For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గత జన్మలో మీరేంటో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయా : రాశిచక్రాల ప్రకారం

  |

  వాస్తవానికి మనం ప్రేమలో ఉన్నప్పుడు, మన భాగస్వామి తదుపరి జన్మలో కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటాము లేదా తర్వాతి జన్మలో అయినా తాము కోరుకున్నట్లు భాగస్వామి ఉండాలని కోరికలతో ఉంటాము. కానీ మీరు మీ గత జన్మలో ఎటువంటి వ్యక్తిగా ఉండేవారో అని ఎప్పుడైనా ఆలోచించారా ?

  జ్యోతిష్య శాస్త్రo ప్రకారం, ప్రతి రాశిచక్రం వివరాల ఆధారంగా, గత జన్మలో మనం ఏమిటో తెలుసుకునేందుకు సహాయపడగలదు.

  మీరు మీ మునుపటి పుట్టుక గురించి తెలుసుకోవటానికి కుతూహలాన్ని కలిగి ఉన్నవారైతే, ఒక్కసారి క్రింది వివరాలను గమనించండి.

  గమనిక: ఈ అంచనాలు ప్రతి రాశిచక్రం యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటాయి మరియు ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ సూర్యమాన సిద్దాంతం ప్రకారం చెప్పబడినవి.

  ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్దాం...

  మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19 : ఒక యోధుడు

  మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19 : ఒక యోధుడు

  మేష రాశి సంబంధించిన వ్యక్తులు, తమలో ఒక యోధుని స్వభావాన్ని కలిగి ఉంటారు. మరియు వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉండేవారిగా ఉంటారు. వాళ్లకు సమస్యల నుండి తప్పుకోవడమంటే అస్సలు తెలియని అంశంగా ఉంటుంది. పట్టుదలతో మరియు కనికరంలేని వ్యక్తిగా వీరి వ్యక్తిత్వం నిర్వచించబడింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వెనుతిరగని తత్వం కలిగిన వీరు, మోసాన్ని, వ్యతిరేకతను సహించలేని వారిగా ఉంటారు. బహుశా ఈ వ్యక్తులు పూర్వజన్మలో యోధునిగా లేక యుద్ద నైపుణ్యాలు కలిగిన వారిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20 : ఒక నాయకుడు

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20 : ఒక నాయకుడు

  వృషభ రాశికి చెందిన వ్యక్తి తాను తీసుకునే నిర్ణయాలనందు స్థిరంగా ఉంటాడు. మరియు మాట మీద నిక్కచ్చిగా నిలబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారిగా ఉంటారు. పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అన్న విషయాల గురించిన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కానీ వారు సున్నిత మనస్కులుగా, కుటుంబం పట్ల, అత్యధిక ప్రేమలు మరియు విలువలు కలిగిన వారిగా విశదీకరించబడ్డారు. మరియు తమ విజయాలను ఇతరుల ఖాతాలో వేసేoతటి సహృదయులుగా ఉన్నారు.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా నాయకునిగా కాని, మార్గదర్శకునిగా, లేదా అన్వేషకునిగా ఉండే సూచనలు ఉన్నవి.

  మిధున రాశి : మే 21 - జూన్ 20: పెయిన్ కిల్లర్

  మిధున రాశి : మే 21 - జూన్ 20: పెయిన్ కిల్లర్

  మిధున రాశికి చెందిన వ్యక్తి సహృదయులుగా ఉంటారు. ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించే వారిలా ఉంటారు. ఈ వ్యక్తులు కష్టాలలో ఉన్న ఇతరుల పట్ల జాగ్రత్తను తీసుకోవడంలో మరియు వారిని స్వస్థ పరచడంలో ఉత్తములుగా ఉంటారు . వారు కష్టాలలో ఉన్నవారిని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో తెలిసిన వారిగా ఉంటారు. వారు ఇతరుల శ్రేయస్సును కోరుకునే ఒక పరిపూర్ణమైన ఆత్మని కలిగి ఉంటారు మరియు వారు నిస్వార్ధ జీవులు.

