Latest Updates
-
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..
అతను వ్యాసెక్టిమి చేయించుకున్నాడు, అయినా అతని భార్య గర్భందాల్చినంది!!
గర్భందాల్చడం అనేది ఒక అపురూపమైన సంఘటన, కానీ గర్భధారణ వద్దు అనుకునే సమయంలో గర్భందాల్చితే అది ఖచ్చితంగా షాక్ కు గురిచేస్తుంది. మరియు మనసంతా కకావికలమవుతుంది.
గర్భధారణను నివారించడానికి, మొదటి ఎంపికగా కండోమ్ వినియోగం ఉంటుంది. కొందరు ధైర్యంగా మరో అడుగు ముందుకు వేసి, అవాంఛనీయ గర్భధారణలను పరిహరించడం కోసంగా వాసెక్టమీ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్) వంటి ఇతర విధానాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది. .

కానీ ఈ ఆపరేషన్ విఫలమై గర్భం దాలిస్తే, ఆ పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొన్న వారికే ఆ కష్టం తెలుస్తుంది.
ఇక్కడ అదేవిధంగా ఈ జంట జీవితంలో జరిగిన సంఘటన చర్చనీయాంశం అయింది. భర్త కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోగా, భార్య గర్భం దాల్చింది.
మొత్తం సంఘటనకు సంబంధించిన వివరాలను క్రింద పొందుపరచబడ్డాయి..

ఇకపై గర్భధారణ వద్దని ఆ జంట నిర్ణయించుకుంది...
అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా కుటుంబపోషణ కష్టమవుతుందని భావించిన, తైవాన్ రాజధాని అయిన తైపీకి చెందిన ఈ దంపతులు, మరోసారి గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు సిద్దపడ్డారు :
క్రమంగా, భర్త కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని, తద్వారా వారు తమ లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలరని ఆ జంట భావించింది. క్రమంగా ప్రతిసారీ కండోం వాడవలసిన అవసరం ఉండదు కాబట్టి, మహిళలైతే ట్యూబెక్టమీ, పురుషులైతే వాసెక్టమీ ఆపరేషన్ కు సిద్ధపడడం జరుగుతుంటుంది. నిర్ణయం తీసుకున్న కొద్దికాలంలోనే, భర్త వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది.

కానీ వీరి ఆలోచనలు తారుమారయ్యాయి…
ఈ వ్యక్తి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న, 2 సంవత్సరాల లోపునే ఆమె మరలా గర్భం దాల్చడం వీరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. క్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైన కారణంగా, గర్భం దాల్చడం జరిగిందని అర్ధం చేసుకున్నారు.

వైద్యులు ఏమన్నారంటే …
వాసెక్టమీ విఫలం అయిందని గైనకాలజిస్ట్ నిర్ధారించుకున్న తర్వాత, భర్తకు శస్త్రచికిత్స చేసిన యూరాలజిస్ట్ తో పరీక్షలు చేయించమని వారికి సూచించింది. ఆ రిపోర్టులను తనిఖీ చేసిన తర్వాత్త, భర్త అనూహ్యంగా బలమైన వీర్య కణాలను కలిగి ఉన్నాడని, దాని ఫలితంగా గర్భవతి అయిందని తేలింది. అవాక్కవడం వీళ్ళ వంతైంది.
వాస్తవానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అరుదుగా విఫలమవుతుంటాయి. కావున ఒకటికి రెండు సార్లు వైద్యులు కూడా "చెకప్ రావాలని సూచిస్తుంటారు. క్రమంగా వీర్యకణాల ప్రవాహం గురించిన అంచనా ఉంటుంది. అలా చెకప్ తీసుకోని పక్షంలో, శస్త్రచికిత్స సఫలమా, విఫలమా అన్న మీమాంస అలాగే ఉండిపోతుంది. కావున ఈ వ్యాసం ద్వారా మేం చెప్పదలచుకున్నది ఏమిటంటే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడమే కాదు, ఒకటికి రెండుసార్లు వైద్యుల చేత వీర్యకణాల ప్రవాహం గురించిన నిర్ధారణను తీసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి



Click it and Unblock the Notifications