For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో అంచనాలను అధికంగా కలిగిన రాశిచక్రాలు ఇవే?

|

ప్రతి మనిషి తన జీవితం పట్ల సాధారణంగానే అంచనాలను కలిగి ఉంటాడు. కానీ ఆలోచనలు, అంచనాలు తీవ్రమైతే, ఇతరులతో పోలికలు వేసుకోవడం, క్రమంగా ఆర్ధిక-ఆరోగ్య పతనానికి దారితీయడం వంటి పలు అంశాలు పరిపాటి అవుతుంటాయి. ఎక్కువగా ఊహాజనిత లోకాలలోనే జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. ఉదాహరణకు స్థోమత, ఆర్ధిక పరిస్థితులను మించిన కోరికలు. కొంతకాలానికి మనిషి ఆలోచనలలో మార్పులు రావడం ద్వారా ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకుని జీవితంపట్ల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ నిర్ణయలోపం ఉన్న పక్షంలో వారి జీవితం అస్తవ్యస్తమే.

ఈ ప్రపంచంలో పరిపూర్ణ వ్యక్తి అనేవిధంగా ఎవ్వరూ ఉండరు అన్నది నిజం. కానీ అధికశాతం తమలో లోపాలను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా ఇతరులలో లోపాలను ఎంచుతూ ఉంటారు. కొంతమందైతే ఇతరులు తమకన్నా కొంచం ఎక్కువగా కనిపించినా సూటిపోటి మాటలతో మానసికక్షోభకు కూడా గురి చేస్తుంటారు. వీటన్నిటికీ కారణం వారి జీవితంలో వారు సృష్టించుకున్న అంచనాలను అందుకోలేకపోవడమే.

Zodiac Signs Who Have High Expectations In Life

అంచనాలను కూడా తెలివిగా కలిగి ఉన్న వ్యక్తే పరిపూర్ణ వ్యక్తి అవుతాడు.

ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఇప్పుడు చెప్పబోయే రాశిచక్రాలు, మిగిలిన ఇతర రాశిచక్రాలతో పోల్చినప్పుడు జీవితంలో అధిక అంచనాలను కలిగి ఉంటాయి. ఒక్కోసారి అవే పతనానికి కారణం కావొచ్చు కూడా.

ఇతరుల మాటలకు ఉప్పొంగడం, క్రుంగిపోవడం వంటివి పక్కన పెట్టి, సానుకూల ప్రతికూల అంశాలను సమానంగా స్వీకరించే తత్వం కలిగిన వాడే ఎప్పటికైనా నాయకుడు అవుతాడు. కాబట్టి ముందు తమ గురించి తమకంటూ ఒక అంచనా ఉండాలి. తర్వాతే జీవితంపై అంచనాలను నిర్మించుకోవాలి.

మరొక వైపు, ఇతరుల నుండి కూడా అధిక అంచనాలను కలిగి ఉండడం సరికాదు, అందరూ నీలాగే సాటి మనుషులన్న భావన మనసులో ఉండాలి. వారి వారి పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తికీ తమ జీవితంలో అంచనాలు మారుతుంటాయని గ్రహించాలి.

కొన్నిసార్లు అసాధ్యమైన అంచనాలను కలిగి ఉండటం ద్వారా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇక్కడ పొందుపరచబడిన రాశిచక్రాలు అటువంటి అంచనాలను కలిగి ఉండడంలో ముందుగా ఉంటాయని చెప్పబడింది.

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

ఉన్నతమైన అంచనాలు, ప్రణాళికాబద్దమైన నిర్ణయాలు మరియు ప్రమాణాలు, కన్యా రాశి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. వారు ఇతరులతో పరస్పరం వ్యవహరించే ముందు వారికంటూ కొన్ని నిర్ణయాలు, అంచనాలు ఉంటుంటాయి. తద్వారా వారు ఏమి మాట్లాడుతున్నారో వారికంటూ ఒక అవగాహన కూడా ఉంటుంది.

ఎవరైనా తమకోసం ఏదైనా చేయమని కోరితే, ఆ కోరికలను తీర్చే క్రమంలో పరిపరివిధాల ఆలోచనలను చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక్కోసారి వీరి ఆలోచనల ద్వారా ఫలితం పొందలేని పక్షంలో, తమ ప్రణాళికలో లోపం ఉందన్న భావనకు గురవుతుంటారు. కానీ ఒక గుణపాఠంగా తీసుకుని జీవితంలో ముందుకు అడుగువేయాలన్న దృఢ సంకల్పం కూడా వీరి సొంతం.

మిధున రాశి : మే 21- జూన్ 20

మిధున రాశి : మే 21- జూన్ 20

మిధున రాశి వ్యక్తులు జీవితంలో ఎక్కువ అంచనాలను కలిగి ఉంటారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలను కఠినంగా తీసుకునే వీరు తమ అంచనాలకు విరుద్దంగా లేదా మించిన ఫలితాలను పొందినప్పుడు భావోద్వేగాలను కట్టడి చేయలేని స్థితికి వెళ్తుంటారు. మరొకవైపు, అది భాగస్వామితో శృంగార విషయాలలో కూడా రాజీపడని తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా ప్రతి అంశం తమకు అనుకూలంగా ఉండేలా ఆలోచనలు చేయడం కారణంగా, అవరోధాలు వచ్చిన క్రమంలో మానసిక క్రుంగుబాటుకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఈ వ్యక్తులు అత్యంత తెలివైన వారిగా ఉండడమే కాకుండా, అదే సమయంలో వారి ప్రమాణాలు, అంచనాలను కూడా అధికంగా కలిగి ఉంటారు. దీనికి కారణం, వారు తమ జీవితంలో అందరికీ ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనలు చేయడమే. తమ అంచనాలకు అనుగుణంగాలేని వ్యక్తులు తమ జీవితంలో ఎదురైతే గందరగోళానికి గురవుతూ ఉంటారు.

సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

సింహ రాశి వాళ్ళ జీవితంలో తాము పొందే ప్రతి అంశం ఉన్నతంగా ఉండాలని, వాటి ద్వారా సంఘంలో మంచి గుర్తింపు లభించాలని తహతహలాడుతూ ఉంటారు. ఎక్కువగా తమను విశ్వసించే వారు ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. కుటుంబం, భాగస్వాములు, సన్నిహితులoదరిలోను తమకే అధిక ప్రాధాన్యత లభించాలని భావించే వీరు, తమ అంచనాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఎదురైన పరిస్థితుల్లో ఉనికిని కోల్పోయామన్న భావనకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు.

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

ఇతరుల సంబంధాలతో, వారి పరిస్థితులలో తమను తాము పోల్చి చూడడం, సినిమాల, సీరియళ్ళలోని పాత్రలలోని వ్యక్తులతో చుట్టు పక్కల పరిస్థితులను అంచనాలు వేయడం వంటి కాల్పనిక ప్రపంచంలో ఎక్కువగా జీవితాన్ని నడుపుతుంటారు. ఈ ఆలోచనల నుండి బయటకు వచ్చిన పక్షంలో తమ జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు.

English summary

Zodiac Signs Who Have High Expectations In Life

No human is perfect and if you are trying to find someone who measures up to your ultra-high expectations, it is a task in itself. There are possibilities of things getting disillusioned and bitter if the person does not meet your expectations.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more