For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bramhanandam Birthday Special : కాలేజీ లెక్చరర్ నుండి కామెడీ కింగ్ గా బ్రహ్మీ ప్రస్థానమిలా...

బ్రహ్మానందం సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్ లో చదువుకున్నారు. అప్పట్లోనే ఆయన మిమిక్రీతో పాటు అనేక కల్చరల్ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొనేవారు.

|

కిల్ బిల్ పాండేగా.. కత్తి రాందాసుగా.. అరగుండుగా.. ఖాన్ దాదాగా, శంకర్ దాదా ఆర్ ఎంపి ఇలా వైవిధ్యభరితమైన పాత్రల పేర్లతో హీరోల కంటే ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మానందం. కామెడీ విషయంలో బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్ బ్రహ్మానందం అంటే బ్రాండ్ గా మారిపోయారు.

Brahmanandam Birthday

మామూలుగా మనం ఓ నలుగురిని నవ్వించడానికి నానా తంటాలు పడతాం. అయితే బ్రహ్మానందం మాత్రం తన నటనతో కొన్ని కోట్ల మందిని నవ్విస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కాని విధంగా ఆయన దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి, అన్నింట్లోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనందుడు. రెండు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఒక ఊపు ఊపిన కామెడీ కింగ్.

Brahmanandam Birthday

ఆయన వెండి తెరపై కనిపిస్తే చాలు అందరి ముఖాల్లో ఆటోమేటిక్ గా నవ్వు కనిపిస్తుంది. అంతలా ఆయన ప్రభావముండేది. అంతేకాదు ఆయన కామెడీతోనే ఎన్నో సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఎన్టీఆర్, ఎఎన్ఆర్, క్రిష్ణతో పాటు వారి కొడుకులు, మనవళ్లతో కలిసి మొత్తం మూడు తరాల వారితో కలిసి నటించిన ఏకైక కామెడియన్ బ్రహ్మానందం. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి...

బ్రహ్మానందం జననం..

బ్రహ్మానందం జననం..

ప్రతి సినిమాలోనూ నవ్వుల పువ్వులు పూయించే బ్రహ్మానందం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. ఆయన 1956, ఫిబ్రవరి 1వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కన్నెగంటి నాగలింగాచారి, కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ.

బ్రహ్మీ విద్యాభ్యాసం..

బ్రహ్మీ విద్యాభ్యాసం..

బ్రహ్మానందం సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్ లో చదువుకున్నారు. అప్పట్లోనే ఆయన మిమిక్రీతో పాటు అనేక కల్చరల్ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొనేవారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేశారు. తర్వాత తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు.

అత్తిలిలో లెక్చరర్ గా..

అత్తిలిలో లెక్చరర్ గా..

ఆయన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అధ్యాపకుడిగా ఓ కళాశాలలో చేరారు. అత్తిలిలో సుమారు తొమ్మిదేళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాతే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తన నిజ జీవితంలో అనేక మంది వ్యక్తుల గురించి వాయిస్ మిమిక్రీ చేస్తూ అందరి ప్రశంసలు అందుకునే వారు.

కామెడీ రారాజుగా..

కామెడీ రారాజుగా..

బ్రహ్మానందం నటించిన అహ నా పెళ్లంట సినిమా తర్వాత కామెడీ కింగ్ గా మారిపోయారు. ఆ సినిమా తర్వాత చాలా మంది దర్శకులు ఆయన కోసమే ప్రత్యేక పాత్రలు రాసుకునే వారట. పాత్ర ఏదైనా.. ఘట్టం ఏదైనా బ్రహ్మానందం అందులో పరకాయ ప్రవేశం చేసేవారట.

అప్పుడే బ్రహ్మీ దశ తిరిగింది..

అప్పుడే బ్రహ్మీ దశ తిరిగింది..

1985 సంవత్సరంలో దూరదర్శన్ లో బ్రహ్మానందం సమర్థవంతంగా నిర్వహించిన పకపకల కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లిన అందరూ ఆయనను గుర్తు పట్టేవారు. అప్పటి నుండి ఆయన సెలబ్రిటీ అయిపోయారు.

తన పుట్టినరోజునే తొలి వేషం..

తన పుట్టినరోజునే తొలి వేషం..

బ్రహ్మానందం సినిమా రంగంలో తొలి వేషం వేసిన రోజు కూడా ఫిబ్రవరి 1వ తేదీనే. అప్పట్లో నరేష్ హీరోగా నటించిన తాతావతారం అనే సినిమాలో డైరెక్టర్ సత్యనారాయణ బ్రహ్మానందానికి తొలి అవకాశం ఇచ్చారట.

తొలి చిత్రం అహ నా పెళ్లంట..

తొలి చిత్రం అహ నా పెళ్లంట..

ఆయన నరేష్ తో కలిసి తొలి వేషం వేసినా.. ఆయన నటించిన సినిమాలలో తొలిసారిగా విడుదల అయ్యింది మాత్రం జంధ్యాల తీసిన ‘అహ నా పెళ్లంట‘. ఈ సినిమా ద్వారానే వెండి తెరలో అడుగుపెట్టాడు మన బ్రహ్మానందం. ఆ తర్వాత ఏనాడు వెనుదిరిగి చూసుకోలేదు.

పద్మశ్రీ, నంది అవార్డులు..

పద్మశ్రీ, నంది అవార్డులు..

తెలుగు కళామా తల్లి పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వులా ఉండిపోయిన బ్రహ్మానందానికి భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. అంతేకాదు ఆయన ఏకంగా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు, సైమా, ‘మా‘ అవార్డులను సైతం అందుకున్నాడు.

డాక్టర్ గా బ్రహ్మానందం..

డాక్టర్ గా బ్రహ్మానందం..

ఈయన సినిమా రంగంలో చేసిన సేవలను గుర్తించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి 2005 గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఇలాంటి పురుషులు

తెలుగు ఖ్యాతిని పెంచిన బ్రహ్మీ..

తెలుగు ఖ్యాతిని పెంచిన బ్రహ్మీ..

తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన వారిలో ఈ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎప్పుడూ ముందే ఉంటాడు. 64వ పడిలోకి అడుగు పెట్టిన హాస్యనందుడికి బోల్డ్ స్కై తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన ఈరోజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరిన్ని సినిమాల్లో నటించి మనందరినీ మరింతగా నవ్వించాలని మనసారా కోరుకుందాం.

English summary

Brahmanandam Birthday Special : Unknown Facts About Brahmanandam

Padma Shri Dr.Brahmanandam who has been spreading smiles since 28 years on-screen is celebrating his 64th birthday today. The Star comedian seems to be getting better and better with the age. It’s not a surprise that no big budget tollywood movie is without this comedian Brahmanandam.
Desktop Bottom Promotion