ఈ రాశుల అమ్మాయిలను చేసుకుంటే జీవితం ప్రశాంతం

Written By:
Subscribe to Boldsky

ప్రతి అబ్బాయి తనకు వచ్చే భార్య చాలా అందంగా ఉండాలని.. తాను చెప్పినట్లు వినాలని అనుకుంటాడు. తనకు అనుగుణంగా నడుచుకునే భార్య రావాలని ప్రతి మగవాడు అనుకుంటాడు. కొన్ని రాశుల అమ్మాయిలు భర్తలకు చాలా అనుగుణంగా నడుచుకుంటారు. భర్త మాటే వేదం అన్నట్లు ఉంటారు.

అయితే మిగతా రాశుల అమ్మాయిలు అలాగా ఉండరని కాదు. ఇక్కడిచ్చిన రాశుల అమ్మాయిలు మాత్రం కచ్చితంగా భర్తను ఎప్పుడూ మోసం చేయరంట. భర్త చెప్పినట్లు వింటారట. మరి ఏయే రాశుల అమ్మాయిలు అలా ఉంటారు.. వారి గుణగణాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేష రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఈ రాశి అమ్మాయిలు చేసుకున్న భర్తకే జీవితాన్ని అర్పించాలని డిసైడ్ అవుతారు. భర్త క్షేమాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మేషరాశి అమ్మాయిలు చాలా గౌరవప్రదంగా ఉంటుంది. అత్తగారింటి సంప్రదాయాలను కట్టుబాట్లను గౌరవిస్తుంది.

భర్త శ్రేయస్సును కోరుకుంటుంది (మేషం)

భర్త శ్రేయస్సును కోరుకుంటుంది (మేషం)

మేషరాశి అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్లంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. అందువల్ల మేషరాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది. అలాగే మేషరాశి అమ్మాయి తను ఏదైనా సాధించాలనుకుంటే అందుకోసం ఎక్కువగా కష్పపడే స్వభావం ఉంటుంది. తాను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మనస్సులో అనుకుంటే కష్టపడి చదివి ఆ జాబ్ కొట్టగలదు. మేషరాశి అమ్మాయి భర్త శ్రేయస్సును ఎక్కువగా కోరుకుంటుంది. ఎక్కువగా వినయపూర్వకంగా ఉంటుంది.

కర్కాటక రాశి (జూన్ 21 -జూలై 22)

కర్కాటక రాశి (జూన్ 21 -జూలై 22)

కర్కాటక రాశి వారు భర్త పట్ల ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారు. అయితే వీళ్లు వారి మనస్సుల్లోని ప్రతి భావాన్ని భర్తతో పంచుకుంటారు. వారికి ఏ చిన్న కష్టమొచ్చినా.. సుఖం వచ్చినా వెంటనే భర్తతో చెప్పుకుంటారు.

నిజాయితీ ఉంటుంది (కర్కాటక రాశి)

నిజాయితీ ఉంటుంది (కర్కాటక రాశి)

కర్కాటక రాశి అమ్మాయి భర్త చెప్పినట్లుగా నడుచుకుంటారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు. భర్తతో చాలా నిజాయితీగా ఉంటారు. మీరు చేసుకోబోయే భార్య కర్కాటక రాశికి చెందిన వారు అయితే మీకు చాలా లక్కీ. మీరు జీవితాంతం చాలా ప్రశాంతంగా కాపురం చేసుకోవొచ్చు. కర్కాటక రాశి అమ్మాయి భర్త ఇంటికి చాలా అదృష్టాలను తీసుకొస్తుంది.

సింహరాశి (జూలై 23- ఆగస్టు 23)

సింహరాశి (జూలై 23- ఆగస్టు 23)

సింహరాశి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అలాగే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. సింహరాశి అమ్మాయి భర్తను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. అతను సంతోషంగా ఉండాలని కోరకుంటుంది.

భర్తకు అండగా ఉంటుంది (సింహరాశి)

భర్తకు అండగా ఉంటుంది (సింహరాశి)

సింహరాశి అమ్మాయి కష్ట సమయాల్లోనూ భర్తకు అండగా నిలుస్తుంది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా సరే భర్తను వదిలి వెళ్లదు. సింహరాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నటించరు. అలాగే వీరికి అంకితభావం ఎక్కువగా ఉంటుంది.

కన్యరాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యరాశి అమ్మాయిలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి అమ్మాయి మీ భార్యగా రావడం మీ అదృష్టం. కన్యరాశి అమ్మాయిలు భర్తపట్ల చాలా కృతజ్ఞతతో ఉంటారు. అందువల్ల కన్యరాశి అమ్మాయిని చేసుకునే విషయంలో ఎలాంటి డౌట్ వద్దు.

తులరాశి (సెప్టెంబరు 24-అక్టోబర్ 23)

తులరాశి (సెప్టెంబరు 24-అక్టోబర్ 23)

తులరాశి అమ్మాయిలు భర్తతో మంచి బాంధవ్యం కొనసాగిస్తారు. భర్తను ఎక్కువగా గౌరవిస్తారు. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వీరికి భర్తతో చాలా రొమాంటిక్ గా ఉంటారు. అతనికి ఆ విషయంలో బాగా సహకరిస్తారు. తులరాశి అమ్మాయిలు భర్త ఇబ్బందుల్లో అతని కష్టాన్ని అర్థం చేసుకుని అండగా నిలుస్తారు. ఆమెకు చేతనైనంతా సాయం కూడా చేస్తుంది.

English summary

zodiac updates perfect zodiac sign women marry

zodiac updates perfect zodiac sign women marry
Story first published: Monday, February 5, 2018, 9:30 [IST]
Subscribe Newsletter