ఏ హెచ్చరికలు లేకుండా మిమ్మల్ని ముంచేసే 3 రాశిచక్రాలు ఇవే?

Subscribe to Boldsky

మీ కళ్ళు నిద్రలేవగానే మిమ్మల్ని మీ పార్ట్నర్ నట్టేట ముంచేసి , తనకు ఏమీ తెలియనట్లు , అసలు మీరే తెలియనట్లు ప్రవర్తిస్తే ... ! ఏం చేస్తారు.

ఇలాంటి చర్యలు వ్యాపారాలలోనే కాదు , జీవితాలలో, ప్రేమలలో కూడా సర్వ సాధారణం. నిండా మునిగిపోయాక కళ్ళు తెరిచి చూసినా కూడా ప్రయోజనం లేని పరిస్థితులు కూడా కొందరి జీవితాలలో సర్వ సాధారణం.

Zodiac Signs That Are Likely To Dump You Without A Warning

ఇక్కడ ఎవరి తప్పు ఉందో ఎవరి ఒప్పు ఉందో విషయం కాదు, కానీ రెప్ప పాటులో మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు నమ్మించి నట్టేట ముంచి అసలుకు మీరే తెలియనట్లు నటించడం చేస్తారు. కావున కొన్ని రాశి చక్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదిగా సూచించబడింది. ఈ రాశులకు సంబంధించిన అందరూ అలాగే ఉంటారు అని కాదు, కానీ ఎక్కువ శాతం అలాంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ముఖ్యంగా వారి వారు వృత్తులు, రోజూ వారి కార్యకలాపాలు కూడా ప్రభావితం చేస్తాయి.

Zodiac Signs That Are Likely To Dump You Without A Warning

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

వీరు ప్రేమలో ఉన్నప్పుడు, ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఉంటుంది. మిమ్ములను , మీతో ప్రేమని బాహాటంగా అందరికీ తెలిసేలా చేస్తారు. కానీ ఏదైనా, ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండే వీళ్ళు తమకు ఏమాత్రం అసౌకర్యం కలిగినట్లు అంపించినా , రెప్పపాటులో మిమ్ములను వదిలివెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదు. ప్రేమించినప్పుడు ఎంత దృఢసంకల్పాన్ని ప్రదర్శిస్తారో, వదిలివేయాలన్న ఆలోచనకు వచ్చినప్పుడు అంత కఠినంగా వ్యవహరిస్తుంటారు. కావున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగని అందరినీ ఒకే తాటిన కట్టేయ్యలేము కదా, ఒక్కోసారి మీ రాశి చక్రం జోడు కూడా కారణం కావొచ్చు.

ముఖ్యంగా ఈ రాశి వారికి యే విషయంలో అయినా మొదట చూపించిన ఆసక్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అనగా ఉదాహరణకు ఏదైనా ఒక ఫోన్ ని ఇష్టపడి కొన్నారు అనుకుందాం, కొన్న మొదట్లో చూపిన మోజు నెమ్మదిగా తగ్గిపోయి అజాగ్రత్తని ప్రదర్శిస్తూ కనిపిస్తుంటారు. తమ వస్తువులను , తమకు సంబంధించిన అన్నిటినీ వేరే వాటితో పోలికలు వేస్తుంటారు. ఒక్కోసారి ప్రేమ తగ్గినప్పుడు నాటకీయ పరిణామాలు చూపుతుంటారు కూడా. కావున ఇలాంటి సమస్యలు తలెత్తడం సర్వ సాధారణంగా ఉంటుంది.

Zodiac Signs That Are Likely To Dump You Without A Warning

కుంభ రాశి: Jan 21 ఫిబ్రవరి 18

వీరు వర్తమానంలో ఎక్కువ జీవిస్తుంటారు. తద్వారా జరిగిన, గతించిన స్మృతులు మరియు భవిష్యత్ పైన ఆలోచనలు ఉండవు. వీరు ప్రేమని సీరియస్ గా తీసుకొనుటకు సిద్దంగా ఉండరు. ప్రేమించడానికి ఎంత ఇష్టం చూపిస్తారో, వదిలేయాలి అన్న ఆలోచనకు వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా పెద్ద సమస్యలు లేకుండా ముగించాలి అన్న ఆలోచనలు చేస్తుంటారు. కావున ఎక్కువ శాతం, వీరిలోనిజాయితీ కనుమరుగవుతూ ఉంటుంది.

ఒక్కోసారి వీరి తర్కంతో కూడిన ఆలోచనలు అనేక భావోద్వేగాలకు కారణం కూడా అవుతాయి. ఒకవేళ వారు ప్రేమకు అత్యంత విలువ ఇస్తే , అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అంతగా ప్రేమలో మమేకమై మీతో సంబంధం కొనసాగిస్తారు. విడిపోవాలన్న ఆలోచనకు వస్తే మాత్రం, పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. ఒక్క సారి వదిలి వెళ్ళాక తిరిగి చూడమన్నా చూడరు. వీరి తర్వాత జీవితంలో కూడా అసలు ఏమీ జరగనట్లే వ్యవహరిస్తుంటారు.

Zodiac Signs That Are Likely To Dump You Without A Warning

మకరం: Dec 23 Jan 20

ఈ రాశి వారు తార్కిక దృష్టి కోణాలను కలిగి ఉండి భావోద్వేగాలతో నిండి ఉంటారు. మరోవైపు నిరాశావాద జీవితానికి అద్దంలా ఉంటారు. వీరు సంబంధంలో ఉన్నప్పుడూ ఎంతో నమ్మకంగా ఉంటారు, ఒక్కసారి నమ్మకం పోతే ఆ సంబంధాన్ని కొనసాగించుటకు యే మాత్రం సంసిద్దత చూపించుటకు ఇష్టపడరు. కావున నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తే తట్టుకోలేరు , తద్వారా కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడరు. ఒక్కసారి సంబంధానికి ఫుల్ స్టాప్ పెడితే, జీవితంలో ఇక దాని గురించి ఆలోచించనంత కఠినంగా వ్యవహరిస్తారు.

ప్రేమ సఫలానికి, విఫలానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ, విఫలం సమయాలలో ఈ పై మూడు రాశుల వారి వ్యక్తిత్వం కఠినంగా ఉంటుంది. వీరితో తెగతెంపులు జరిగితే తిరిగి అతుక్కోవడం కష్టం. అందుకే జాగ్రత్తగా ఉండవలసినది గా సూచిస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Zodiac Signs That Are Likely To Dump You Without A Warning

    There are 3 zodiac signs that are believed to be the masters of dumping their partners in no time. These zodiac individuals will not think twice before they call off the relationship. All it takes is a blink of an eye and alas, they would dump their partners. These zodiac signs are Aries, Aquarius and Capricorn.
    Story first published: Thursday, March 29, 2018, 13:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more