For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశిచక్రాల వారు పెళ్ళంటేనే వెనకడుగు వేస్తుంటారు...!

|

వివాహం చేసుకోవడం ఇష్టపూర్వకంగా జరగాలి కానీ, బలవంతంగా మానసికంగా శారీరికంగా చిత్ర హింసలు పెట్టి కాదు. ఒక వేళ అలా బలవంతపెట్టి వివాహాలను జరిపించినా, ఆ వివాహం దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు చందాన సాగుతుంటుంది.

క్రమంగా చింతలు లేని కుటుంబానికి ఆదర్శంగా ఉండాల్సిన దంపతులమద్య భూతద్దంలో వెతికినా సంతోషాల చాయలు కనపడవు.

ఇక్కడ, ఈ వ్యాసంలో, వివాహం అంటేనే జంకే స్వభావాన్ని కనపరుస్తున్న రాశిచక్రాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

జీవితమంతా వివాహం చేస్కోకూడదు అని నిర్ణయాలు తీసుకునే వారు కాదు, తాత్కాలిక ఆలోచనల ప్రభావాల గురించిన అంచనాలను పొందుపరచడం జరిగినది.ఎక్కువగా వివాహానికి సరైన సమయం ఇది కాదని భావించే వారుగా ఉండడమే.

వివాహం అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే రాశి చక్రాల గురించిన వివరాలు క్రింది వ్యాసంలో పొందుపరచబడినవి.

ఈక్రింది రాశిచక్రాల వారు పెళ్ళంటేనే వెనకడుగు వేస్తుంటారు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద, ప్రియమైన వారు మరియు శ్రేయోభిలాషుల మీద అధిక ప్రేమను కలిగి ఉండే మేషరాశి వారు జీవితంలో, ఎక్కువగా విలువలకు కట్టుబడి ఉంటారు. వీరి ప్రతి ఆలోచనలోనూ కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఉంటుంది. క్రమంగా వివాహం తర్వాత జీవితంలో అడుగుపెట్టే భాగస్వామి తన భావాలకు కుటుంబానికి విలువను ఇస్తుందో లేదో తెలియక తీవ్రంగా మదన పడుతుంటారు. అంతేకాకుండా తాము ఎంతగా అయితే వారిని ప్రేమిస్తారో అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. కాబట్టి వెంటనే వివాహానికి సుముఖతను వ్యక్తం చేయలేరు. అన్ని విధాలుగా తమ ఆలోచనలను మరియు మానసిక స్థితిగతులను సంతృప్తి పరిచే వ్యక్తులను భాగస్వాములుగా కలిగిఉండుటకై ఆరాటపడుతుంటారు. మరియు తమ వృత్తి మరియు లక్ష్య సాధనలో తమ ఆలోచనలకు తగిన విధంగా భాగస్వామిని కలిగి ఉండాలని కలలు కంటుంటారు. సర్దుకుపోయి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలకు కాస్త దూరంగా ఉంటారు.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి వ్యక్తుల సహజ స్వభావం ప్రకారం కొత్త వ్యక్తులతో కలిసి ఉండడం మరియు తెలియని వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చడం వంటి విషయాలను ద్వేషిస్తుంటారు. తమకు నచ్చిన లేదా తమకు అన్ని విధాలుగా తెలిసిన వారినే వివాహం చేసుకొనుటకు సుముఖత చూపుతారు. తమకు నచ్చని వ్యక్తుల పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగివుంటారు. ఒకవేళ ఇష్టంలేని వివాహానికి ప్రోత్సహించిన ఎడల వీరి చర్యలు వర్ణనాతీతంగా ఉంటాయి. వీలైన మేర వివాహం వీగిపోయేలా ఆలోచనలు చేస్తుంటారు. మరియు వివాహం తరువాత కూడా సర్దుకోవడానికి అత్యధిక సమయాన్ని తీసుకునే మిధున రాశి వారు, ఒక్కసారి తమ నమ్మకాన్ని పొందాక జీవితాంతం భాగస్వామికి నిబద్ధులై ఉంటారు. కుటుంబం మొత్తం ఒకరి చేతులమీదే జరగాలి, మిగిలిన వారు తోడ్పాటునందివ్వాలి అన్న ఆలోచన వీరి సొంతం. క్రమంగా తమ ఆలోచనలకు తగినట్లుగా కుటుంబ ఆర్ధిక స్థితిగతులను నిలబెట్టగలిగే భాగస్వామి తోడైతే, వీరి ఆనందానికి అవధులు ఉండవు. ఎంత కోపాన్ని ప్రదర్సిస్తుంటారో అంత ప్రేమను కలిగి ఉంటారు. తమ అనుకున్న వారిమీదే కోప తాపాలను ప్రదర్శించే మిదునరాశి వారిని భాగస్వాములుగా కలిగి ఉండడం ఒక వరమనే చెప్పాలి. కానీ, వీరిని వివాహానికి ఒప్పించడం మాత్రం అంత సులువైన విషయం కాదు.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి వారు ఎక్కువగా కుటుంబ సభ్యులకు, బంధాలకు విలువ ఇస్తుంటారు. తాను చేసుకోబోయే వ్యక్తులు కుటుంబ సభ్యులలో ఒకరిగా, అందరినీ సమానంగా చూస్తూ, బంధాలకు భాంధవ్యాలకు విలువలను ఇచ్చేలా ఉండాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. ఎటువంటి ప్రతికూల సమస్యలు ఎదురైనా, ఒంటరిగా పోరాడే ఈ తులా రాశి వ్యక్తులు తమ భావాలను, భావోద్వేగాలను పంచుకునేలా భాగస్వామి ఉండాలని కలలు కంటుంటారు. ఎక్కువగా ప్రేమ వివాహాలకు మొగ్గుచూపే వీరు, తమ భాగస్వామి గురించిన ఆలోచనలను, విధివిధానాలను ప్రత్యేకంగా కలిగి ఉంటారు. ఒకవేళ తమ ఆలోచనలకు తగినట్లుగా భాగస్వామి లేని పక్షాన అసౌకర్యానికి గురవడమే కాకుండా ఆత్మన్యూనతకు కూడా లోనవుతుంటారు. ఈ కారణంచేతనే వివాహం అంటేనే కొంత సమయం తీసుకునేలా వీరి మానసిక స్థితి ప్రేరేపించబడుతుంది.

