Latest Updates
-
వారానికి ఒక్కరోజు మీ భోజనంలో ఈ ఒక్కటి ఉంటే చాలు.. గుండెకి, మెదడుకి నో టెన్షన్.! -
కళ్లద్దాల వల్ల ముక్కుపై మచ్చలు పడ్డాయా? ఇంట్లోనే ఇలా చేస్తే కళ్లద్దాల మచ్చలు ఇక కనిపించవు! -
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా!
ఆంధ్రప్రదేశ్‌లో తప్పక చూడాల్సిన 5 బౌద్ధ వారసత్వ ప్రదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ మత ఆనవాళ్లు చాలా చోట్ల కనిపిస్తాయి. 5 ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం అనగానే గుర్తుకువచ్చేది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ఎన్నో మతాలు, కులాలు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఎన్నో రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, వేష భాషలు భారత దేశంలో ఉంటాయి. భారత్‌లో అనేక మతాలకు స్థానం ఉంది. వాటిలో ఒకటి బౌద్ధమతం. ఒడిశా బౌద్ధమతానికి జన్మస్థలం కావడంతో దాని సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, మత ప్రభావం యొక్క చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపిస్తుంది.

బౌద్ధమతం ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల సంవత్సరాలకు పైగా ఉందని చెబుతారు. చారిత్రక ఆనవాళ్లు 400BC నాటివి. అనేక బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఈనాటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. బౌద్ధమతం చుట్టూ ఉన్న జీవితం మరియు సంస్కృతికి ఒక దృక్పథాన్ని అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ మత ఆనవాళ్లు చాలా చోట్ల కనిపిస్తాయి. 5 ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమరావతి:
అమరావతి అనగానే బౌద్ధమతం మదిలో మెదులుతుంది. ఇక్కడ ఉన్న స్తూపం, మఠం అశోకుని పాలనలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆ సమయంలో బౌద్ధులకు తీర్థయాత్రగా పవిత్ర అభ్యాసం కోసం ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ పాలనలో ఇక్కడి నుండి ఎన్నో కళాఖండాలు, చారిత్రక సంపదను బ్రిటన్‌లోని మ్యూజియాలకు తరలించారని చరిత్ర కారులు చెబుతారు. అమరావతి విజయవాడకు అతిసమీపంలో ఉంటుంది. కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గుంటుపల్లి:
గుంటుపల్లి వద్ద ఉన్న గుహ స్మారక చిహ్నాలు మహారాష్ట్రలోని అజంతా మరియు ఎల్లోరా గుహలక కంటే పూరాతమైనవని చరిత్రకారులు భావిస్తున్నారు. 2వ లేదా 3వ శతాబ్దపు నాటివని నమ్ముతున్నారు. ప్రసిద్ధ భారతీయ తత్వవేత్త ఈ గుహల్లో ధ్యానం చేసినట్లు చెబుతారు. గుంటుపల్లి విజయవాడకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొడవలి:
(image:Wikimediacommons)
కొడవలిలో లభించిన చారిత్రక ఆనవాళ్లు 2,300 సంవత్సరాల క్రితం నాటవని తేలింది. కొడవలి బౌద్ధమతం యొక్క స్వర్ణ యుగాన్ని గుర్తు చేస్తుంది. కొడవలి ప్రాంతాన్ని 1880లో రాబర్ట్ సెవెల్ అలెగ్జాండర రియా కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ బ్రాహ్మీ లిపిలో బౌద్ధ శిలా శాసనం మొదట కనుగొనబడింది. ఈ శాసనం 2వ శతాబ్దపు క్రీస్తు శకం నాటిదని నమ్ముతారు. విశాఖపట్నానికి కొడవలి 128 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొత్తూరు:
కొత్తూరులో బౌద్ధ స్తూపాలి, రాతి గుహలు ఉన్నాయి. కొత్తూరు ప్రాంతం శారదా నది ఒడ్డున కొలువై ఉంటుంది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో బౌద్ధ మతానికి చెందిన అనేక ఆనవాళ్లు బయట పడ్డాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా బౌద్ధమత ఆనవాళ్లను కనుగొంటున్నారు. ఈ ప్రదేశంలోని రాతి గుహలను 1వ శతాబ్దం BC నాటి బౌద్ధ సన్యాసులు ఉపయోగించారని నమ్ముతారు. కొత్తూరు విశాఖపట్నానికి 179 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సాలిహుండం:
(image:quora)
వంశధార నదికి దక్షిణ ఒడ్డున కుడివైపున ఉన్న కొండపై ఉంటుంది. సాలిహుండంలో బయటపడిన ఆనవాళ్లు 2వ శతాబ్దం AD నాటివని తేలింది. ఈ ప్రాంతాన్ని 1919వ సంవత్సరంలో గిగుడు వెంకటరామ మూర్తి కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. సాలిహుండం అనేక శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. సాలిహుండంలో బౌద్ధ మత మ్యూజియం ఉంటుంది. ఇందులో అనేక కళాఖండాలు ఉన్నాయి. సాలిహుండం ప్రాంతం విశాఖపట్నానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications