ఈ మూడు రాశిచక్రాలు ప్రత్యేకమైనవి ఎందుచేతనంటే .. !

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతరుల వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుందని మనకు తెలుసు. అదేవిధంగా మనాగురించి కూడా ఇతరులకు ఒక అవగాహన వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు: ఒక్కోసారి మీ ఆలోచన విధానం చూసి ఓ మీరు తులా రాశా, కన్యా రాశా అని అడిగే వారిని కూడా మనం చూస్తూ ఉంటాము. అలా అంచనా వేయగలిగేలా జ్యోతిష్య శాస్త్రం మనకు తోడ్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రాశిచక్రాల కు సంబంధించిన వ్యక్తులు కొన్ని ప్రత్యేకసందర్భాలలో తెలీయకుండానే విధేయతను ప్రదర్శిస్తుంటారు. నిజానికి అంత నిబద్దత వారిలో నిజజీవితంలో ఉండదు. ఒక్కోసారి వీరు మాట్లాడే విషయం లో వెక్కిరింపు ధోరణి ప్రదర్శించడం, దాడి చేయునట్లు వ్యవహరించడం చేస్తుంటారు.

ఆ రాశిచక్రాల గురించిన వివరాలు ఇక్కడ మీకోసం.

Zodiacs Which Are The Meanest

వృశ్చికం అక్టోబర్ 24- నవంబర్ 22

వీరు ఎక్కువగా ఆత్మ రక్షణ ధోరణిని కనపరుస్తూ ఉంటారు. తమను తాము కాపాడుకోవడానికి విధేయతను సైతం నటిస్తారు. వీరు ప్రపంచమంతా అలాగే ఎవరికి వారు ఆత్మరక్షణ ధోరణి కలవారన్నట్లుగా భావిస్తుంటారు. వాగ్వాదాలకు దిగడం, చిన్న విషయాలను పెద్దవిగా చేయడం, గొడవలు పడడం జరుగుతూ ఉంటాయి. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలను కూడా పెద్దవిగా చేసుకుని అవి తీవ్రమవుతున్న పక్షంలో తప్పించుకునే ధోరణిని కూడా కనపరుస్తూ ఉంటారు. వీరు వ్యక్తిగతంగా చాలా మంచి స్వభావాలను కలిగి ఉంటారు. కానీ గొడవలలో మాత్రం లక్షణాలు ఆత్మ రక్షణ ధోరణిని కనిపించేలా చేస్తుంటాయి. ఒక్కోసారి ఈ గొడవలు శాశ్వతంగా సంబంధాలకు చెక్ పెట్టేలా పరిణమిస్తుంటాయి.

Zodiacs Which Are The Meanest

ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

వీరు ఎక్కువగా ఆలోచించకుండానే మాట్లాడే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా మాటలు తడడబడo, జనుల దృష్టిలో చిన్న చూపుకి గురవడం ఒక్కోసారి సంబంధాలు సైతం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేయడం జరుగుతాయి. వీరు ఏదైనా విషయం మాట్లాడుటకు వేగవంతమైన మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇతరుల ఆలోచనలకు ప్రాధాన్యతను పెద్దగా ఇవ్వరు, తద్వారా అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా వీరు ఏదైనా సంబంధంలో ఉన్నప్పుడు , భాగస్వామిని అర్ధం చేసుకొనుటలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, తద్వారా ఆలోచన లేకుండా మాట్లాడే విధానం భాగస్వాముల మద్య దూరానికి కూడా కారణమవుతుంటుంది.

Zodiacs Which Are The Meanest

మకరo డిసెంబర్ 23- జనవరి 20

వీరు ఎదుటివారి ఆలోచనలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు, ఎక్కువగా వారు మాట్లాడుతున్నప్పుడే మాటలకు అడ్డo పడడం వీరికి అలవాటుగా ఉంటుంది. ఏదైనా ఒక సంబంధంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా సంబంధాలు నాశనం అవుతూ ఉంటాయి కూడా. క్రమంగా అర్ధం చేసుకునే గుణాలను మరియు భావ వ్యక్తీకరణలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా తమ భావాలకు కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంటారు. ఈ రాశిచక్రం వాళ్ళకి మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొనడం పరిపాటిగా ఉంటుంది.

English summary

Zodiacs Which Are The Meanest

According to astrology, the different traits of our personality help us to learn more about ourselves, as well as how others may perceive us. It is said that there are a few zodiac signs that are known to come across as being mean unintentionally, though it is not requited that they are mean people. These zodiac signs are Scorpio, Sagittarius and Capricorn.
Story first published: Tuesday, April 3, 2018, 18:00 [IST]