ఈ రాశుల అమ్మాయిలు భార్యగా వస్తే చాలా అదృష్టం

Written By:
Subscribe to Boldsky

ప్రతి అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటాడు. మంచి అమ్మాయి భార్యగా వస్తే జీవితాంతం చాలా సంతోషంగా ఉండొచ్చు. అయితే కొన్ని రాశుల అమ్మాయిలు భార్యలుగా వస్తే చాలా అదృష్టం. ఏయే రాశుల అమ్మాయిలు భార్యలుగా వస్తే మంచిదో తెలుసుకోండి.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి వారు మంచి భార్యలుగా ఉంటారు. భర్తను బాగా అర్థం చేసుకునే గుణం వీరికి ఉంటుంది. కర్కాటక రాశి వారు నమ్మిన వ్యక్తుల విషయంలో చాలా అంకితభావంతో ఉంటారు. జీవితాంతం జీవిత భాగస్వామితో కలిసి ఉండే గుణం కర్కాటకరాశి అమ్మాయిలకు ఉంటుంది.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి అమ్మాయిలు భర్త సుఖంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకుంటారు. భర్త తప్ప మరో అబ్బాయిలో చనువుగా ఉండరు. భర్త కష్టాల్లో ఉండే అండగా నిలచి ధైర్యాన్ని ఇస్తుంది కర్కాటక రాశి అమ్మాయి. కర్కాటక రాశి అమ్మాయి చాలా నిజాయితీగా ఉంటుంది.

మీనరాశి : ఫిబ్రవరి 19 మార్చి

మీనరాశి : ఫిబ్రవరి 19 మార్చి

మీనరాశి అమ్మాయి చాలా నమ్మకంగా ఉంటుంది. వీరికి విశ్వాసం ఎక్కువ. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను గౌరవించే గుణం మీనరాశి అమ్మాయికి ఉంటుంది. అలాగే భర్త ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం కూడా మీనరాశి అమ్మాయికి ఉంటుంది.

మీనరాశి : ఫిబ్రవరి 19 మార్చి

మీనరాశి : ఫిబ్రవరి 19 మార్చి

మీనరాశి అమ్మాయి భర్తను చాలా బాగా ప్రేమిస్తుంది. అలాగే భర్తకు చాలా గౌరవం ఇస్తుంది. మీన రాశి అమ్మాయి భార్యగా వస్తే మీరు చాలా లక్కీ.

తులరాశి : సెప్టెంబరు 24-అక్టోబర్ 23

తులరాశి : సెప్టెంబరు 24-అక్టోబర్ 23

తులరాశి అమ్మాయి ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తుంది. భర్తను దేవుడి మాదిరిగా చూసుకుంటుంది. తులరాశి అమ్మాయికి దయా గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకునిపోయే గుణం తులరాశి అమ్మాయికి ఉంటుంది.

తులరాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తులరాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తులరాశి అమ్మాయికి తెలివి బాగా ఉంటుంది. వీరికి ఆలోచనశక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే భర్తను ఎక్కువగా ప్రేమించే గుణం తులరాశి అమ్మాయికి ఉంటుంది. జీవితాంతం భర్తతోనే కలిసి ఉంటారు.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి అమ్మాయిలు భర్తను దేవుడిలా భావిస్తారు. భర్తకు నచ్చినట్లుగా ఉంటారు. భర్త గౌరవాన్ని దెబ్బ తీయకుండా నడుచుకుంటారు. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల్ని కూడా చాలా గౌరవిస్తారు.

English summary

zodiac sign women who make perfect life partners

zodiac sign women who make perfect life partners
Story first published: Tuesday, February 27, 2018, 15:30 [IST]