For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందే తల్లి అయిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా..

|

మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు తానే స్వయంగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా షేర్ చేసుకుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఆ అందాల భామ ఎవరో కాదు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన అమీ జాక్సన్. ఇంకా ఆమె ఎవరో గుర్తుకు రాలేదా.

Actress Amy jackson shares video of newborn son Andreas

అదేనండి సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో 2.0లో నటించిన హీరోయిన్. కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చింది కదా.

View this post on Instagram

Our Angel, welcome to the world Andreas 💙

A post shared by Amy Jackson (@iamamyjackson) on Sep 23, 2019 at 3:36am PDT

ఈమెతో పాటు ఇంకా చాలా మందే పెళ్లికి ముందే తల్లిగా మారారు. ఇలా పెళ్లి కాకుండా తల్లిగా మారి తన కోరికను తీర్చుకుని శ్రీదేవి సరసన నిలిచింది. స్వర్గీయ అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చి తల్లి అయిన విషయం చాలా మందికి తెలిసిందే.

1) తన చిన్నితండ్రితో..

తనకు పుట్టిన చిన్నితండ్రి కలిసి ఉన్న అందమైన ఫొటోను షేర్ చేసింది. ఆ చిత్రంలో తనకు కాబోయే భర్త జార్జ్ పనయిటోవాతో కూడా ఉన్నాడు. అంతేకాదు. ‘మా ఏంజెల్.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆండ్రియాన్‘ అంటూ పోస్టులో మ్యాటర్ ను సైతం యాడ్ చేసింది.

2) ముద్దు పెట్టుకుంటూ..

కొత్తగా అమ్మా, నాన్నలుగా మారిన ఈ కాబోయే దంపతులు అమీ జాక్స్, పనయిటో ఈ సందర్భంగా ఆనందంతో తమ బిడ్డను ముద్దు పెట్టుకుంటూ కనిపించారు.

3) అప్పుడే ప్రేమలో..

రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన అమీ జాక్సన్ ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనయిటోతో ప్రేమలో పడిపోయింది.

4) మే నెలలో ఉంగరాలు మార్పుకున్నారు..

రజనీకాంత్ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన అమీ జాక్సన్ ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనయిటోతో ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని కూడా స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆ తర్వాత సినిమాలో దాదాపుగా కనిపించడం మానేసింది. అలాగే తన ప్రియుడితో ఎంచక్కా ప్రేమాయణంలో మునిగి తేలింది.

5) ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో..

ఆ తర్వాత అమీ జాక్స్ వారిద్దరికీ సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తను పెళ్లికి ముందే పిల్లల తల్లి కావాలనుకుంటున్నట్లు బాంబు పేల్చేశారు. అయినా తన అభిమానుల నుండి తనకు ఊహించనంత మద్దతు లభించింది. ఇప్పటికీ ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 8 మిలియన్ల మందికి ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమె రేంజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

6) 2020లో పెళ్లి..

ఆ తర్వాత మెటర్నిటీ ఫొటోషూట్ లలో మెరిసిన ఈ అందాల జంట వచ్చే ఏడాది అంటే 2020లో తాము పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమీ అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనే విషెస్ చెబుతున్నారు.

7) తమిళం సినిమాతో తెరంగేట్రం..

తమిళంలో ‘మదరాసు పట్టణం‘తో తెరకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ లో, టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించింది. హిందీలో ‘ఏక్ దివానా థా‘ ‘సింగ్ ఈజ్ బ్లింగ్‘ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీఫుల్ లండన్ లేడీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.

8) తెలుగులోనూ కొన్ని సినిమాలు..

తెలుగులో రజనీకాంత్ సరసన రోబో 2.ఓ‘, మెగాస్టార్ కుమారుడు రామచరణ్ సరసన ‘ఎవడు‘, సినిమాతో పాటు డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా సరసన ‘అభినేత్రి‘ సినిమాలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో కథానాయికగా మెప్పించిన ఈ హీరోయిన్ తెలుగులో కేవలం కొన్ని సినిమాలే చేసింది. అయినప్పటికీ బాగానే పాపులర్ అయ్యింది. ఎందుకంటే తను హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది గనుక.

Read more about: pregnant
English summary

Watch: Actress Amy jackson shares video of newborn son Andreas

Amy Jackson has shared another precious look at her newborn son Andreas. The actor took to her Instagram stories to share a Boomerang video of the baby boy as he fussed in his new bed.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more