For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా సిన్హా ఇకలేరు..

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అనంతరం విద్య సినిమాల వైపు అడుగులు వేశారు. 'రాజాకాకా' అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ప్రముఖ డైరెక్టర్ బసు ఛటర్జీ 1974లో తీసిన 'రజనీగంధ', 1975లో 'చోటీ సీ బాత్' అనే

|

బాలీవుడ్ సీనియర్ కథానాయిక విద్యా సిన్హా(71) ముంబైలో కన్నుమూశారు. కొన్నిరోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై మహా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటూ గురువారం రోజున తుదిశ్వాస విడిచారు. విద్య 18 ఏళ్ల వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. అప్పట్లో తన సొగసుతో మిస్ బాంబే కిరీటాన్ని కైవశం చేసుకున్నారు. బాలీవుడ్ లో కొత్తతరం కథానాయికగా మంచి పేరు సంపాదించారు. అంతేకాదు పక్కింటి అమ్మాయిగా బాగా గుర్తింపు పొందారు. ఈమె ప్రముఖ నిర్మాత రాణా ప్రతాప్ సింగ్ కు 1947 నవంబర్ 15న జన్మించారు.

ఆమె ఆఖరి సినిమా 'బాడీగార్డ్'..

ఆమె ఆఖరి సినిమా 'బాడీగార్డ్'..

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అనంతరం విద్య సినిమాల వైపు అడుగులు వేశారు. 'రాజాకాకా' అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ప్రముఖ డైరెక్టర్ బసు ఛటర్జీ 1974లో తీసిన 'రజనీగంధ', 1975లో 'చోటీ సీ బాత్' అనే సినిమాలతో ఆమె బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యారు. అదే ఏడాది అంటే 1975లోనే 'పతి పత్ని ఔర్ ఓ', 'ముక్తి' తో పాటు తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ఇక ఆమె చివరిగా బాలీవుడ్ కండల వీరుడు, బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ 2011లో నటించిన 'బాడీగార్డ్' అనే చిత్రంలో నటించారు. ఇలా ఆమె 30కి పైగా మూవీస్ లో నటించి.. ప్రతి సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఆమె 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.

బుల్లితెరపైనా తనదైన ముద్ర..

బుల్లితెరపైనా తనదైన ముద్ర..

Instagram

బాలీవుడ్ నటి విద్య వెండితెరపై ఒక వెలుగు వెలిగిన అనంతరం బుల్లితెర వైపు పయనించారు. అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. 'కావ్యాంజలి', 'ఖుబూల్ హై', 'కుల్ఫి కుమార్ బజేవాలా' లాంటి పదికి పైగా ధారావాహికల్లో నటించి తన సత్తా చాటారు.

విద్యా వివాహ జీవితం..

విద్యా వివాహ జీవితం..

Instagram

విద్యా సిన్హా 1968లో వెంకటేశ్వరన్ అయ్యర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతూరు (జాన్వీ) పుట్టింది. వెంకటేశ్వరన్ చనిపోయిన తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కొంత కాలం తర్వాత నేతాజీ అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు.

చీర కట్టుతో ఆకట్టుకున్న విద్య..

చీర కట్టుతో ఆకట్టుకున్న విద్య..

విద్యా సిన్హా తను నటించిన సినిమాల్లో ఎక్కువగా భారతీయ వస్త్రాలనే ధరించింది. తన చీర కట్టుతో రోజువారీ మహిళలా మారిపోయింది. అందుకే బాలీవుడ్ లో ఆమెకు "పక్కింటి అమ్మాయి" గా పేరొచ్చింది. ఆమె స్మార్ట్ వాచ్ ను, సున్నితమైన బంగారు ఆభరణాల ధరించి తెరపై చాలా అందంగా కనిపించేవారు.

English summary

Bollywood actress Vidya Sinha is no more

Vidya Sinha has donned mostly Indian costumes for her films. His saree buckle turned like a daily woman. That is why she is known as "next door girl" in Bollywood. She was wearing a smartwatch, exquisite gold jewelery and looking very beautiful on screen.The Bollywood actress turned to television after she shed her light on education silverware. There he made his own impression. He has appeared in over ten series like 'Kavanjali', 'Khubool Hai' and 'Kulfi Kumar Bajewala'
Desktop Bottom Promotion