For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీరని కోరిక ఏంటో తెలుసా...!

|

పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది పదుల వయసులో తుదిశ్వాసను విడిచారు. కరోనా వైరస్ వంటి మహమ్మారి బారిన పడిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దా ఆగస్టు 31వ తేదీన సోమవారం నాడు కన్నుముశారు.

అయితే లోకాన్ని విడిచే వెళ్లే సమయంలో భారత రాజకీయాల్లో తనకంటూ ఓ విశేష చరిత్రను లిఖించుకున్నారు. ఓ సాధారణ క్లర్కుగా.. ఓ ఆచార్యునిగా.. ఓ జర్నలిస్టుగా.. రాష్ట్రపతిగా.. మొత్తానికి అజాతశత్రువుగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

ఎందుకంటే రాజకీయాలలో ఏ పార్టీ వారికైనా ప్రణబ్ ముఖర్జీ అంటే ఇష్టమే. ఎందుకంటే అతను అందరితోనూ కలివిడిగానే ఉంటాడు. అంతేకాదు అన్ని పార్టీల నడుము ఓ వారధిలా కూడా పని చేశాడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో క్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరించాడు. అనేక సందర్భాల్లో పార్టీని గట్టెక్కించాడు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న ప్రణబ్ దా గురించి మనం కొన్ని నిజాలను తెలుసుకోవాల్సిందే...

బ్రాహ్మణ కుటుంబంలో..

బ్రాహ్మణ కుటుంబంలో..

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రాజ్యలక్ష్మీ మరియు కామడ ముఖర్జీ దంపతులకు 1935 డిసెంబర్ 11వ తేదీన ప్రణబ్ ముఖర్జీ జన్మించాడు. బీరుభంలోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ మరియు ఎల్ఎల్ బీలో డిగ్రీ పట్టా సంపాదించారు.

ఓ క్లర్కుగాను..

ఓ క్లర్కుగాను..

ప్రణబ్ ముఖర్జీ గురించి చాలా మందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొంతకాలం పోస్టల్ డిపార్ట్ మెంటులో కొంతకాలం క్లర్కుగా పని చేశాడు.

1957లో వివాహం..

1957లో వివాహం..

1957లో సుర్వ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన భార్య సుర్వా ముఖర్జీ గుండె ఆగిపోవడంతో 2015లో తన 74వ ఏట మరణించారు. ఆమె మరణించిన నాటి నుండి, ప్రణబ్ దా కార్యాలయంలోనే ఎక్కువ కాలం గడిపారు.

లెక్చరర్ గా.. జర్నలిస్టుగా..

లెక్చరర్ గా.. జర్నలిస్టుగా..

1963 సంవత్సరంలో కోల్ కత్తాలోని విద్యానగర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పని చేశారు. ఇది మాత్రమే కాదు రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం జర్నలిస్టుగా స్థానిక బెంగాలీ పత్రిక డేషర్ డాక్ లో కూడా పని చేశారు.

1969లో రాజకీయాల్లో ప్రవేశం..

1969లో రాజకీయాల్లో ప్రవేశం..

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితం 1969 నుండి ప్రారంభమైంది. తొలుత మిడ్నాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించాడు. అదే సమయంలో ఇందిరా గాంధీ ఈయన చురుకుదనం, తెలివితేటలు చూసి ఆమె ఆశ్చర్యపోయారు. అంతే ఆమె వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది.

రాజ్యసభలో ఎంట్రీ..

రాజ్యసభలో ఎంట్రీ..

ఆ వెంటనే తనను రాజ్యసభకు పంపింది. అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ రోజులో 18 గంటలు పనిచేస్తూనే ఉండేవాడు. అలా కేంద్రంలో ఆయన రక్షణ, వాణిజ్య, విదేశీ, ఆర్థిక మంత్రత్వశాఖలను చేపట్టి.. తర్వాత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించాడు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఈ దేశంలో మరే నాయకుడికీ లేదు.

ఉత్తమ పార్లమెంటేరియన్..

ఉత్తమ పార్లమెంటేరియన్..

1984లో యూరోమనీ మ్యాగజైన్ ప్రణబ్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రి అని కొనియాడింది. ఎందుకంటే ఆయన ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పించారు. అలాగే సుదీర్ఘ కాలం పార్లమెంటరీ పార్టీనేతగా పని చేశారు. ప్రధాని లేకపోతే కేబినేట్ సమావేశాల్ని కూడా లీడ్ చేసేవాడు. అలాగే పార్లమెంటులో ఆయన ప్రవర్తనకు గాను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఆయనను వరించింది.

మధ్యలో వివాదం..

మధ్యలో వివాదం..

అయితే ప్రణబ్ దా జీవితాంతం కాంగ్రెస్ వాదిగా ఉండలేదు. ఇందిరాగాంధీ చనిపోయాక..రాజీవ్ వ్యతిరేకులతో చేతులు కలిపాడనే ఆరోపణలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయన సొంతంగా రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ పెట్టుకున్నాడు. అయితే మూడు నాలుగేళ్లకే దాన్ని కాంగ్రెసులో కలిపేశాడు.

ఎంతో ఎత్తుకు..

ఎంతో ఎత్తుకు..

ప్రణబ్ దా ఆకారంలో కేవలం అయిదు అడుగుల ఒక అంగుళం ఎత్తు ఉన్నప్పటికీ... తన జీవితంలో మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభానికి ముందే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన కాలాన్ని బట్టి. ఆర్థిక విధానాలను అంచనా వేసే మన్మోహన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించింది ప్రణబ్ దానే.

ప్రధాని కాలేదని..

ప్రధాని కాలేదని..

ప్రణబ్ ముఖర్జీ వివిధ పార్టీల నాయకులతో తరచుగా విందులు, భేటీలలో పాల్గొనేవాడు. తనకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్లే తాను ప్రధానమంత్రి కాలేకపోయానని జోక్ చేసేవాడు. తన జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందంటే అది ప్రధాని పదవి మాత్రమే. అది తప్ప తను అన్ని ఉన్నత పదవులను అలంకరించాడు.

2020లో తుదిశ్వాస...

2020లో తుదిశ్వాస...

ప్రణబ్ ముఖర్జీకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అది ఎంతలా అంటే ఓ వ్యసనమని చెప్పొచ్చు. ఒకేసారి మూడు, నాలుగు పుస్తకాలను చదివేవారట. తన ఇల్లు కూడా ఓ గ్రంథాలయంలా ఉండేదట. ఇదిలా ఉండగా.. 2020లో ఆగస్టు 10వ తేదీన ఆయన కరోనా బారిన పడ్డట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆగస్టు 13వ తేదీన ప్రణబ్ మెదడుకు ఆపరేషన్ జరిగింది. 19 నాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రకటించారు. అనంతరం వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు ఆయన ఆగస్టు 31వ తేదీన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. తన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.

English summary

Former President Of India Pranab Mukherjee Passes Away At 84: Facts About Him That Will Inspire You

Pranab Mukherjee, the former President of India took his last breath on 31 August 2020 at the age of 84. On 10 August 2020, he announced through his Twitter handle that he has tested COVID-19 positive. Here are some facts related to his life.