For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం రాశి ఫలాలు (17-09-2019)

|

ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది? మీరు ఉత్సాహంగా గడుపుతారా లేదా నిరుత్సాహంగా ఉంటారా? మీరు మీ సమస్యలను పరిష్కరించుకోగలరా? లేదా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారా ? ఇవి తెలుసుకోవాలంటే మీ జాతక ఫలాలు గురించి తెలుసుకోవాల్సిందే..

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాల మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీవికారినామ సంవత్సరం, భాద్రపదమాసం, తదియ మంగళవారం రోజున ఏఏ రాశుల వారికి ఏవిషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏ రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏ రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏ రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రానించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టవచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు ఆదివారం దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేషం:

మేషం:

మీ భాగస్వామి యొక్క అస్థిర ప్రవర్తన ఒక మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఊహించని సంఘటన ఎదురవుతుంది. దాంతో కొందరు తమన సహనాన్నికోల్పోయి, సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఏ మాత్రం బాధపడకండి. ఉద్యోగం మానేయడానికి ఈరోజు మంచిది కాదు. కొన్ని మంచి పనులు ప్లాన్ చేసుకోవడానికి ఈ రోజు మంచిది కాదు. త్వరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, ఆత్రుతలో తీసుకునే నిర్ణయాల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. మింతగా డబ్బు కర్చు చేయండి. డబ్బును తిలివిగా ఖర్చుచేయండి . అలాగే దగ్గరి బంధువులు లేదా స్నేహిలుతులకు అప్పు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. ఈ పనిలో ఇది సాధారణ రోజు, కానీ మీ కృషి గుర్తించబడదు. సంబంధాల్లో మీ అజాగ్రత్త వైఖరి వల్ల విషయాలు మరింత దిగజారిపోతాయి.

లక్కీ కలర్: బ్లూ

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట సమయం: ఉదయం 8:30 నుండి 6:10 వరకు

వృషభం:

వృషభం:

మీ కోరికలను సాధించడానికి మీరు మరింత కష్టపడతారు మరియు మీ భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. మీరు ఇచ్చే మద్దతుతో మరియు మీ సహాయం చేసే గుణం వల్ల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు మీ పనిపై శ్రద్ద పెట్లాల్సి వస్తుంది. మీ తీవ్రమైన వైఖరి ఇతరులకు ప్రేరేపించేవిధంగా ఉంటుంది. ఇతరులను అంత సులభంగా నమ్మవద్దు, దాని వల్ల మీకు హాని జరగవచ్చు. మీ దగ్గరి బంధువులు మీరు సాధించే వాటిని చూసి అసూయపడతారు. లాంగ్ డ్రైవ్‌లను మానుకోండి. కుటుంబంలో ఒక సాధారణ రోజు, పెద్దలు సహాయంగా ఉండటంతో విషయాలు సజావుగా సాగుతాయి. తోబుట్టువుతో ఉన్న చిన్నవాదనలు మిమ్మల్ని కలవరపెడుతాయి. కాని విషయాలు త్వరలో సరిదిద్దబడతాయి. ఇది వ్యాపారవేత్తలకు లాభదాయకమైన రోజు. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీకు అదనపు ఆదాయ వనరులు ఉన్నందున ఆర్థిక రంగంలో ఈరోజు బలమైన రోజు అవుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రియమైనవారు మీ పట్ల శ్రద్ధ వహిస్తారు.

లక్కీ కలర్: గ్రీన్

అదృష్ట సంఖ్య: 11

అదృష్ట సమయం: సాయంత్రం 5:10 నుండి 8:20 వరకు

మిథునం:

మిథునం:

వివాహిత జంటలకు ఇది ఒక ముఖ్యమైన రోజు,ఎందుకంటే మీరు గతంలో ఉన్న మనోవేదనల నుండి బయటపడతారు- ఇది మీ ఇద్దరికీ మంచిది. కుటుంబంలో ఈ రోజు సంతోషకరమైన రోజు. అందరు కలిసి ఉండటం వల్ల ఈ రోజు సంతోషంగా గడుపుతారు. జంటల మధ్య అవగాహన ఒక సంబంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది. ఒక చిన్న ప్రయాణం చేస్తారు, మరియు పెద్దలు కూడా మీతో పాటు వస్తారు.చదువుల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ మొండి వైఖరి ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు వ్యాపారవేత్తలకు ఇది బిజీగా ఉంటుంది. ఆర్థికపరంగా ఈ రోజు సాధారణ రోజు మరియు బిజీగా గడుపుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆశించిన ఫలితాల కోసం ఈ రోజు యోగా మరియు ధ్యానంతో ప్రారంభించండి.

