For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన రోబోట్ ను పెళ్లి చేసుకోవాలని ఇష్టం మరియు పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు!

|

'ఆబ్జెక్టమ్ లేదా ఆబ్జెక్ట్ సెక్సువాలిటీ' అనతి కాలంలోనే రూపాంతరం చెందుతూ, ప్రజాదరణ పొందుతూ ఉంది. ఆబ్జెక్ట్ సెక్సువాలిటీ లేదా ఆబ్జెక్టోఫీలియా అనేది వ్యక్తులు వస్తువుల పట్ల ఆకర్షణకు లోనయ్యే పరిస్థితిని సూచిస్తుంది. అది తీవ్రరూపం దాలిస్తే, ఆ ఆకర్షణ ప్రేమగా రూపాంతరం చెందుతుంది. మరియు నిర్జీవ నిర్మాణాల పట్ల బలమైన భావనలు కలిగి ఉండే పరిస్థితిని సూచిస్తుంది.

ఇక్కడ ఒక యువకుడు తన రోబోతో ప్రేమలో ఉన్నానని అంటూనే, దానిని త్వరలోనే వివాహం చేసుకోవాలనికూడా భావిస్తున్నట్లు చెప్తున్నాడు.

ఈ విచిత్ర సంఘటన గురించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

తన రోబోట్ ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్న వ్యక్తి

అతను గత రెండు సంవత్సరాల నుండి ' రోబోట్రోల్ ' అనే పేరుగల తన రోబోతో ' సంబంధం ' లో ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నాడు. పైగా అతను ఆబ్జెక్టమ్ అనే మానసిక బలహీనతలో ఉన్నాడని కూడా గ్రహించడం కొసమెరుపు.
ఇతని గురించి ...

ఇతని గురించి ...

అమెరికాలోని మారీలాండ్ ప్రాంతానికి చెందిన జోయ్ మారిస్ అనే ఈ 29 ఏళ్ల వ్యక్తి, తాను 10 సంవత్సరాల వయస్సు నుండే, వస్తువులపట్ల ఆకర్షితుడవుతున్నాడని అర్థం చేసుకున్నాడు.

అతని మొదటి ఆకర్షణ ఇలా ...

అతని మొదటి ఆకర్షణ ఇలా ...

జోయ్ మారిస్ తన మొదటి ఆకర్షణగా "లాంప్(దీపం)" ను చెప్తుంటాడు. దాని తరువాత అతను ఒక ట్రాన్స్ ఫార్మర్ ట్రక్ మరియు ఒక హాలోవీన్ శిల్పం పట్ల కూడా ఆకర్షితుడైనట్లు చెప్తుంటాడు.

తన రోబోతో బంధం బలపడినట్లుగా భావిస్తుంటాడు...

తన రోబోతో బంధం బలపడినట్లుగా భావిస్తుంటాడు...

డిసెంబర్ 2017 లో ఒక ఆన్లైన్ సైట్లో ఉంచిన "బాటిల్ ట్రోల్జ్" కలెక్షన్లోని "రోబో ట్రోల్" ఆర్డర్ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు జోయ్ వెల్లడించాడు. తాను అప్పటి నుండే ఆ "రోబో ట్రోల్" తో ప్రేమలో ఉన్నట్లు, కొంతకాలం తర్వాత దానినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపాడు.

 ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అనగా ...

ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అనగా ...

"ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ" అనే పదాన్ని 30 ఏళ్ల క్రితం బెర్లిన్ గోడను పెళ్లాడిన ఓ మహిళ ప్రవేశపెట్టింది. ఆమె ఆ కాంక్రీట్ నిర్మాణాన్ని ముచ్చటపడి 1979 లో వివాహం కూడా చేసుకున్నారు.

ఇంతకీ ఈ వింత ఆకర్షణ ఏంటి అనుకుంటున్నారా? వాస్తవానికి ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్యను సూచిస్తుంది, సరైన సమయంలో గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే ఇటువంటి వింత చర్యలకు ఆస్కారం ఉండేది కాదు. పరిస్థితి శ్రుతి మించితే, ఇటువంటి విడ్డూరాలు రోజురోజుకీ ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటాయి. ఈ వ్యాసంపై మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: news funny stories
English summary

Man Claims To Be In Love With His Robot And Plans On Marrying It

A man named Joey Morris has revealed that he is in love with a robot. He also added that he is planning to marry it. He claims he's been in a 'relationship' with his robot named 'RoboTroll' since the past two years. The 'popping' pink hair and 'satisfied smile' are what attracted him to the robot.Man Wishes To Marry His Robot
Desktop Bottom Promotion