For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశిచక్రాలకు సంబంధించిన వ్యక్తులు చెడు పరిణామాలను ముందే పసిగట్టగలరు.

|

గత వారం మీ స్నేహితుడు అంచనా వేసిన విషయo, వాస్తవానికి ఈ వారంలో జరిగినట్లు గమనించారా ఎప్పుడైనా ? లేదా మీ పక్కన కూర్చొని ఉన్న వ్యక్తి, కేవలం కొన్ని నిమిషాలలోనే ఏం జరగబోతుందో చెప్పడం గమనించారా ? లేదా నీ సోదరి ఎప్పుడూ జరగబోయే అంశాలను ముందే పసిగట్టడం గమనించారా ?

ప్రజలు నిజంగా అంతటి శక్తిని కలిగి ఉన్నారా ?

కొంతమంది వ్యక్తుల ఊహాగానాలు ఖచ్చితమైనవిగా ఉంటాయి మరియు గంటాపధంగా చెప్పగలరు జరగబోయే అంశాల గురించి. నిజానికి వారు ఒక అంతర్దృష్టిని కలిగి ఉన్నారని ప్రజల దృక్పధం. వాస్తవానికి, 'అంతర్దృష్టి' అనే పదం, కొంతమందికి తెలీకుండా వారి ఆలోచనల్లో ఉండే అతీతశక్తి అని చెప్పవచ్చు. భవిష్యత్ గురించిన కనీస ఆలోచనలు కూడా ఉండవు మళ్ళీ. వాస్తవానికి భవిష్యత్తు యొక్క సంగ్రహావలోకనం ఎంత స్పష్టంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగల శక్తి వీరికి ఉంటుంది.

ఇది రాశి చక్రాలు మరియు నక్షత్రాల ప్రభావమే అని జ్యోతిష్య పండితుల నమ్మకం:

ఇది రాశి చక్రాలు మరియు నక్షత్రాల ప్రభావమే అని జ్యోతిష్య పండితుల నమ్మకం:

నిజానికి జ్యోతిష్యం అనునది నక్షత్రాలు మరియు రాశిచక్రాల ఆటగా పరిగణిస్తారు. మనం జన్మించిన రాశి చక్రాలు, నక్షత్రాలు మన జీవితాల్లో భారీ ప్రభావాలను చూపుతాయని చెప్పబడింది. మనం జన్మించిన క్షణం నుండి, మొత్తం జీవితమంతా, మన జీవితాల్లో జరిగే సంఘటనలు మన నక్షత్రాలు మరియు గ్రహాల చేత ఆడించబడుతుంటాయని మరియు దర్శకత్వం వహిస్తాయని కూడా చెప్పబడింది. అందువల్ల అదే రాశిచక్రంలో ఉన్న ప్రజలు, ఇంచుమించు ఒకే అలవాట్లను పద్దతులను కూడా కలిగి ఉంటారు.

అనుసంధానించబడిన గ్రహాలు కొన్ని సూచనలు ఇస్తుంటాయి :

అనుసంధానించబడిన గ్రహాలు కొన్ని సూచనలు ఇస్తుంటాయి :

ఇక్కడ కొన్ని రాశిచక్ర సంకేతాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన వ్యక్తుల ఆలోచనలు ఎక్కువ సత్యాలుగా ఉంటాయి. వాటి రాశిచక్రంతో సంబంధం ఉన్న గ్రహాలు శక్తిని కలిగి ఉంటాయి, ఇవి కాస్మోస్ యొక్క సమీప సంఘటనలను ఊహించగలవు. ఈ వ్యక్తులు కొన్నిసార్లు కొన్ని విషయాలను అత్యంత లోతుగా ఆలోచించగలరు. భవిష్యత్తులో జరిగే సంఘటనల పట్ల ఒక అవగాహన, మరియు ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇవ్వడంలో ముందుంటారు.

ఈ అంశాల ఆధారంగా, అంతర్దృష్టి కలిగిన రాశిచక్ర గుర్తుల జాబితాను ఇవ్వడం జరిగింది.