  వారి మునుపటి పుట్టుకలో, ఈ వ్యక్తులు బహుశా ఒక వైద్యులు, నర్స్ లేదా సంఘ సంస్కర్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22 : దౌత్యవేత్త

  కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22 : దౌత్యవేత్త

  కర్కాటక రాశికి చెందిన వ్యక్తి అత్యంత యోగ్యతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మరియు ఒక పదునైన ఆలోచనా శక్తి కలిగి ఉంటాడు. వారు ప్రకృతి ఆరాధకులుగా, ప్రేమికులుగా ఉంటారు. ఈ వ్యక్తులు పరిస్థితులను క్షుణ్ణంగా చదువుతూ, వాటికి తగినట్లుగా నడుచుకోవడం చేస్తుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా చాకచక్యంగా పరిష్కరించి ఉత్తమ ఫలితాలను ఇవ్వగలిగిన నేర్పరులుగా ఉంటారు మరియు వారు వారి ప్రయోజనాల కోసం పరిస్థితిని ఎలా మలచుకోవాలో అవగాహన ఉన్నవారిగా ఉంటారు.

  వారిమునుపటి పుట్టుకలో, ఈ వ్యక్తులు బహుశా అత్యంత నైపుణ్యం కలిగిన రాయబారి లేదా సంధి చేయగల సామర్ధ్యాలు కలిగిన వ్యక్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23 : ఒక కళాకారుడు

  సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23 : ఒక కళాకారుడు

  ఒక సింహ రాశికి చెందిన వ్యక్తి అధికమైన భావ వ్యక్తీకరణలు మరియు భావోద్వేగాలతో కూడుకుని ఉంటారు. వారి మనసు ఏం కోరుకుంటుందో వారికి తెలుసు, తద్వారా దానిని సాధించే మార్గాలపై దృష్టిని కలిగి ఉంటారు. కానీ ఇతరులను దృక్కోణంలో ప్రపంచాన్ని చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం వీరి విశిష్టత.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక కళాకారుడు, ఒక చిత్రకారుడు లేదా వారి కళతో ప్రపంచాన్ని చూపగలిగిన శిల్పిగా ఉండే అవకాశం ఉంది.

  కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23 : నేర్పరి

  కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23 : నేర్పరి

  కన్యా రాశికి చెందిన వ్యక్తి తన సొంత ఆలోచనలతో జీవితాన్ని గడిపే వ్యక్తిగా ఉంటారు. ఇతరుల ఆలోచనలను పాటించడానికి సిద్దంగా ఉండరు. తమకు అనుకూలంగా ఉంటే తప్ప. తమ ఆలోచనలకు తగ్గట్లే తమ చుట్టూతా ప్రపంచాన్ని అనువుగా నిర్మించుకునే తత్వం వీరి సొంతం. వారి ఆలోచనలు మరియు దృక్కోణాలు అబ్బురపరచేవిలా ఉంటాయి మరియు ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువనిస్తారు. కానీ ఎటువంటి నిర్ణయాలలో అయినా వీరికంటూ ఒక ఆలోచన ఉంటుంది.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక ఆలోచనాపరుడు, లేదా తత్వవేత్త, లేదా గొప్ప గౌరవ సలహాదారునిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  తులా రాశి : సెప్టెంబరు 24 - అక్టోబర్ 23 : న్యాయనిర్ణేత

  తులా రాశి : సెప్టెంబరు 24 - అక్టోబర్ 23 : న్యాయనిర్ణేత

  తులా రాశికి చెందిన వ్యక్తి కూడా విషయాలను, సమస్యల పట్ల సరైన అవగాహన కలిగి తీర్పుని ఇవ్వగల సామర్ధ్యం కలిగి ఉంటాడు. వారికి పక్షపాత ధోరణి ఉండదు. ఇది వీరి వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుంది. ఆశ్రిత పక్షపాతములు లేకుండా న్యాయాన్యాయాలలో అందరిని సమానంగా భావించే వారిగా ఉంటారు. ఇంటా బయటా వీరి మాటలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

  వారి మునుపటి జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక న్యాయ సంబంధమైన వ్యక్తి, లేదా న్యాయమూర్తి, లేదా ఒక న్యాయాధికారి లేదా ఒక న్యాయనిర్ణేతగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22 : భయానక తత్వం

  వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22 : భయానక తత్వం

  వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండడమే కాకుండా మరియు పరిశోధనా ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు. వారు బయటకు చూపే ప్రశాంతమైన స్వభావం కారణంగా ఎవరూ ఊహించలేని వ్యక్తిత్వం కలిగి ఉంటారు; కానీ వాటికి ప్రమాదకరమైన పక్షం ఉంది. ఇది కేవలం కొద్దిమందికి మాత్రమే అర్ధమవుతుంది. ఎవరైనా వీరిపట్ల రెచ్చగొట్టే స్వభావాన్ని, లేదా వ్యతిరేకతను ప్రదర్శిస్తే వారి పట్ల ప్రతీకారేచ్చను కలిగి ఉండేవారిలా ఉంటారు.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక హంతకుడు, ఒక కిల్లర్ లేదా ఒక సమర యోధునిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22 : ఒక రచయిత

  ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22 : ఒక రచయిత

  ధనుస్సు రాశికి చెందిన వ్యక్తి అత్యధిక భావవ్యక్తీకరణ, భావోద్వేగాలను కలిగిన వ్యక్తిగా ఉంటాడు. నేర్పు, పని తనం, క్రమశిక్షణ, పట్టుదల వంటి అంశాలతో పరిపూర్ణమైన వ్యక్తిగా అందరి ప్రశంసలను, మన్నలను అందుకునే వారిలా ఉంటారు. మరొక వైపు, వారి భావ వ్యక్తీకరణ మరియు వారి సృజనాత్మకత ప్రస్ఫుటమైన పదాలను వ్యక్తపరచేలా మరియు రాయగలిగేలా వీరి తీరి ఉంటుంది.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక రచయిత లేదా సంగీతకారులయ్యే అవకాశాలు ఉన్నాయి

  మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20 : రక్షకుడు

  మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20 : రక్షకుడు

  మకర రాశికి చెందిన వ్యక్తి బలహీనమైన వారికి రక్షకునిగా ఉంటాడు. వీరు ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనలు కలిగిన ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తమ కన్నా, తమ కుటుంబ సభ్యులకు మరియు సహాయం అని వచ్చిన వారికి అండగా ఉండే స్వభావం వీరి సొంతం.

  పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా రక్షకునిగా లేదా సైనికునిగా ఉండే అవకాశం ఉంది.

  కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 8 : ప్రేరణ

  కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 8 : ప్రేరణ

  కుంభ రాశికి సంబంధించిన వ్యక్తి సాధారణంగా ఇతరులకు ప్రేరణగా ఉంటాడు. ఈ వ్యక్తులు నాయకత్వపు లక్షణాలను కలిగి, ఎటువంటి ప్రతికూల ప్రభావిత పరిస్థితులనైనా ఎదుర్కొని విజయకేతనం ఎగురవేసేలా ఉంటారు. ఇతరుల ఆలోచనలను తలదన్నేలా వీరి ఫలితాలు ఉంటాయి.

  వారి మునుపటి జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక నాయకుడు, లేదా మార్గదర్శకునిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20 : ముందు చూపు

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20 : ముందు చూపు

  మీన రాశికి చెందిన వ్యక్తి, వ్యక్తిగతoగా భిన్నమైన దృష్టికోణoలో ప్రపంచాన్ని చూస్తాడు. వారు సామాజిక నిబంధనలకు అనుగుణంగా ఉండరు కాని వారి సొంత మార్గాన్ని ఏర్పరచుకునే వారిగా ఉంటారు. ప్రపంచానికి వారు భిన్నమైన ఆలోచణా ధోరణి కలిగిన వారిగా ఉంటారు మరియు వారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం పొందడానికి కృషి చేస్తుంటారు.

  వారి పూర్వ జన్మలో, ఈ వ్యక్తులు బహుశా ఒక అధ్బుతమైన మేధస్సును కలిగిన వారుగా, శాస్త్రవేత్తలుగా, లేదా మానసిక నిపుణులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి రాశి ఫలాలు మరియు ఆద్యాత్మిక సంబంధిత వివరాల కోసం బోల్డ్స్కీ ని తరచుగా సందర్శించండి.

  English summary

  Zodiac Sign Reveals What You Were In Your Past Life

  Past life has a huge role to play in our present life. It is believed that we carry 70 percent soul imprints from our past life experiences and it is from those experiences, that reveal how we function in our current life situation. According to astrology, our current life is also an imprint of our past life
  Story first published: Tuesday, May 29, 2018, 7:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more