లక్కీ కలర్: పింక్

అదృష్ట సంఖ్య: 13

అదృష్ట సమయం: ఉదయం 7:00 నుండి రాత్రి 8:45 వరకు

కర్కాటకం:

కర్కాటకం:

నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉండటవల్ల మీరు చేసే పనివల్ల ఆకట్టుకుంటారు. మీ ప్రమోషన్ కారణంగా మీ సహోద్యోగులు అసూయపడతారు. విజయం పొందడానికి ఆత్మవిశ్వాసం ఉంచండి. విద్యార్థులు తమ చదువుల్లో విశ్వాసంతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుంటుంబంలో సాధారణంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. మీరు అభివృద్ధి చెందుతున్నందుకు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. వైవాహిక జీవితంలో కొంచెం హెచ్చుతగ్గులు జీవితంలో ఒక భాగం అవుతుంది, కానీ పరస్పర అవగాహన వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు గృహ వస్తువులను కొనడానికి ప్లాన్ చేయవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

లక్కీ కలర్: వైలెట్

అదృష్ట సంఖ్య: 44

అదృష్ట సమయం: మధ్యాహ్నం 3:00 నుండి 7:30 వరకు

సింహం:

సింహం:

మీ జీవితంలో ఊహించనటువంటి అకస్మిక మార్పులు ఉంటాయి. మీరు సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు సంబంధాల పట్ల అజాగ్రత్త వైఖరికి దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మార్పులు మీ మనస్సులో ఎక్కువగా ఉంటాయి. ఊహించని ప్రయాణం కుటుంబంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో మీరు పెద్దలను సంప్రదించవచ్చు. వ్యక్తిగత విషయాల్లో మీ దూకుడు ప్రవర్తన, కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితులు తీవ్రం అవుతాయి. తోబుట్టువులు మరియు కుటుంబంతో కలిసి పిక్నిక్ వెళ్ళడానికి ఆరోగ్యకరమైన రోజు. ఆర్థిక పరంగా మిశ్రమఫలితాలను ఇస్తుంది. డబ్బు ఉపయోగించడంలో గందరగోళం చెందుతారు. మీరు సాయంత్రానికి అలసిపోతారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తినడం మానేయండి.

లక్కీ కలర్: లేత పసుపు

అదృష్ట సంఖ్య: 31

అదృష్ట సమయం: ఉదయం 10:05 నుండి సాయంత్రం 6:30 వరకు

కన్య:

కన్య:

ఈ రోజు మీరు మీ జీవితంలో ప్రశాంతత మరియు సంతృప్తిని పొందుతారు. మీ కుటుంబం కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు కొన్ని విషయాల కోసం ప్రతికూల ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ మార్పులు, వేతనాల పెంపు వంటివి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు కుటుంబం కోసం ఏదైనా ప్లాన్ చేయవచ్చు. ఇది వారికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఆర్జిస్తారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు మీ గురువుకు సహాయం చేయవచ్చు. ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.

లక్కీ కలర్: తెలుపు

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట సమయం: ఉదయం 9:45 నుండి సాయంత్రం 5:45 వరకు.

తుల:

తుల:

మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. మీరు అనేక అంశాలలో ప్రణాళిక చేయడానికి ముందుకు వస్తారు. కెరీర్ రంగంలో పనిలో బిజీగా గడుపుతారు. మీరు వైవాహిక జీవితంలోని వారు సంబంధాలను బలపరుచుకుంటారు. పిల్లలు క్రీడలు మరియు చదువుల్లో బాగా రాణిస్తారు. వ్యాపారస్తులకు ఒక సాధారణ రోజు. ద్విచక్ర మరియు కారు వంటి వాహనాలను నడపడం మానుకోండి. ఆరోగ్య పరంగా మీకు సాధారణ రోజు.

లక్కీ కలర్: ఆరంజ్

అదృష్ట సంఖ్య: 12

అదృష్ట సమయం: ఉదయం 4:30 నుండి 6:00 వరకు.

