం మూలంగా చిన్ని చిన్ని విషయాల్లోనే మీకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కావున మీ రాశిచక్రం వారితో అత్యంత జాగరూతులై ఉండడం మంచిది.

సింహo జూలై 23-ఆగస్ట్ 23

సింహo జూలై 23-ఆగస్ట్ 23

మీరు ఎక్కువ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దీనికి కారణం అందరిలో ఎక్కువ ఉత్తమంగా కనపడాలన్న మీ ఆలోచన వలన ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ మీరు మీలాగే అందరూ కూడా అన్న విషయాన్ని గమనించిన రోజున మీకు కోపాలు అనేవి తగ్గుతాయి. లేకుంటే మీకన్నా ఎవరైనా గొప్పగా కనిపించినా మీకు కోపం వస్తుంది.

కన్యా రాశి ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

కన్యా రాశి ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

మీరు ఒక ప్రణాళికా బద్దంగా ముందుకు సాగువారు, మీ ఆలోచనాలకి కానీ , మీ నిర్ణయాలకు కానీ , మీ పనులకి కానీ ఎవరైనా అడ్డు తగిలితే మీరు అస్సలు సహించలేరు. కోపంతో అయినా సాధించుకునే మనస్త్త్వం కలవారు. ఈ రాశిచక్రం కలిగిన వారు స్పురద్రూపులుగా ఉంటారు. అనుకున్న పని నెరవేరే దాకా విశ్రాంతికి కూడా సుముఖంగా ఉండరు, తద్వారా ఆలోచనల తీవ్రత వలన కోపం స్థాయిలూ అదేవిధంగా పెరుగుతూ ఉంటాయి.

తులా రాశి సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తులా రాశి సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

మీరు ఎక్కువగా కష్టించి పనిచెయు స్వభావం కలిగిన వారు, మరియు కలల సాకారానికి శ్రమించువారు. తద్వారా మీ మార్గంలో ఏదైనా ఆటంకం కలిగితే మీ కోపాన్ని తగ్గించడం ఎవరితరం కాదు. మీరు ఎక్కువగా మీ ప్రియమైన వారిపట్ల విశ్వాసం ప్రేమ కనపరుస్తూ ఉంటారు. మీకు కానీ మీ వారికి కానీ ఎటువంటి చిన్న నష్టo కలిగినా సహించలేరు అన్నది వాస్తవం. తద్వారా మీకు కోపం స్థాయిలు అందుకోలేని స్థితిలో ఉండడం సర్వసాధారణం.

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

మీరు అనుకున్న ప్రణాళికలపై చిత్తశుద్ది కలిగిన వారు కానీ , ప్రణాళికలోపం వలన అనేక ఇబ్బందులకు తరచూ గురవుతూ ఉంటారు... ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో మీకు కోపం అధికంగా ఉంటుంది. ఒక్కోసారి స్వార్ధ చింతనకు కూడా పూనుకుంటారు. మీ టార్గెట్, మీ ఉనికిని కాపాడుకోవడమే ఉంటుంది.

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

మీరు ఎక్కువగా అజాగ్రత్త పరులై ఉంటారు. యే విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోరు, తద్వారా సమస్యలు ఎదురైనప్పుడు కోపం మీకు ముక్కుపైనే ఉంటుంది. పైగా మీరు మీ లక్ష్య సాధనలో స్వార్ధ చింతన చేయువారు. తద్వారా మీరు ఒకరి ఆలోచనలతో , వారి భావోద్వేగాలతో సంబంధం లేకుండా నడుచుకుంటారు. ఇలాంటి లక్షణం కనిపించిన వెంటనే మీకు మీరు మారడానికి ప్రణాళికలు చేసుకోవాలి. లేకుంటే ఆలోచనా స్థాయిలు తీవ్రమై తద్వారా అనేక ఆందోళనా సమస్యలను ఎదుర్కొనక తప్పదు.

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

మకరం డిసెంబర్ 23 – జనవరి 20

మీరు పనియందు చిత్తశుద్ది కలిగిన వారుగా ఉంటారు , కావున ఏదైనా పని తలపెట్టిన ఎడల పూర్తికాని పక్షంలో మీరు అధిక ఒత్తిడికి లోనవడం సహజంగా జరుగుతుంది., తద్వారా మీరు అనేక రకాల ఆందోళనలకు లోనవుతూ ఉంటారు. సునిశితమైన విషయాలయందు కూడా కోపం ప్రదర్శిస్తుంటారు., తద్వారా సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 21

కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 21

మీరు నిరంతరం ప్రేమించబడడానికి ఇష్టపడుతూ ఉంటారు, మీరు కూడా అలాగే ప్రేమను పంచుతారు. ఎక్కువగా మీ సంబంధ భాంధవ్యాలు ప్రేమలతో కూడుకుని ఉంటాయి. కానీ మీ ప్రేమలో లోటు లేకపోయినా మీరు ఆశించే వారు మీపై వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తే మీరు తట్టుకోలేరు. తద్వారా ఆందోళనలు ఎక్కువై కోప తాపాలను ప్రదర్శిస్తారు, ఒక్కోసారి మరింత కఠినంగా ప్రవర్తించి శాశ్వతంగా దూరం చేసే ఆలోచనలు కూడా చేస్తారు. ఒక్కోసారి చిన్ని చిన్ని విషయాలే చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కావున అలాంటి సమస్య ఉత్పన్నమవుతుందని మీరు గ్రహిస్తే వెంటనే సరిచేసుకొనే ప్రయత్నం చేయండి.

మీనం ఫిబ్రవరి 19- మార్చ్ 20

మీనం ఫిబ్రవరి 19- మార్చ్ 20

మీరు కలలలో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు, మీ కలల ప్రపంచానికి ఇల ప్రపంచానికి పోలిక వేసి చూసినప్పుడు ఏదో కోల్పోయిన ఆలోచన చేస్తారు., తద్వారా మీరు ప్రేమించిన వ్యక్తులలో కూడా లోపాలు వెతకడం, మీ పట్ల మీరు అనుకున్న రీతిలో లేకపోయినా కోపాలకు గురికావడం చేస్తుంటారు. మీరు కోరుకున్న పరిస్థితులు మీకు అనువుగా ఉండాలి, లేకుంటే సహించలేరు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Your Hyperactivity Level Based On Your Zodiac Sign

    There are reasons why you cannot relax, which are based on your zodiac sign. For eg, for Virgo individuals - you cannot relax and tend to be hyper as you are just far too uptight about everything. You tend to find it hard for yourself to adjust whenever your unreasonably high standards aren't being met.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more