చెడ్డపేరు తెచ్చుకోవడంలో కూడా ఈ రాశిచక్రాలు ముందే ..!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీకు తెలుసా కొందరి వ్యక్తిత్వ ధోరణిలు సైతం రాశిచక్రాలపై ఆధారపడి ఉంటాయని. నిజం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్రాలు మిగిలిన వాటితో పోల్చినప్పుడు చెడ్డపేరు తెచ్చుకోవడంలో ముందు ఉంటాయని కూడా చెప్పబడింది.

ఈ రాశిచక్రాల సంబంధించిన వారి వ్యక్తిత్వ ధోరణి, మరియు ప్రవర్తించే విధానాలు కాస్త భిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. ఒక్కోసారి వీరిలో చెడు లేకపోయినా కూడా కొన్ని సందర్భాలలో తప్పుగా అర్ధం చేసుకోవడం లేదా తప్పుగా అర్ధమవడం జరుగుతూ ఉంటాయి. తద్వారా చెడ్డ పేరుకు నిలువుటద్దంలా కనిపిస్తుంటారు. ఇది వీరి రాశిచక్రాల ప్రభావo. కావున ఈ రాశిచక్రాలను ప్రత్యేకంగా విభజించడం జరిగినది.

మేషం మార్చి 21 – ఏప్రిల్ 19

మేషం మార్చి 21 – ఏప్రిల్ 19

వీరు శ్రమ జీవులు, నిరంతరం పని మీదనే వీరి ద్యాస ఉంటుంది. అలాగని తెలివి తక్కువ వారు కాదు. వీరు ఎల్లప్పుడు జీవన మార్గాన్ని ఒక లక్ష్య సాధనతో ముందుకు నడుపుతుంటారు. తమ మార్గంలో ఎటువంటి విషయాలు అడ్డు వచ్చినా, వాటిని అడ్డు తొలగించుకుని, మార్గాన్ని సుగమం చేసుకునే ఆలోచనలు చేస్తుంటారు. ఇది వీరి పట్టుదలకు తార్కాణం. కానీ ఈ పద్దతి సమాజంలో వీరిని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు వీరు ఎక్కువగా ఏ విషయమును గురించి అయినా తీవ్రంగా ఆలోచించరు, కానీ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ పద్దతి చాలా మందికి మింగుడు పడనివిగా ఉంటాయి.

మిధునం మే 21 – జూన్ 20

మిధునం మే 21 – జూన్ 20

వీరు ఎక్కువగా ఇతరులతో మంచి సంబంధాలకై తాపత్రయపడుతుంటారు. ఒక్కోసారి వీరి ఆలోచనలు మోసపూరితo గా అనిపించినా, అవి వారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధాలను నిలబెట్టుకోవడానికి మాత్రమే చేస్తుంటారు. కానీ వీరి మాటల దృష్ట్యా జనాలు అపోహపడి, వీరిని చెడ్డవారిలా చూసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి మనసుల్లో ఎటువంటి చెడు ఆలోచనలు లేకపోయినా, ఒక్కోసారి వీళ్ళ పనులు అనుమానం కలిగించేవిలా ఉంటాయి.

కర్కాటకం జూన్ 21 –జూలై 22

కర్కాటకం జూన్ 21 –జూలై 22

వీరు ఎక్కువగా సున్నిత మనస్కులై ఉంటారు మరియు అధికంగా భావోద్వేగాలు కలిగిన వారిగా ఉంటారు. కానీ వీరు తమ మౌనంతోనే సమస్యలకు సమాధానం ఇచ్చేవారిలా ప్రవర్తిస్తుంటారు. అన్నివేళలా వీరికి సమస్యలకు పరిష్కారం లభించదు, పరిష్కారానికై కోపాన్ని మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. తద్వారా తప్పుగా అర్ధమవుతూ సంబంధాలు, సమస్యల్లో చిక్కుకుంటుంటాయి. వీరికి స్నేహితులు కూడా తక్కువగానే ఉంటారు.

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

వీరు ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుగుణంగా మార్చుకునే తత్వం కలిగినవారు. వీరు రహస్య ధోరణి కూడా కలవారిగా ఉంటారు. వీరు ప్రేమిస్తే , గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ మోసానికి గురయితే మాత్రం, వీరు చూపించే ఆగ్రహావేశాల ముందు ఏ రాశిచక్రం పనికిరాదు. కోపం పరాకాష్ఠ కు చేరుతుంటుంది. తమ కోపంతో మానసికంగా చిత్రవధ చేయగల సమర్ధులుగా ఉంటారు. ఒక్కోసారి చిన్న విషయాలను సైతం పెద్ద గొడవలకు దారితీసేలా ప్రవర్తిస్తుంటారు. అలాగని చెడు ఆలోచన కలిగిన వారు మాత్రం కాదు, వీరి కోపం స్థాయి వీరి మానసిక స్థాయిని దాటి వెళ్లడమే వీటన్నిటికీ కారణం. తద్వారా తప్పుగా అర్ధం అవుతూ చెడ్డ పేరును తెచ్చుకుంటుంటారు.

English summary

Zodiac Signs Which Are Famous For Their Badass Nature

Can you believe that the badass people that you know have their arrogant nature rooted to their zodiac sign? Well, there are certain zodiac signs, which reveal about the worst reputation individuals! These zodiacs can give you some real attitude issues. These signs are Aries, Gemini, Cancer and Scorpio.
Story first published: Saturday, April 7, 2018, 20:00 [IST]