వృశ్చికం:

వృశ్చికం:

గ్రహాలు మరియు నక్షత్రాలు మంచి స్థితిలో ఉన్నందున ఈ రోజు మీరు ఆహ్లాదకరంగా గడుపుతారు. అదనపు ఆదాయ వనరు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక భారం నుండి ఉపశమనం పొందుతారు. మీ పిల్లలు తదుపరి విద్య కోసం విదేశాలకు వెళతారు. వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమాజంలో ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది. నూతన వధూవరులకు శుభ దినం. మీరు మీ స్నేహితులతో అద్భుతమైన సమయం గడుపుతారు.

లక్కీ కలర్: ఊదా

అదృష్ట సంఖ్య: 35

అదృష్ట సమయం: సాయంత్రం 5:40 నుండి 11:00 వరకు.

ధనుస్సు:

ధనుస్సు:

మీరు కుటుంబ సభ్యులతో వాదించడం ద్వారా ఈ రోజు ప్రారంభిస్తారు. విషయాలు దీనికి విరుద్ధంగా ఉంటాయి. ఈ రోజు మీకు ఆఫీసులో నెమ్మదిగా ఉండే రోజు. మీరు పని పూర్తి చేయలేదని మీ యజమాని బాధపడవచ్చు. కుటుంబంలో దగ్గరి బంధువులతో కరచాలనం చేయడం చికాకు కలిగిస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని విషయాలను విస్మరించండి. జీవిత భాగస్వామి మద్దతుగా నిలుస్తుంది. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి.

లక్కీ కలర్: గ్రీన్

అదృష్ట సంఖ్య: 20

అదృష్ట సమయం: ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.

మకరం:

మకరం:

మీరు సంబంధంలో ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. కుటుంబం మరియు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇలా గడపడానికి చాలా రోజుల నుండి వేచి చూస్తున్నారు. మీరు పిల్లల నుండి శుభవార్త వింటారు. తండ్రి అనారోగ్యం కుటుంబంలో ఆందోళనకు గురిచేస్తుంది. ఈ రోజు ఆర్థిక పరంగా మీకు బహుమతి పొందే రోజు. పనిలో ఒక సాధారణ రోజు. మీరు కొత్త ప్రాజెక్టుల గురించి మరింత ఆలోచిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా శ్రేయస్సు పొందుతారు.

లక్కీ కలర్: ఓషియన్ గ్రీన్

అదృష్ట సంఖ్య: 4

అదృష్టం సమయం: ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

కుంభ రాశి:

కుంభ రాశి:

ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు కఠినమైన రోజు కానుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనికి సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభించడం సాధ్యమే. కుటుంబంతో గడపలేకపోతున్నారు. ఇది వివాదానికి కారణం కానుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీ జీవిత భాగస్వామి బాధపడే అవకాశం ఉంది. క్రీడలు మరియు సంగీతంలో ముందున్న విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శిస్తారు. జీవిత భాగస్వామి ప్రవర్తన నిరాశపరుస్తుంది. మీ పొరుగువారితో వాదన వల్ల ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఓపితో ఉండటం వల్ల పరిస్థితులు చక్కబడుతాయి.

లక్కీ కలర్: క్రీమ్

అదృష్ట సంఖ్య: 18

అదృష్ట సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 8:30 వరకు.

మీనం:

మీనం:

మీరు మీ వైఖరిని మెరుగుపర్చడానికి పని చేస్తారు. మీ ప్రవర్తన వల్ల మీరు ఉపాధి రంగంలో చాలా నష్టపోతారు. దాన్ని మెరుగుపరచడానికి మీరు ఉద్యోగ మార్పు కొరకు ప్లాన్ చేసుకుంటారు. తీవ్రమైన పని ఒత్తిడి మీకు నిరాశ కలిగిస్తుంది. పెట్టుబడి పెట్టడం అదృష్టం. మీకు అదృష్టం తెచ్చేది విహారయాత్ర. ఓపికగా ఉన్నందుకు ప్రతిఫలం ఉంది. మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేక అనుభూతిని కలిగించడం ద్వారా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీకు ఆరోగ్యకరమైన రోజు.

లక్కీ కలర్: పసుపు

అదృష్ట సంఖ్య: 23

అదృష్ట సమయం: ఉదయం 7:15 నుండి సాయంత్రం 6:30 వరకు.

English summary

Daily Horoscope: 17 Sep 2019 In Telugu

Horoscope is an astrological chart or diagram representing the positions of the Sun, Moon, planets, astrological aspects and sensitive angles at the time of an event, such as the moment of a person's birth. The word horoscope is derived from Greek words "wpa" and scopos meaning "time" and "observer".
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more