ప్రేమలో వ్యతిరేక రాశి చక్రాల ప్రభావాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీరు ప్రేమలో పడినప్పుడు మీ ప్రేమ ని సహకరించే రాశి చక్రాల గురించిన వివరాలు తెలుసుకోవడం మంచిది. తద్వారా మీ ప్రేమలో విజయం సాధించే దిశలో అడుగులు వేయండి.

ఈ రాశి చక్రాలలో కొన్ని ప్రత్యేకమైన కలయికలు ప్రేమలో అనేకరకాల సమస్యలను సృష్టిస్తాయి,కావున ఈ రాశి చక్రాలు కలిగిన వారు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవడం మంచిది.

ఈ రాశిచక్రాలలో ఉన్నవారు ప్రేమలో పడితే తద్వారా కొన్ని చెడు పరిణామాలకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. కావున ఇలాంటి రాశి చక్రాల కలయికల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వృశ్చికo మరియు కర్కాటకం:

వృశ్చికo మరియు కర్కాటకం:

ఇరువురి మనసులను ఖచ్చితంగా భాధ పెట్టే రాశిచక్రాల కలయిక ఇది. ప్రేమలో వీరి వ్యక్తిగత భావోద్వేగాలు తారా స్థాయికి చేరుతాయి తద్వారా అనేక గొడవలకు కారణభూతాలు అవుతాయి. ఈ రాశులు స్తబ్ధత తో కూడి కోపావేశాలకు లోనయి ఉంటాయి. కావున చిన్ని గొడవలు సైతం చినికి చినికి గాలివానగా మారి చివరకు సంబంధం నాశనానికి దారి తీస్తుంది. ఒక వేళ సంబంధం కొనసాగినా కూడా, ఆరోగ్యకర వాతావరణం మాత్రం ఉండదు.

కన్య మరియు కర్కాటకం:

కన్య మరియు కర్కాటకం:

వీరి ఆలోచనా స్థాయిలు పూర్తిగా భిన్నంగా ఉండడం వలన, ఒకరికొకరు అర్ధం చేసుకునే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా కలహాలతో కూడిన సంబంధం దిశగా పయనం సాగుతుంది. కావున ఈ రాశిచక్రాల కలయికను సూచించలేము.

ధనుస్సు మరియు తుల:

ధనుస్సు మరియు తుల:

వీరిరువురూ ప్రతీకారేచ్చలు, పోరాటాల మీద ఉన్న ఆసక్తి, ప్రేమను పెంచడంలో చూపరు . ముఖ్యంగా భావోద్వేగాలు అధికంగా కలిగిన ఈ రాశుల కలయిక ప్రేమను పెంచడంలో 100 శాతం విఫలమనే చెప్పవచ్చు. కావున ఈ రాశిచక్రాలు కలిగిన వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

మకరo మరియు మిధునం:

మకరo మరియు మిధునం:

విరుద్ద బావాలు కలిగిన ఈ రాశుల కలయిక చెడు ప్రభావాలనే చూపిస్తుంది. ఇందులో మకర రాశి వారు సూటిగా, ఒక ప్రణాళికా బద్దంగా జీవితాన్ని నిర్మించుకునే ఆలోచ్నలను కలిగి ఉంటే , మిధున రాశి వారు ఈ పద్దతికి పూర్తి వ్యతిరేకులై ఉంటారు. కావున ఈ సంబంధం సూచించదగినది కాదు.

మీనం మరియు కన్య:

మీనం మరియు కన్య:

కన్యా రాశివారు ప్రణాళికా బద్దంగా తెలివితో వ్యవరిస్తూ ఉంటారు, కానీ అదే సమయంలో మీన రాశి వారు కలలలో ప్రయాణం చేస్తూ వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన ఈ జంట చెడు ప్రభావాలనే చూపిస్తుంది.

మీనం మరియు సింహo:

మీనం మరియు సింహo:

సింహరాశి వారు తమ వ్యక్తిగత ఆలోచనలకు ఎక్కువగా విలువని ఇస్తుంటారు, మానసిక ధృడత్వాన్ని కలిగి మరియు అందరిలో ఉన్నతంగా కనపడాలన్న ఆలోచనలు చేస్తుంటారు. మీన రాశి వారు ఊహాలోకాలలో అద్దాల మేడలను నిర్మిస్తూ ఉంటారు. పైగా సున్నితమైన స్వభావం కలిగిన వారు. వీరిరువురికీ పొంతన అనేది కుదరని పనే.

ధనుస్సు మరియు వృషభం

ధనుస్సు మరియు వృషభం

ఇద్దరూ తమ వ్యక్తిగత ఆలోచనలకు విలువని ఇస్తూ, భావోద్వేగాలు అధికంగా కలవారై ఉంటారు. తెలివితేటలు ప్రదర్శించడంలో ముందు ఉంటారు . వీరి కలయిక ఒక చదరంగం ఆటను మరపిస్తుంది. కానీ ఓడిపోవడానికి ఎద్దరూ సిద్దంగా ఉండరు. ఓటమిని జీర్ణించుకోలేక ఎత్తుకు పై ఎత్తులతో వీరి సంబంధాలు కొనసాగుతాయి. కావున ఈ పొంతన సూచించబడదు.

మేషం మరియు కర్కాటకం

మేషం మరియు కర్కాటకం

ఇద్దరూ ఎవరికి వారు ప్రత్యేకమైన స్వభావాలను కలిగి ఉంటారు, తమ కుటుంబం పట్ల ప్రేమ ఆప్యాయతలను అధికంగా కలిగిన వారై ఉంటారు. కానీ ఈ విషయంలోనే వీరిద్దరి మద్య పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అర్ధం చేసుకునే పాళ్ళు తక్కువగా ఉన్నందువలన , ఈ రాశి చక్రాల కలయిక కష్టమనే చెప్పాలి.

English summary

Zodiac Signs That Need To Have A Second Thought Before Falling In Love

Can you imagine that you need to think twice before you fall in love? Well, there are those zodiac sign combinations that can actually be quite deadly and disastrous. These zodiac signs are Scorpio And Cancer; Virgo And Gemini; Sagittarius And Libra; Pisces and Aquarius; Capricorn And Gemini; Virgo and Pisces..
Story first published: Wednesday, March 28, 2018, 15:38 [IST]