For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సంతానం పట్ల కుతూహలం ప్రదర్శించడానికి రాశి చక్రాలకి సంబంధం ఉంటుందా ?

  |

  కొందరు తల్లిదండ్రులుగా మారడానికి సుముఖంగా ఉండరు, సమయం తీస్కోవాలని దాటేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడెప్పుడు పిల్లలను ఎత్తుకుందామా అని కుతూహలంగా ఉంటారు. ఇలాంటి ఆలోచనా పర్వాలకి కూడా రాశి చక్రాలు కారణం అవుతాయని ఊహించగలరా. జ్యోతిష్య శాస్త్రం మాత్రo నిజమనే చెప్తుంది. కొన్ని రాశి చక్రాలు త్వరగా సంతానాన్ని కలిగి ఉండాలన్న ఆలోచనని పెంచుతూ ఉంటాయి.

  ఈ వ్యాసంలో ప్రతి రాశి చక్రంలో, సంతానానికి సంబంధించిన ఆలోచనా విధానాలను మీముందు ఉంచబోతున్నాము. తద్వారా ఏ రాశి చక్రం తల్లిదండ్రులు కావాలన్న ఆలోచనకు ఊతమిస్తుందో, ఏది వ్యతిరేకంగా ఉంటుందో తెలుసుకునే వీలుంది.

  ఆలోచనా విధానాలను అనుసరించి రాశి చక్రాల క్రమాలను పొందుపరచడం జరిగినది.

  మేష రాశి : మార్చి 21 – ఏప్రిల్ 19

  మేష రాశి : మార్చి 21 – ఏప్రిల్ 19

  సంతానం విషయంలో అంతగా సుముఖంగా ఉండని రాశులలో మేషరాశి ఒకటి. వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలకై ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా వెంటనే సంతాన భాద్యతలలోకి దిగాలి అంటే ఆలోచనలు చేస్తుంటారు. పిల్లలు అనే అంశం వీరికి చివరిదిగా ఉంటుంది. కానీ సంతానం కలిగితే మాత్రం, వారు తమ పేరు ఎక్కడ తగ్గిస్తారో అన్న అభద్రతా భావాలను కలిగి ఉంటారు కూడా.

  వృషభ రాశి : ఏప్రిల్ 20 – మే 20

  వృషభ రాశి : ఏప్రిల్ 20 – మే 20

  వీరు అన్ని విధాలా సౌకర్యాలని కోరుకునే వారిలా ఉంటారు. మిగిలిన అన్ని రాశులలో పోలిస్తే పిల్లల విషయంలో ఒక గందరగోళాన్ని కలిగి ఉంటారు. వీరు పిల్లలను కావాలనుకుంటున్నారో, వద్దని భావిస్తున్నారో వీరికే ఒక అవగాహన ఉండదు. తాము సంతానాన్ని కలిగి ఉంటే, వారికి అన్నిరకాల సౌకర్యాలను అందివ్వగలమా అన్న ఆలోచన చేస్తుంటారు. స్వతహాగా కుటుంబాన్ని అధికంగా ప్రేమించే వీరు, సంతానం విషయంలో ఆమాత్రం ఆలోచనలు చేయకుండా ఉండలేరు కదా.

  మిధున రాశి : మే 21 – జూన్ 20

  మిధున రాశి : మే 21 – జూన్ 20

  అందరినీ కలుపుకు పోయే మస్తత్వం కలిగి, తెలివైన వారిగా ఉండే మిధున రాశి వారు సంతానం విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తుంటారు. సంతాన భాద్యతలు కలిగి ఉండడం ఒక అడ్డంకిగా భావిస్తుంటారు. సంతానం కలిగిన తర్వాత కూడా తమ సామాజిక సంబంధాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలు చేయరు. ఈ అలవాటు కూడా ఒకరకంగా తమ పిల్లలకు సామాజిక తోడ్పాటును అందివ్వగలదన్న ఆలోచన చేస్తుంటారు.

  కర్కాటకం : జూన్ 21 – జూలై 22

  కర్కాటకం : జూన్ 21 – జూలై 22

  తల్లిదండ్రులు కావాలన్న ఆలోచన కలిగిన అన్ని రాశులలో కూడా మొట్ట మొదటగా ఉండే రాశి కర్కాటక రాశి అని చెప్పబడినది. పెళ్లి జరిగిన నాటి నుండి పిల్లలకోసం అత్యధికంగా కుతూహలంగా ఉండేవారిలో కర్కాటక రాశి వారు ముందుగా ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు. మరియు పుట్టబోయే బిడ్డ గురించిన అంచనాలను కూడా అధికంగా కలిగి ఉంటారు.

  సింహ రాశి : జూలై 23 – ఆగస్ట్ 23

  సింహ రాశి : జూలై 23 – ఆగస్ట్ 23

  సింహరాశి అంటేనే, కేంద్రబిందువుగా ఆలోచించే తత్వం అని అందరికీ తెలుసు. కాని సంతానo విషయం లో మాత్రం వీరు అంతగా అంగీకరించేలా ఉండరనే చెప్పాలి. జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ కాలానుగుణంగా జరిగేవే అన్న ఆలోచనను చేస్తుంటారు. కానీ, ఒక్కసారి సంతానం కలిగాక వారిని అమితంగా ప్రేమిస్తారు. మరియు వారి ద్వారా పేరు ప్రఖ్యాతలు గడించాలన్న ఆలోచనలు కూడా చేస్తుంటారు.

