For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇస్రో పితామహుడు విక్రమ్ సారాబాయ్ శత జయంతికి గూగుల్ డూడుల్ నివాళి..

|

భారత అంతరిక్ష రంగం ఇటీవల కాలంలో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. తాజాగా చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసుకుని అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతటి ఘన విజయాలు సాధిస్తున్న ఈ మహా సంస్థకు బీజం వేసిన భౌతిక శాస్త్రవేత్త, గొప్ప పారిశ్రామిక వేత్త విక్రమ్ సారాభాయ్ యొక్క శత జయంతి నేడే. అందుకే ఈయనను అంతరిక్ష రంగ పితామహుడు అని పేర్కొంటారు. ఇదే సందర్భంలో ప్రముఖ సెర్ఛ్ ఇంజిన్ గూగుల్ ఆయన చిత్రంతో కూడిన ప్రత్యేక డూడుల్ తో ఘన నివాళి అర్పించింది.

విక్రమ్ సారాభాయ్ వివరాలు :

సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త సంపన్న కుటుంబంలో జన్మించాడు. అంబాలాల్, సరళా దేవి దంపతుల ఎనిమిది మంది సంతానంలో ఈయన ఒకరు. 1919 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. ఆయన చిన్ననాటి నుండే తను కోరుకున్న విద్యను అభ్యసించే మార్గాలను అన్వేషించాడు. సారాభాయ్ సైన్స్, గణితంపై అమితమైన ఆసక్తి కనబరచేవాడు. అలా ఆ రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్ లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇంగ్లాండ్ దేశానికి వెళ్లారు. అక్కడ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో న్యాచురల్ సైన్సెస్ లో పట్టా పొందారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశానికి తిరిగొచ్చారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చేరాడు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు ప్రారంభించారు. తదనంతర కాలంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ రీసెర్చిలో కీలకపాత్ర పోషించారు.

తిరువనంతపురంలో తొలి కేంద్రం..

అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనలకు ఉన్న ప్రాముఖ్యతను ముందే పసిగట్టిన విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ఏర్పాటుకు భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రష్యన్ స్పుత్నిక్ ప్రయోగం తర్వాత అంతరిక్ష ప్రాముఖ్యతను గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించడమే, కాకుండా వారిని ఒప్పించడంలో కూడా వందకు వంద శాతం సఫలమయ్యారు. ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తలు బ్రహ్మప్రకాష్, సతీష్ ధావన్, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం లాంటి వారి ప్రతిభను ఆనాడే గుర్తించారు. వారందరి సహకారంతో భారత అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అలా భారత అణు కార్యక్రమాల్లోనూ సారాభాయ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మరో విశేషమేమిటంటే డాక్టర్ హోమి జహంగీర్ బాబా, మన దేశంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసేందుకు డాక్టర్ సారాభాయ్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అలా తొలి కేంద్రం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని తుంబాలో స్థాపించబడింది.

28 ఏళ్ల వయసులోనే తొలి మైలురాయి..

విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి శాస్త్రీయ పత్రం 'టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ కిరణాలు' 1942లో ప్రచురించబడింది. అదే ఏడాదిలో ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ మృణాలినిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అతని కుమార్తె మల్లికా, కుమారుడు కార్తికేయ కూడా ప్రసిద్ధ వ్యక్తులు అయ్యారు. అతను కాస్మిక్ కిరణాలపై తన పరిశోధనను కొనసాగించడానికి 1945లో కేంబ్రిడ్జికి తిరిగి వచ్చాడు. 'ఉష్ణమండల అక్షాంశాలలో కాస్మిక్ రే పరిశోధనలు' అనే తన థీసిస్ కోసం పిహెచ్‌డి సంపాదించాడు. నవంబర్ 11, 1947 న అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్‌ఎల్) ను స్థాపించడం అతని మొదటి మైలురాళ్ళలో ఒకటి. ఆ సమయంలో ఆయన వయసు 28 మాత్రమే. సారాభాయ్ 1966-1971 వరకు పిఆర్ఎల్ కోసం పని చేశారు.

ఆయన సేవలకు అరుదైన గౌరవం :

విక్రమ్ సారాభాయ్ సేవల్ని ప్రపంచ అంతరిక్ష రంగం గుర్తించింది. అంతేకాదు ఆయన పేరిట చంద్రుడిపై ఉన్న ఓ పెద్ద క్రేటర్ కి 1973లో నామకరణం చేసి గౌరవించింది. తాజాగా ఇస్రో జరిపిన చంద్రయాన్-2లోని ల్యాండర్ కు విక్రమ్ అనే పేరు పెట్టి ఆయనకు ఘన నివాళులర్పించింది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ శతజయంతి సందర్భంగా ఇస్రో ఈ ఏడాది పోడవునా అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆగస్టు 12వ తేదీ అయిన నేడు వంద నగరాల్లో వంద రకాల కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి.

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సహాయం చేసిన సంస్థలివే..

- ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్)

- అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)

- అహ్మదాబాద్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్,

- అహ్మదాబాద్ దర్పాన్ అకాడమీ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్,

- అహ్మదాబాద్ (అతని భార్యతో పాటు) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్

- తిరువనంతపురం స్పేస్ అప్లికేషన్స్ సెంటర్

- అహ్మదాబాద్ (సారాభాయ్ స్థాపించిన ఆరు సంస్థలు / కేంద్రాలను విలీనం చేసిన తరువాత ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది)

- ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (ఎఫ్‌బిటిఆర్), కల్పక్కం

- వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ ప్రాజెక్ట్, - కొలకత్తా

- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్), హైదరాబాద్

- యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్), జడుగుడ, బీహార్

English summary

Google Doodle honours Vikram Sarabhai on his 100th birthday anniversary

Vikram Sarabhai's services have been recognized by the global space industry. He was named and honored in 1973 by a giant crater on the moon in his name. The latest ISRO Chandrayaan-2 lander is named after Vikram. Against this backdrop, ISRO will be hosting a number of events this year during Vikram's centenary. The festival will kick off on August 12th with over 100 events in hundreds of cities.
Story first published: Monday, August 12, 2019, 12:12 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more