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

భావోద్వేగ రాశిచక్రాల జాబితాలో కర్కాటక రాశి వారు మొదటిగా ఉంటారు. వారు ఇతరుల భావోద్వేగాలపై అత్యంత సానుభూతిని ప్రదర్శించేవారిగా గుర్తింపును కలిగి ఉంటారు కూడా. ఇతర ప్రజల అవసరాలను అర్ధం చేసుకోగల ఆలోచనా శక్తి వీరి సొంతంగా ఉంటుంది. మీరు కర్కాటక రాశికి చెందిన వారయితే, మీరు ఒక వ్యక్తి యొక్క దురావస్థను చూసినప్పుడు, మీ హృదయo భావోద్వేగాల సముద్రం వలె మారుతుందని గ్రహించబడాలి. కర్కాటక రాశికి చెందిన గ్రహం చంద్రుడు, మరియు చంద్రుడు నీటితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల, ఒక స్నేహితుడు మీతో పోట్లాడుతున్నా, లేదా ఎవరైనా వారి వారి పనుల్లో లేదా ప్రాజెక్ట్లో విఫలమైన వార్తలతో వచ్చినప్పుడు, ఈ విధంగా జరిగే అవకాశాలున్నాయని ముందే గ్రహించిన వారిగా మిమ్ములను మీరు తెలుసుకుంటారు.

కావున వీరితో సన్నిహితంగా మెలగడం మూలంగా, తమ తమ భావాలను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోదగిన అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు సాదు స్వభావాన్ని కలిగి ఉంటారు. మరియు వీరిని ఎంతగా ప్రేమిస్తారో, వీరు కూడా అంతే ప్రేమను తిరిగి ఇస్తుంటారు. ఈ వ్యక్తులతో సాన్నిహిత్యం, మీకు కష్టాలను కొంతమేర దూరం చేయగలదు కూడా.

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వారు అయితే, మీ వృశ్చిక రాశి స్నేహితుడు పెద్దగా మాట్లాడడం లేదని గమనించగలరు. కానీ వారు మాట్లాడుతున్నప్పుడు, వారి చమత్కారమైన మాటలతో పరిసరాలను ఆహ్లాదంగా మలచగలరు. సాధారణంగా, వృశ్చిక రాశి వ్యక్తులు ఏదో చెడు గురించి జరుగుతుందన్న విషయాన్ని ముందుగానే గ్రహించగలిగిన వ్యక్తులుగా ఉంటారు. క్రమంగా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మీరేదైనా సమస్య గురించి చెప్పినప్పుడు, ఈ సమస్యను ముందుగానే గ్రహించినట్లు, గ్రహించడానికి గల కారణాలను కూడా చెప్పేలా ఉంటారు. వీరి గ్రహం అంగారకుడు, మరియు నీటితో సంబంధం ఉండటం మూలంగా వీరి అంతర్దృష్టి కారణంగా చెప్పబడుతుంది. వీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు, క్రమంగా వీరి మాటలు కాస్త కఠినంగా అనిపించినా కూడా, మాటలలో నిజాన్ని నిజాయితీని చూడవచ్చు. క్రమంగా వీరి సూచనలను పాటించడం మంచిదిగా సూచించబడింది.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీనరాశి నెప్ట్యూన్ గ్రహం చేత పాలించబడుతుంది. అందువల్ల వారు ఏ విషయం గురించైనా అవగాహన కలిగి ఉండేలా ఉంటారు. మరియు వీరు, నీటి మూలకంతో సంబంధం కలిగి ఉన్న కారణాన, వీరి చుట్టూ ఉన్న ఇతరుల భావాలను గురించిన పూర్తి అవగాహన కలిగి ఉన్నవారిగా ఉంటారు. తమ స్వంత ప్రపంచంలోనే నివసించినట్లు అందరికీ కనిపిస్తుంటారు, కానీ అన్ని విషయాల మీద సామాజిక అవగాహన కలిగి ఉన్న వారిలా ప్రవర్తిస్తుంటారు. మరియు పరిసరాలలోని ఆకస్మిక మార్పులను గ్రహించగల శక్తి కలిగి ఉంటారు. వర్షం, లేదా ఇతర వాతావరణ వివరాలను ఇట్టే అంచనా వేయగలరు. ఇతరుల వ్యాపార పరిస్థితులు ఆరోజు ఏవిదంగా ఉండనున్నాయో కూడా చెప్పగలిగేలా ఉంటారు. మీనరాశి వారు ఎంత నెమ్మదస్తులో అంత ముందు చూపు కలిగిన వారిగా చెప్పబడ్డారు. కావున, ఎటువంటి అంశాలలో అయినా, వీరి మాటలను పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడినది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Zodiacs Signs Which Are More Intuitive

If you think that most of your predictions about the near future come out to be true, or if you discover that the event which just happened was already expected by you, then your zodiac sign is associated with the water element. Generally, the people associated with the zodiac having water element can sense the future better.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more