  కన్యా రాశి : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

  కన్యా రాశి : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

  కన్యా రాశి వారు కూడా సంతానం విషయంలో సుముఖంగా ఉండరు. జీవితంలో అనేక భాద్యతలను కలిగి ఉండే వీరు, ప్రతి ఒక్క విషయాన్ని ప్రణాళికా బద్దంగా జరపాలన్న ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా సంతానాన్ని కూడా ఒక భాద్యతగా భావించి, ప్రణాళికాబద్దమైన ఆలోచనలు చేస్తుంటారు.

  తులా రాశి : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  తులా రాశి : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  మానవత్వo అనేది పిల్లలను పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుంది అన్న ఆలోచనలు చేసేవారు వీరు. తద్వారా తమకు పుట్టే పిల్లలు కూడా ఆలోచనా విధానాలలో అందరికన్నా ఉత్తమంగా ఉండాలని ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనల నేపద్యంలో , సంతానం విషయంలో మాత్రం కాస్త సుదూరాలోచనలు చేస్తుంటారు. వెంటనే తల్లిదండ్రులవడానికి అంగీకరించలేరు కూడా. స్వతహాగా పిల్లలంటే అధిక ప్రేమను కలవారిగా ఉంటారు. వీరు మానసికంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులను అనుసరించి ముందుకు అడుగు వేసే వ్యక్తిత్వం వీరిది.

  వృశ్చికం : అక్టోబర్ 24 – నవంబర్ 22

  వృశ్చికం : అక్టోబర్ 24 – నవంబర్ 22

  మిగిలిన అన్ని విషయాలలో వీరు అంత కుతూహలాన్ని ప్రదర్శించరు. భావోద్వేగాలను గుండె చాటున ఉంచుకుని పైకి గాంభీర్యంగా కనిపించే వ్యక్తిత్వం వీరి సొంతంగా ఉంటుంది. ఎటువంటి భావోద్వేగాలనైనా అణిచి పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉండే ఈ రాశి వారు, తల్లిదండ్రులు కావాలన్న ఆలోచనని కూడా అలాగే మానసికంగా కలిగి ఉంటారు. కాకపోతే బయటపడరు పెద్దగా. వీరు తమ ఆలోచనలను తమ ప్రియమైన వారితో మాత్రమే పంచుకునేలా ఉంటారు.

  ధనుస్సు రాశి : నవంబర్ 23 – డిసెంబర్ 22

  ధనుస్సు రాశి : నవంబర్ 23 – డిసెంబర్ 22

  మిగిలిన అన్ని రాశులతో పోలిస్తే, సంతానం ఎంత ఆలస్యమయితే అంత మంచిది అన్న ఆలోచన చేసేవారిలో ఈ ధనుస్సు రాశి వారు మొదటస్థానంలో ఉంటారు. వీరికి గుండె ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేశాకనే, పరిణామాలు అర్ధo చేసుకున్న తర్వాతనే అడుగు పెడుతారు. తద్వారా పిల్లల విషయంలో కూడా అలాంటి ఆలోచనలనే కలిగి ఉంటారు. మరో పక్క లక్ష్యాలను అధికంగా కలిగి ఉండే వీరు, సంతానం అవరోధం అన్న భావనను కలిగి ఉంటారు. కావున పరిస్థితులన్నీ చక్కబడిన నేపధ్యo లోనే పిల్లల గురించిన ఆలోచనలు చేస్తుoటారు.

  మకర రాశి : డిసెంబర్ 23 – జనవరి 20

  మకర రాశి : డిసెంబర్ 23 – జనవరి 20

  ఒకవేళ మీరు ఈ రాశికి చెందినవారైతే, మీ కుటుంబం పట్ల నిజాయితీని, ప్రేమను అధికంగా కలిగిన వారై ఉంటారు. కాని వ్యక్తిగతంగా సంతానం విషయంలో వెంటనే నిర్ణయాన్ని తీస్కోలేరు. ఇంచుమించు వృషభ రాశి వారిలా ఆలోచనలు చేస్తుంటారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ప్రణాళికలు చేస్తుంటారు. తద్వారా తల్లిదండ్రుల భాద్యతలోకి వెంటనే దిగాలి అంటే మాత్రం, సంకోచిస్తారు.

  కుంభ రాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

  కుంభ రాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

  వీరికి భావోద్వేగాలు కాస్త తక్కువగానే ఉంటాయి. తద్వారా సంతానం విషయంలో ఎంత ఆలస్యమైతే అంత మంచిదన్న భావనలో ఉంటారు. తమ పిల్లల పెరుగుదలలో కూడా అసాధారణ జీవన శైలిని అందివ్వజూపుతారు. మానవత్వపు విలువలు అధికంగా ఉండేలా, భావోద్వేగాలను అవసరాన్ని బట్టి ప్రదర్శించేలా పిల్లలను పెంచగలరు.

  మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

  వీరు వర్తమాన ఆలోచనలు చేస్తుంటారు. సంతానం అనేది సహజ సిద్దంగా ప్రకృతిలో భాగం అన్న ఆలోచన వీరిది. సంతానం విషయంలో కొంచం తులా రాశి లేదా కర్కాటక రాశి ఆలోచనా విధానాలను కలిగి ఉంటారు. వీరు స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కానీ వీరి సానుభూతితత్వం పిల్లలకు ఇష్టంగా ఉంటుంది.

  English summary

  Zodiacs Which Are Known To Be The Best Parents

  Each one of us areis known to take the responsibility of becoming a parent at some point of time and this can be related to the zodiac signs as well. From being ranked as the least interested in becoming a parent to the ones who are known to become a great parent, are listed in the predictions of zodiac signs are ranked based on this.
  Story first published: Thursday, May 3, 2018, 16:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more