For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అహంకార ధోరణి సైతం ప్రదర్శించే రాశి చక్రాలు ఉన్నాయని మీకు తెలుసా?

  |

  జ్యోతిషశాస్త్ర ప్రకారం, ప్రతి రాశిచక్రo సానుకూల మరియు ప్రతికూల లక్షణాల యొక్క సరసమైన మేలుకలయికలతో కూడి ఉంటుంది. ఇలా మంచి చెడుల కలయికతోనే మనిషి పరిపూర్ణుడుగా ఉంటారు. కొందరికి మంచి అనిపించేది కొందరికి చెడుగా అనిపించవచ్చు, అదేవిధంగా కొందరికి చెడు చేసినా వారిపరంగా అవి మంచిగానే తోస్తుంటాయి. ఇవి మానవ సహజగుణాలు అయినప్పటికీ వీటి మీద రాశిచక్ర ప్రభావాలు కూడా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నిర్ధారిస్తున్నారు.

  కానీ జ్యోతిషశాస్త్ర ప్రకారం, ఒక నిర్దిష్ట లక్షణం జీవితంలో ఒక వ్యక్తిని తిరిగి వెనుకకు తీసుకుని వస్తునట్లుగా కనిపిస్తుంది, ఇది కొంతమందిని ఆత్మ పరిశీలన చేసుకునేలా చేస్తుంది, ఈ లక్షణం మనిషిని అహంకారిగా సమాజంలో నిలబెడుతుంది.

  Zodiac Signs That Are More Likely To Be Narcissists

  అహంకారి అంటే ఎవరు?

  వ్యక్తి నరనరాల్లో గర్వం, స్వార్ధచింతన కూడుకుని ఉండి, తాను మాత్రమే గొప్ప అన్న అభిప్రాయాన్ని కలిగి, ప్రజల పట్ల హేయభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఈ పదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు.

  ఈ అహంకారపూరిత రాశిచక్ర సంకేతాల గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది. ఈ వ్యాసంలో అహంకారిక ధోరణులను ప్రదర్శించే ప్రధాన రాశి చక్రాల గురించిన వివరణలను మీ ముందు ఉంచబోతున్నాము. ఇవి అహంకారానికి ప్రతిరూపంగా జనించినవిగా చెప్పబడుతున్నాయి. కానీ అందరు ఒకేలా ఆలోచన చేస్తారని లేదు, వారి వారి గ్రహ స్థితుల ప్రభావం మేరకు లక్షణాల తీవ్రత ఉంటుంది.

   మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

  మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

  మేష రాశి వారిని అహంకారపూరితులుగా అభివర్ణిస్తారు. వారు పరిత్యాగ సమస్యలను కలిగి ఉంటారు. వారు ప్రపంచం తమ వైపు దృష్టి సారిoచాలనే ఆలోచనలో భాగంగా తమకుతామే గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఆలోచన తీవ్రంగా మారి, తమ పట్ల ఎక్కువ అంచనాలను ఏర్పరచుకునే వారిలా ఉంటారు. తద్వారా అహంకార ధోరణికి కేంద్రబిందువుగా కనిపిస్తుంటారు. ఇది ఇతరుల ఆలోచనలు మరియు భావాలను పరిగణించలేని విముఖత లేదా అసమర్థతకు దారితీస్తుంది. వీరి ఆలోచనా శక్తి తగ్గుముఖం పట్టడం కారణంగా అనాలోచితంగా అహంకార భావాలు మనసు నిండా పేరుకుని పోతుంటాయి. అయినప్పటికీ వారు తమ ప్రియమైన, మనసుకు దగ్గరైన వారితో పరస్పర ఆలోచనలను పంచుకోవడం, వారి పట్ల జాగ్రత్తతో కూడిన పర్యవేక్షణతో ఉండడం చేస్తుంటారు. కానీ వీరికి సరైన గైడెన్స్ అవసరం. జీవిత చరమాంకంలో వీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఈ అహంకార లక్షణాలు వేలెత్తి చూపుతూ, సమాజంలో వీరి స్థితిని వెక్కిరిస్తాయి. కావున, తమలో ఈ లక్షణాలు కనిపిస్తున్న ఎడల, వీటి గురించి ఆత్మ విమర్శ చేసుకోవడం అంతరాత్మతో చర్చలు జరపడం ద్వారా ఈ పరిస్థితి నుండి స్వావలంబన పొందవచ్చు.

