ఆ రాశుల అబ్బాయిలు భర్తగా దొరకడం అమ్మాయి అదృష్టం

Written By:
Subscribe to Boldsky

ప్రతి అమ్మాయి తనకు మంచి మొగుడు రావాలని కోరుకుంటుంది. అమ్మాయికి కాస్త వయస్సు వచ్చినప్పటి నుంచి ఆమె కోరుకునే విషయం ఇదొక్కటే. తనకు మంచి భర్త రావాలి.. అతనితో ప్రతి రోజూ సుఖంగా ఉండాలి అని అమ్మాయిలు కోరుకుంటారు.

చాలా మంది అమ్మాయిలు తమ భర్త తాము చెప్పినట్లు వినాలని అనుకుంటారు. అయితే ఇలాంటి నైజం కొద్ది మంది అబ్బాయిలకే ఉంటుంది. కానీ అలా భార్య మాట వినడం మా నైజం కాదని కొన్ని రాశుల వారు మొండిగా ఉంటారు.

భార్యల లెక్క ప్రకారం ఏ రాశి అబ్బాయిలు చాలా మంచివారు.. ఎలాంటి అబ్బాయి కాస్త మంచి వారనే విషయం మీరూ తెలుసుకోండి. అలా అని మీరు చెడ్డవారని కాదు. జస్ట్ రాశుల ప్రకారం కొందరు టాప్ లో ఉంటారు. కొందరు బాటమ్ లో ఉంటారు అంతే.

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభం : ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి అబ్బాయిలు మంచి భర్తలుగా టాప్ లో ఉంటారు. వీరు భార్యల విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వృషభరాశి అబ్బాయిలు భార్యలను అస్సలు చీట్ చేయరట. వృషభరాశి అబ్బాయి భర్తగా దొరకడం ఆ అమ్మాయి అదృష్టమట. మరి మీది వృషభరాశి అయితే మీ భార్య చాలా అదృష్టవంతురాలు.

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు రాశి వారు మంచి భర్త విషయంలో రెండో స్థానంలో ఉంటారు. వీరు కూడా చాలా మంచి వారు. భార్యను బాగా చూసుకుంటారు. ధనుస్సు రాశి అబ్బాయి తన భార్యను చాలా అమితంగా ప్రేమిస్తాడు. దాదాపు భార్యతో అబద్దం చెప్పరు. భార్య చెప్పినట్లు నడుచుకుంటారు. మరి మీది ధనస్సు రాశి అయితే మీ భార్య చాలా అదృష్టవంతురాలు.

మీనరాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి అబ్బాయి భార్య విషయంలో మూడో స్థానంలో నిలుస్తాడు. కూడా తన భార్యను చాలా బాగా చూసుకుంటాడు. తాను ఎంత ఒత్తిళ్ల మధ్య ఉన్నా కూడా భార్యను మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఇలాంటి అబ్బాయి భర్తగా రావడం భార్య లక్ మరి. మీది మీనరాశి అయితే మీ వైఫ్ లక్కీ.

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకరం : డిసెంబర్ 23- జనవరి 20

మకర రాశి వారు భార్య విషయంలో నాలుగో స్థానంలో ఉంటారు. వీరు భార్యతో ఎప్పుడు గొడవ పడకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒక వేళ భార్యతో ఆర్థిక విషయాల్లో ఏదైనా గొడవ వస్తే కూడా సర్దుకునిపోతుంటారు. పెద్దగా పట్టించుకోరు.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

సింహరాశి వారు భార్యను జాగ్రత్తగా చూసుకునే విషయంలో ఐదో స్థానంలో నిలుస్తారు. వీరు భార్యతో నిజాయితీగా ఉంటారు. ప్రతి విషయాన్ని భార్యకు చెబుతారు. సింహరాశి భర్త తాను బయట చేసే తప్పుల్ని కూడా భార్యకు చెబుతాడు. అందుకే భార్య వద్ద మంచి స్థానం సంపాదిస్తాడు.

కర్కాటకరాశి : జూన్ 21-జూలై 22

కర్కాటకరాశి : జూన్ 21-జూలై 22

కర్కాటకరాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో ఆరోస్థానంలో నిలుస్తారు. వీరు కూడా భార్యను బాగా చూసుకుంటారు. కర్కాటక రాశి వారు ఎంత బిజీగా ఉన్న కూడా భార్య కోసం కాస్త సమయం కచ్చితంగా కేటాయిస్తారు. భార్యను అమితంగా ప్రేమిస్తారు.

మిథునరాశి : మే 21-జూన్ 20

మిథునరాశి : మే 21-జూన్ 20

భార్యపై ప్రేమ చూపే విషయంలో మిథునరాశి వారు ఏడో స్థానంలో నిలుస్తారు. ఈ రాశి వారి భార్య కూడా అదృష్టవంతురాలే. వీరు కూడా జీవితాంతం భార్యను బాగానే ప్రేమిస్తారు. అయితే వీరు అప్పుడప్పుడు భార్యపై కాస్త ఎక్కువగా కోప్పడుతుంటారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికరాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో ఎనిమిదో స్థానంలో ఉంటారు. వీరు అప్పుడప్పుడు భార్యపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఉన్నట్టుండి మళ్లీ భార్యపై కోప్పడుతారు. అయితే వృశ్చికరాశి వారు కూడా మంచి నమ్మకస్తులు.

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషరాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో తొమ్మిదో స్థానంలో ఉంటారు. వీరు కూడా భార్యను బాగానే ప్రేమిస్తారు. ఈ రాశి వారు కాస్త ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయి ఉంటారు. అందువల్ల మేషరాశి భర్తను పొందిన భార్య ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోదు. కానీ అప్పుడప్పుడు భర్త కాస్త కోప్పడుతుంటాడు. భార్య మాట వినడు. కానీ మేషరాశి వారు కూడా మంచి భర్తలే.

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి అబ్బాయిలు భార్యపై ప్రేమ చూపే విషయంలో పదో స్థానంలో ఉంటారు. వీరు భార్యను బాగానే చూసుకుంటారు.. అయితే వీరు సమాజంలో తాము అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. ఆ విషయంలో ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే భార్యను తిడుతుంటారు. కానీ కన్యరాశి వారు కూడా మంచి భర్తలే.

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో పదకొండో స్థానంలో నిలుస్తారు. వీరు కూడా భార్యను బాగానే ప్రేమిస్తారు. అయితే అప్పుడప్పుడు కాస్త చిర్రుబుర్రులాడుతుంటారు. సంసారంలో వచ్చే సమస్యల గురించి భార్య అడిగితే వెంటనే కుంభరాశి భర్త కోప్పడతాడు. కానీ కుంభరాశి వారు కూడా మంచి భర్తలే.

తులరాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి అబ్బాయిలు కూడా మంచి భర్తలే. అయితే వీరు భార్యపై ప్రేమ చూపించే విషయంలో ఆఖరి స్థానంలో నిలిచారు. వీరు కూడా భార్యతో చాలా స్నేహంగా మెలుగుతారు. అయితే వీరు చెప్పుడు మాటలు విని భార్యను అనుమానిస్తారు. కానీ అర్థం చేసుకుంటే తులరాశి వారు కూడా మంచి భర్తలే.

English summary

Zodiac Signs That Are Ranked From The Best To The Worst Husbands

As we preset you the list of zodiac signs which are ranked from the best to the worst husbands. This list is listed according to the predictions of astrologers as the reveal the best and worst traits of each zodiac sign men.
Story first published: Wednesday, February 21, 2018, 9:30 [IST]