For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 రాశి చక్రాలు స్నేహానికి మారుపేరుగా నిలుస్తాయి

|

మనకు అనేకమంది స్నేహితులు ఉన్నప్పటికీ, ఆ మిత్రులందరూ సన్నిహితంగా ఉండరు అన్నది వాస్తవం. వారిలో అన్నిరకాల అత్యుత్తమ లక్షణాలు ఉన్నప్పటికీ, వారి సాన్నిహిత్యాన్ని మాత్రం అనుభూతి చెందలేము.

విశ్వసనీయ స్నేహాన్ని పంచే రాశిచక్ర గుర్తులు :

మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నా, వారిలో ఒకరిద్దరు మాత్రమే బెస్ట్ బడ్డీస్ వలె ఉంటారు. దీనికి మన రాశి చక్రాలతో సరిపోలేలా ఉండే స్నేహితుల రాశిచక్రాలు కూడా ఒక కారణంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. కానీ వీటిలో కూడా మంచి స్నేహానికి అవసరమైన లక్షణాలను అధిక స్థాయిలో కలిగి ఉన్న కొన్ని రాశిచక్ర సంకేతాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో నమ్మకమైన, మరియు విశ్వసనీయతను అధికంగా ప్రదర్శించే స్నేహితుల రాశిచక్రాల జాబితాను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

వృషభ రాశి : 20 ఏప్రిల్ - 21 మే

వృషభ రాశి : 20 ఏప్రిల్ - 21 మే

వృషభ రాశి వారి స్నేహం, నిజమైనది, నిబద్ధతతో కూడుకున్నది వంటి ఇతర భారీ పదాలతో వర్ణించేకన్నా, ఇతరుల మనసును చదవగలిగి, వారి స్నేహితుల భావోద్వేగాలను, మరియు అవసరాలను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. మీ అవసరాలకు అన్ని దారులు మూసుకుపోయి ఉన్నట్లు కనిపించినా, మీరు ఊహించని విధంగా మీకొక దారిని చూపగల వ్యక్తిగా, ఆపద్భాందవునివలె ఆపన్నహస్తం అందించేవారిలా ఉంటారు. అందుకే వారిని విశ్వసనీయతకు మారుపేరుగా పిలవడం జరుగుతుంది. వీరిలోని అంకితభావం మరియు విశ్వసనీయత, ఈజాబితాలో ఉంచడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తాయి.

కర్కాటక రాశి : 22 జూన్ - 22 జూలై

కర్కాటక రాశి : 22 జూన్ - 22 జూలై

జీవితం మరియు లక్ష్యాల పట్ల వారివారి పరిపక్వ అవగాహన కారణంగా వారు స్వార్థపరునిగా కనిపిస్తుంటారు. కానీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంలో మాత్రం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంటారు. అంతేకాకుండా తమ అని మానసికంగా భావించిన వారిపట్ల అధిక శ్రద్ధతో వ్యవహరిస్తుంటారు. కష్టకాలంలో వెన్నంటి నిలుస్తూ, వారి తెలివితేటలతో సమస్యను పరిష్కరించగలిగేలా ఎత్తులు వేయగల శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించగలరు. క్రమంగా స్నేహితులకు బెస్ట్ బడ్డీలుగా ఉండగలరు.

Most Read: చిగుళ్ళ సమస్యను తొలగించగలిగే సహజ సిద్దమైన పరిష్కారాలు ఇవే !

కన్యా రాశి : 23 ఆగస్టు - 23 సెప్టెంబరు

కన్యా రాశి : 23 ఆగస్టు - 23 సెప్టెంబరు

కన్యా రాశి వారు నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉంటారు. క్రమంగా తమ సంబంధ బాంధవ్యాలను కాపాడుకునే కోణంలో మనస్పూర్తిగా అడుగులు వేస్తుంటారు. వీరి కోపమే వీరి ప్రధాన శత్రువుగా ఉన్నప్పటికీ, వీరి ప్రతి ఆలోచనలోనూ ఒక నిర్దిష్టమైన కోణం ప్రస్పుటంగా దాగి ఉంటుంది. వీరికి సులభంగా క్షమించే మనస్తత్వం ఉన్నా, సమస్య పరిష్కార మార్గాల గురించిన ఆలోచనలు చేస్తుంటారు. ఎల్లప్పుడూ వారి స్నేహితుల పట్ల నిజాయితీతో ఉంటారు. త్యాగానికి మారుపేరుగా కూడా కనిపిస్తారు. క్రమంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

వృశ్చిక రాశి : 23 అక్టోబరు - 23 నవంబర్

వృశ్చిక రాశి : 23 అక్టోబరు - 23 నవంబర్

కొన్ని సందర్భాలలో వృశ్చిక రాశి వారు, ప్రత్యేక కారణాల దృష్ట్యా దృఢనిశ్చయముగా కనిపిస్తున్న కారణంగా స్నేహితుడిగా నిర్వహించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది, తమ స్నేహితులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, తమ సమస్యలను పక్కనపెట్టి మరీ, తమ చేతిని అందించే ఉన్నత స్వభావం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. క్రమంగా విశ్వసనీయత, నిజాయితీకి మారుపేరుగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read: తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు

మీన రాశి : 18 ఫిబ్రవరి - 20 మార్చి

మీన రాశి : 18 ఫిబ్రవరి - 20 మార్చి

వీరు ఏం చేసినా, ఎందులో అడుగుపెట్టినా పరిపూర్ణ దృక్పధంతో ఉంటారు. అది స్నేహమైనా, ప్రేమ అయినా, ఏ ఇతర సంబందాలైనా సరే. ఈ కారణం చేత ఒక్కోసారి తమ ప్రశాంతతను కూడా పూర్తి స్థాయిలో కోల్పోవలసి ఉంటుంది. తమ స్నేహితులు తమ పట్ల నిజాయితీతో లేకపోయినా, అసౌకర్యాన్ని కలిగిస్తున్నా, తాము మాత్రం నిబద్దతను కోల్పోరు. వీరిలోని ఈ భిన్న వైఖరి కారణంగా, ఎవ్వరు కూడా వీరిని కోల్పోయేoదుకు సిద్దంగా ఉండరు. పైగా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం, అవగాహన వీరి సొంతం. క్రమంగా ఇతరుల ఆలోచనలు, తమకు వ్యతిరేకంగా ఉన్నా కూడా, సమస్య పరిష్కారం దృష్ట్యా అడుగులు వేస్తారు కానీ, సంబంధాలను దూరం చేసుకునేలా కాదు. వీరిలోని ఈ లక్షణాల కారణంగానీ ఈ జాబితాలో చోటు కల్పించబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, ఆద్యాత్మిక, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Zodiac Signs That Are Loyal Friends

Astrology can help us know not just about your career, love and family life, but also about your various characteristics. For instance, while the compatibility of two signs depends on their horoscopes put together, some zodiac signs are naturally good and loyal towards others. Their various good qualities contribute to proving them loyal to their friends.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more