For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google doodle: ఎవరీ బాలమణి అమ్మ? డూడుల్ తో నివాళి అర్పించిన గూగుల్

బాలమణి అమ్మ మలయాళ కవయిత్రి. ఆమె సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. మలయాళ సాహిత్యానికి బాలమణి అమ్మమ్మగా గుర్తింపు పొందారు.

|

Google doodle: ఈ రోజు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వారికి ఒక డూడుల్ కనిపించే ఉంటుంది. భారతీయ కవయిత్రి బాలమణి 113వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ ఈ విధంగా నివాళి అర్పించింది. ఈ డూడుల్ ను కేరళకు చెందిన కళాకారిణి దేవికా రామచంద్రన్ చిత్రీకరించారు. బాలమణి అమ్మ గురించి చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. సాహిత్యం అంటే ఇష్టం ఉన్న వారికి తెలియవచ్చు. బాలమణి మలయాళ సాహిత్యానికి అమ్మమ్మగా విస్తృతంగా గుర్తింపు పొందారు.

Google paid tribute with a doodle to Balamani amma, Who is she in Telugu

ఎవరీ బాలమణి అమ్మ?

బాలమణి అమ్మ మలయాళ కవయిత్రి. ఆమె కేరళలో పున్నయుర్కులంలో తన పూర్వీకుల నివాసమైన నలపట్‌లో 1909 సంవత్సరం జులై 19 న జన్మించారు. ఆమె సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. మలయాళ సాహిత్యానికి బాలమణి అమ్మమ్మగా గుర్తింపు పొందారు. ఆమె సాహిత్యంలో చేసిన కృషికి గాను ఆమె ఎన్నో అవార్డులు, సత్కారాలు అందాయి. సాహిత్యంలో అత్యంత గౌరవనీయమైన సరస్వతి సమ్మాన్‌ అవార్డు అందుకున్నారు.భారత దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ అందుకున్నారు బాలమణి అమ్మ. బాలమణి అమ్మ కమలా దాస్ తల్లి. కమలా దాస్ 1984లో సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు.ప్రతిభావంతులైన కవయిత్రిగా ఆమెకు మొదటి గుర్తింపు కొచ్చిన్ రాజ్యం మాజీ పాలకుడు పరీక్షిత్ థంపురాన్ నుండి వచ్చింది. అతను ఆమెకు సాహిత్య నిపుణ పురస్కారం అందించాడు.

బాలమణి ఏం చదువుకున్నారు?

బాలామణి అమ్మ ఏ పాఠశాలకు వెళ్లలేదు. అంటే ఆమె బడిలో అందే చదువును పొందలేదు. కానీ ఇంటిపట్టునే చదువుకున్నారు. అలా చదువుకున్న విద్యతోనే సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. ప్రముఖ మళయాళీ కవి అయిన నలప్పట్ నారాయణ మీనన్ బాలమణికి మేనమామ అవుతారు. ఆయనే బాలమణి అమ్మకు చదువు చెప్పారు. పాఠశాల విద్యకు దూరం అయ్యాయన్న భావన లేకుండా చదువు చెప్పారు నలప్పట్ నారాయణ మీనన్. ఆయన బోధించిన పాఠాల వల్లే బాలమణి సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారు. అమ్మపై ఆయన మేనమామ ప్రభావం పడింది. ఆయన పుస్తకాలను, రచనల సేకరణను బాలమణి చదువుతూ పెరిగారు.

బాలమణి అమ్మ జీవితం:

బాలమణి అమ్మ తన 19 ఏటనె పెళ్లి పీటలు ఎక్కారు. అంత చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నారు. మలయాళ వార్తా పత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ ఎడిటర్ అయిన V.M నాయర్‌ ని బాలమణి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె స్వయంగా చదువుకుంటూ, రచనలు చేసేవారు. బాలమణి అమ్మకు ఆయన భర్త ప్రోత్సాహం ఉండేది. అమ్మ డిసెంబర్ 29, 2004న కొచ్చిలో మరణించారు బాలమణి.

బాలమణి రచనలు:

* బాలమణి అమ్మ మొదటి కవిత 'కూప్పుకై'. ఈ కవిత 1930లో ప్రచురించబడింది. బాలమణి 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ కవిత ప్రచురించడం విశేషం.
* అమ్మ రాసిన తొలి కవితలు మాతృత్వాన్ని కీర్తిస్తూ సాగేవి.
* ఆమె పద్యాలు రాసేటప్పుడు పౌరాణిక పాత్రల ఆలోచనలు కోణంలో ఉండేవి.
* తన కవితల్లో స్త్రీలను బలమైన వ్యక్తులుగా చిత్రీకరించేవారు బాలమణి అమ్మ.
* బాలమణి అమ్మ "మాతృత్వ కవయిత్రి"గా ప్రసిద్ధి చెందారు.
* బాలమణి రచనల్లో 1934 సంవత్సరంలో వచ్చిన అమ్మ అనే రచన చాలా ప్రాచుర్యం పొందింది.
* 1962లో వచ్చిన ముత్తాస్సి కూడా చాలా మందిని ఆకట్టుకుంది.
* మజువింటే కథ. ఇది 1966 సంవత్సరంలో వచ్చిన రచన.
* బాలామణి అమ్మ పేరు మీద 20కి పైగా కవితలు, గద్యాలు, అనువాదాల సంకలనాలు ప్రచురించబడ్డాయి.

Google paid tribute with a doodle to Balamani amma, Who is she in Telugu

మలయాళ సాహిత్యానికి అమ్మమ్మగా ఎలా మారారు. భారతీయ పురాణాల పట్ల ఆసక్తి చాలా ఉండేది.బాలమణి అమ్మ తన సాహిత్యంలో మహిళలను ఎప్పుడూ బలహీనురాళ్లుగా చూపించలేదు. శక్తివంతమైన వారుగానే చిత్రీకరించే వారు. అలాగే వారి పాత్రల స్వభావం ఎక్కడా చిన్నచూపుకు గురి అవ్వకుండా ఉండేది. అలాగే బాలమణి అమ్మకు తన పిల్లలు, మనవరాళ్ల పట్ల ఎనలేని ప్రేమ ఉండేది. తన సాహిత్యంలో ఆ ప్రేమను కనబరిచే వారు బాలమణి. అలాగే ఆమె రాసిన అమ్మ(తల్లి), ముత్తస్సి(అమ్మమ్మ) అనే రచనల తర్వాత.. ఆమెకు ఆ బిరుదులు వచ్చాయి. అలాలయాళ సాహిత్యానికి బాలమణి అమ్మమ్మగా మారారు.

English summary

Google doodle paid tribute to Balamani amma, Know Who is she in Telugu

read on to know Google paid tribute with a doodle to Balamani amma, Who is she in Telugu
Desktop Bottom Promotion