తమ భావాలకు తగినట్లుగా భాగస్వామి ఉన్న ఎడల, వీరి ఆనందానికి హద్దులుండవు. మరియు తమ ఆలోచనలను, విధానాలను భాగస్వామికి అర్థమయ్యేరీతిలో వివరించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఎక్కువగా భావ వ్యక్తీకరణ స్వేచ్చకు ప్రాధాన్యతను ఇస్తుంటారు, క్రమంగా ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాట్లను కలిగి ఉంటారు.

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఎక్కువగా ప్రేమను కలిగి ఉండాలని భావించే మీనరాశి వ్యక్తులు వివాహం ద్వారా సంబంధంలోకి అడుగుపెట్టే భాగస్వామి తమ ఆలోచనలకు తగినట్లుగా ఉంటారో లేదో అన్న అనుమానాన్ని కలిగివుంటారు. మరియు తమ ఆలోచనలకు తగినట్లుగా పరిసరాలు లేని పక్షాన అసౌకర్యానికి గురయ్యే మీనరాశి వ్యక్తులు కొత్తగా సంబంధాలలోని అడుగుపెట్టడానికి కొంత సమయాన్ని తీసుకోవడం పరిపాటిగా ఉంటుంది. ఎక్కువగా స్నేహితుల్లో లేదా తన మనసును అర్థం చేసుకున్న వారిని జీవిత భాగస్వామిగా కలిగి ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే మీన రాశి వ్యక్తులు తమ భావాలను అర్థం చేసుకునే భాగస్వామి జీవితంలో ఉండాలని కలలు కంటుంటారు. తమ భావాలకు అభిప్రాయాలకు విలువివ్వని భాగస్వామిని కలిగి వున్న ఎడల, అసౌకర్యానికి లోనవుతుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Zodiac Signs Who Regret Getting Married

There are four zodiac signs according to astrology which are known to regret being in a committed relationship. These zodiac signs are known to regret rushing into a marriage over a period of time. According to astrologers, these zodiacs are the ones who regret the most when it comes to rushing into a wedding, and these signs are Aries, Gemini, Libra, and Pisces.
Story first published: Tuesday, July 31, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more