For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  విడాకులు తీసుకోవడంలో ఈ రాశిచక్రాలు ఒక అడుగు ముందుకే!

  |

  విడాకులు తీసుకోవడంలో ఈ రాశిచక్రాలు ఒక అడుగు ముందుకే!

  మీ సంబంధంలో ప్రశాంతతను ఏర్పరచడానికి మీరు ప్రయత్నించినప్పుడు, ఒక్కోసారి సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. దీనికి అనేక అవకాశాలు, పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. ఒక్కోసారి అది మీ రాశిచక్రం గుర్తుకు కూడా సంబంధించినది కావచ్చు.

  ఇక్కడ ఈ వ్యాసంలో, విడాకులు పొందే అవకాశం ఉన్న రాశిచక్రాలలోని వాస్తవాలను గురించి మేము మీకు వెల్లడి చేస్తున్నాము.

  Zodiac Signs Which Are More Likely To Get Divorced

  విడాకులు పొందడానికి వ్యక్తి యొక్క అవకాశాల శ్రేణి ప్రకారం రాశిచక్రాలు పొందుపరచడం జరిగినది. వివాహం ఒక పవిత్రమైన బంధం అని గుర్తుంచుకోండి మరియు అది తేలికగా తీసుకునే విషయం ఎన్నటికీ కానేకాదు. వివాహ సంబంధాల గురించిన నిర్ణయాలు తీసుకునే ముందు సహనం, అవగాహన మరియు రాజీ తప్పకుండా అవసరమవుతాయి.

  ఒక్కోసారి మీ రాశిచక్రం కారణంగానే విడాకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఈ కారణం మీ వివాహాన్ని ఖచ్చితంగా విడాకులకు దారితీస్తుంది అని చెప్పలేము. దీనికి మీ జన్మ కుండలిలోని గ్రహాల స్థితిగతులు కూడా ప్రభావితం చేయవచ్చు. కావున పరిస్థితిని ఉద్దేశించి జ్యోతిష్య నిపుణుల వద్దకు వెళ్లి, వారి సూచనలను పాటించడం ఎంతో మేలు.

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబo పట్ల, ప్రేమల పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరితో వచ్చిన సమస్య ఒక్కటే, వీరు ఎప్పటికీ తమ తప్పులను అంగీకరించి క్షమాపణలు చెప్పడం వంటివి చేయరు. మరియు సమస్యలు ఉత్పన్నమైతే వీరి చర్యల పట్ల భాద్యతని తీసుకోరు. ఇతరులే తమకు క్షమాపణలు చెప్పాలని, ప్రేమలని కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. మరో వైపు, లోలోపల మదనపడుతూ ఉంటారు. క్రమంగా, వారి వైఖరి భాగస్వాముల మద్య సంబంధాన్ని సైతo నాశనం చేయగలదు. మరోవైపు, వారు తమ చర్యలను సమర్ధించుకునే క్రమంలో భాగంగా అబద్దాలకు కూడా పూనుకుంటూ ఉంటారు. తమ చర్యలు ప్రేమలకు ఆటంకంగా మారుతున్నప్పుడే గుర్తించి, నివారణా చర్యలు ప్రారంభించాలి. తద్వారా సంబంధాలను నాశనం కాకుండా కాపాడుకోగలరు. తమ భాగస్వామి మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, వారి నుండి దూరం కాకూడదన్న భావన ఉంటే, వారి పట్ల నిజాయితీతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. ప్రేమలో పొరపొచ్చాలు సర్వసాధారణం, క్షమాగుణం లేదా క్షమాపణ కోరే తత్వం ప్రేమలను పదిలంగా ఉంచగలుగుతుందని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడుపగలరు. వీరు ముఖ్యంగా తమ ప్రియమైన వారితో లేదా శ్రేయోభిలాషులతో చర్చలు జరపడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలరు.

