ఈ రాశుల వారికి 2018 మొత్తం ప్రతి రోజూ నరకమే

Written By:
Subscribe to Boldsky

ప్రతి మనిషికి జీవితం కష్టాలు.. సుఖాలుంటాయి. కొన్ని సందర్భాల్లో సమస్యలు మరీ ఎక్కువవుతుంటాయి. ఒక్కోసారి ఇబ్బందులు నిత్యం వెంటాడుతుంటాయి. అలాంటప్పుడు మనం టైమ్ బాగా లేదని అనుకుంటాం.

అయితే రాశుల ప్రకారం కూడా కొందరు ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కొన్ని రాశుల వారు 2018 సంవత్సరం మొత్తం నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. ఆయా రాశులకు 2018 మొత్తం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి.

మిథునం : మే 21- జూన్ 20

మిథునం : మే 21- జూన్ 20

మిథునరాశిలో శని ఎనిమిదో స్థానంలో ఉంటుంది. అందువల్ల మిథున రాశి వారు 2018లో ప్రతి రోజూ ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు తమ చుట్టు పక్కల ఉండేవాళ్ల వల్లే 2018లో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

మిథునరాశి వారి ఇబ్బందులివే

మిథునరాశి వారి ఇబ్బందులివే

మిథునరాశి వారు వ్యాపారాల్లో చాలా ఎదురుదెబ్బలు తింటారు. చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే వారు పని చేసే చోట కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. 2018లో వీరి కెరీర్ కు చాలా సమస్యలు తలెత్తుతాయి.

ధనస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనస్సు రాశి వారిపై కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశిలో శని రెండో స్థానంలో ఉంటాడు. వీరు 2018లో మొదట చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

ధనస్సు రాశికి సక్సెస్ దూరం

ధనస్సు రాశికి సక్సెస్ దూరం

ధనస్సు రాశి వారు 2018లో సక్సెస్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. వీరు ఎంత కష్టపడి పని చేసినా ఫలితం ఉండదు. అయితే ధనస్సు రాశి వారు కాస్త ఎక్కువ సహనం కలిగి ఉండాలి. మీరు ఓపికతో ఎదురు చూస్తే కచ్చితంగా విజయం ఏదో ఒక రోజు మీకు సొంతం అవుతుంది. అయినా 2018 మాత్రం మీకు బ్యాడ్ ఇయర్.

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి వారిపై 2018లో శని ప్రభావం ఉంటుంది. ఈ రాశిలో 12 వ స్థానంలో శని ఉంటుంది. 2018లో కుంభరాశి వారు ఎక్కువగా

మానసికంగా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. వీరు ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధగా పెట్టాలి. అలాగే కుంభ రాశి వారు పని చేసే ప్రాంతంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు.

కుంభంరాశి వారు అపజయాలను తట్టుకోవాలి

కుంభంరాశి వారు అపజయాలను తట్టుకోవాలి

కుంభంరాశి వారికి 2018లో ఎక్కువగా అపజయాలు వస్తాయి. వాటినన్నింటినీ తట్టుకోగలగాలి. అలాగే కుంభరాశి వారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ ధైర్యంగా ముందుకెళ్లాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకోగలిగే శక్తిని పొందాలి.

English summary

zodiac signs that will have worst career year for 2018

zodiac signs that will have worst career year for 2018...Are you worried why you are not climbing the ladder of success in spite of giving your best in your career? Then, you need to blame your stars for it. According to astrology, there are 3 zodiac signs, which are going to experience the worst phase of their career,
Story first published: Wednesday, February 7, 2018, 9:30 [IST]