  సింహ రాశి : జూలై 23 - ఆగష్టు 22

  సింహ రాశి : జూలై 23 - ఆగష్టు 22

  సింహ రాశి అధిపతి సూర్యుడిగా ఉండడం వలన, అన్ని విషయాల్లోనూ కేంద్రబిందువుగా ఉండేలా వీరి చర్యలు ఉంటాయి. వృత్తి పరంగా కూడా అనతికాలంలోనే ప్రపంచమంతా తమవైపే ధ్యాసను కేంద్రీకృతం చేసేలా చేయగలిగిన లక్షణాలు వీరి సొంతం. కానీ వీరి ఆలోచనలకు తగ్గట్లుగా పరిస్థితులు లేకపోతే వీరు అస్సలు క్షమించలేరు, తద్వారా తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి వీరి కోపం హద్దులు దాటి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా వీరి పట్ల ఎవరైనా హేయభావాన్ని ప్రదర్శించినా, తమను గుర్తించకపోయినా, వీరు అస్సలు సహించలేరు. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు, ఇతరుల పట్ల చులకనా భావం, అసూయలను ప్రదర్శిస్తూ ఉంటారు. మరియు వారు జీవితమంతటా ఏ స్వల్ప మార్పులు సంభవించినా, వాటితో పోరాడే క్రమంలో ఆలోచనా విధానాలను మార్చుకోగలరు . విశ్వాసంలో తమకంటూ ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటారు. వీరు వ్యక్తిగతంగా పగలు పెంచుకోకుండా, ఇతరుల భావాలని అంగీకరించడం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఏది ఏమైనా, సింహరాశి వాళ్ళు అందరినీ ఆకర్షించడంలో మాత్రం ఎప్పటికీ పై స్థాయిలోనే ఉంటారు.

  మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

  మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

  మకర రాశికి చెందిన వ్యక్తులు స్వార్థ పూర్వకంగా ఉండటంతో పాటు, ఇతరుల విషయాల్లో, తమనుతాము నిలదొక్కుకునే క్రమంలో భాగంగా తీవ్రమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ అందరికీ ఉత్తమంగానే కనిపించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మరియు ఇతరులను పైనుండి కిందకు చూస్తూ, తాము అన్నిటా ఉన్నత స్థాయిలో ఉన్నామన్న భావనలో ఉంటారు. వీరు తమ లక్ష్యసాధనలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది, తద్వారా అభద్రతా భావాలకు, అహంకారిక ధోరణులకు వీరి మనసు అడ్డాగా మారుతుంది. వారి అభద్రత కారణంగా, తమనితాము నిలదొక్కుకునే క్రమంలో భాగంగా డాంభికాలను ప్రదర్శిస్తుంటారు. మరియు ఇతరులను, వీరి అభద్రతాభావాలు తొలగించుకునే క్రమంలో భాగంగా పావులుగా వినియోగిస్తుంటారు. తామేంటో , తమ పరిస్థితులేమిటో అన్న ఆలోచనకు రావడం ద్వారా ఇటువంటి అహంకార పూరిత లక్షణాలను తొలగించుకోడానికి సాధ్యపడుతుంది. తద్వారా ఇతరుల పట్ల అహంకార ధోరణి క్రమంగా తగ్గుతుంది. వీరికి కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతో అవసరం. వీరు ఇతరుల మాటలకన్నా, కుటుంబ సభ్యుల లేదా తమ ప్రియమైన వారి మాటలకే ఎక్కువ విలువనిస్తుంటారు. ఇతరుల సూచనలను, మంచివైనా సరే, పరిగణనలోనికి తీసుకోరు.

  మీరు ఈ రాశిచక్రాలకు చెందినవారిలో ఒకరిగా ఉన్నారా? అయితే మీ అభిప్రాయాలను వాఖ్యల విభాగంలో తెలియజేయండి. ఇటువంటి రాశిచక్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలకోసం మా పేజీని తరచూ సందర్శించండి.

  English summary

  Zodiac Signs That Are More Likely To Be Narcissists

  Each zodiac sign has its fair share of positive and negatives qualities. After all, to have good sides and bad sides is what it is to be human. But according to astrology, a certain trait seems to be holding a person back in life, which can make the individual to be a bit self-absorbed that tags them to be narcissists. These zodiac signs are Aries, Leo and Capricorn.
  Story first published: Monday, May 21, 2018, 12:40 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more