  మిధున రాశి : మే 21 - జూన్ 20

  మిధున రాశి : మే 21 - జూన్ 20

  మిధున రాశికి చెందిన వ్యక్తులు వారి అభిప్రాయాలను నిజమని రుజువు చేయడానికి ఎదుటి వారి మనసులను సైతం మార్చగలరు. తరచూ, ఈ వ్యక్తులు వారి వాస్తవ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కాకుండా ఇతరులను బ్రతిమిలాడుటకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. మరోవైపు, నిర్ణయాలు తీసుకోవడంలో ఎల్లప్పుడూ ఇబ్బందులని కలిగి ఉంటారు. వారి భాగస్వామి లేనప్పుడు మాత్రమే, వారు తమ మనస్సుల్లో పరిపూర్ణంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ భాగస్వామి పంచన ఉన్నప్పుడు వీరి వాస్తవిక జీవనం, సంబంధానికి స్వస్థి పలికించవచ్చు. వారు భాగస్వాముల మద్య సంబంధంలో పనిచేయని విషయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. విమర్శించడంలో, భావవ్యక్తీకరణలో ఇతరుల మనసు నొప్పించేలా వీరి ప్రవర్తన ఉండకూడదని గుర్తించాల్సిన అవసరం ఉంది.

  కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

  కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

  కుంభ రాశి వ్యక్తులు విశాల హృదయాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ పద్దతి అన్ని వేళలా సరైనది కాదు అని తెలుసుకోవలసి ఉంటుంది. ప్రజలు వారి సున్నితమైన స్వభావాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు. దీనిని వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. వీరు, వారి మృదుస్వభావం కారణంగా తమకు సరిపోలని వారితో కూడా సులభంగా ప్రేమలో పడవచ్చు, ఎందుకంటే ప్రేమను కోరుకునే వీరి పట్ల ప్రేమను ప్రదర్శిoచే వారిని ఎప్పటికీ కాదనలేరు. కానీ అవకాశవాదుల చేతిలో పడినప్పుడు, వీరు అనేక సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు నెలకొంటాయి. వీరు తమ భాగస్వాముల గౌరవం పెంచడంలో భాగంగా తమకు తాము అదఃపాతాళానికి వెళ్తున్నారన్న సంగతిని విస్మరిస్తుంటారు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితుల దృష్ట్యా ఇతరులపై ఆధారపడకుండా, అంతరాత్మతో చర్చలు జరిపి, నిజానిజాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. మరియు ఒక సంబంధం నిలబడాలి అంటే, భాగస్వాములిద్దరి భాద్యతలు సమానంగా ఉండాలని గ్రహించవలసిన అవసరం ఉంది.

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

  మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

  మీన రాశికి చెందిన వ్యక్తులు వర్తమానంలో నివసించేవారుగా ఉంటారు. అనగా వారు జరుగబోయే పరిణామాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా, సులభంగా ప్రేమలో పడవచ్చు. ఏం జరిగితే అది అన్న భావనలో ఉంటారు. మరియు, అదే సమయంలో, నిర్ణయాల పట్ల అవగాహన లేక, కలిగే ప్రతికూల పరిస్థితులను కూడా విస్మరిస్తూ ఉంటారు. తద్వారా వీరి వివాహ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి రావొచ్చు. క్రమంగా వివాహం జరిగిన వెంటనే అయినా, లేదా తర్వాతి కాలంలో అయినా సంబంధం పట్ల విముఖతను వ్యక్తం చేస్తుంటారు. వారు తరచుగా సంబంధంలో, ముఖ్యమైన వాస్తవాలను, విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోకుండా సంబంధాలలోనికి అడుగేస్తుంటారు. వీరు ఆలోచించిన జీవితానికి, జరుగుతున్న జీవితానికి పొంతన కుదరక, అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కావున వీరి మానసిక పరిస్థితిని అధిగమించే క్రమంలో భాగంగా ఆద్యాత్మికతత్వాన్ని అలవరచుకోవలసి వస్తుంది. ఊహాజనిత ప్రపంచానికి నిజ జీవితానికి వ్యత్యాసాన్ని గమనించి, భవిష్యత్ ఆలోచనలతో, భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా లేని పక్షంలో జీవనం, తెరచాప లేని నావలా, అలలకు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.

  మరిన్ని రాశిచక్రాల వివరాలకై మా పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.

  English summary

  Zodiac Signs Which Are More Likely To Get Divorced

  There are so many reasons that can lead to a divorce and astrologers reveal about the signs that are most likely to get divorced. These zodiac signs tend to get into unwanted hassles with their partners which can result in divorce. These zodiac signs are ranked as per their chances of being divorced. They are: Taurus, Gemini, Aquarius and Pisces.
  Story first published: Monday, May 21, 2018, 16:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more