For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60లోనూ 20లాగా కనిపించే నవ మన్మథుడు నాగార్జున గురించి మనం నమ్మలేని నిజాలు...

నవ మన్మథుడు నాగార్జున గురించి మనం నమ్మలేని నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

'విక్రమ్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నవ మన్మథుడు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన్ 'కింగ్' నాగార్జున తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Happy Birthday Nagarjuna : Interesting facts about the Telugu Bigboss Host

అప్పట్లో 'శివ'సినిమాతో రామ్ గోపాల్ వర్మతో కలిసి ట్రెండ్ క్రియేట్ చేసి, తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ 'కింగ్' నాగార్జున అమ్మాయిల మనసు దోచుకోవడంలో ఓ 'కేడీ' అని చెప్పొచ్చు..

Happy Birthday Nagarjuna : Interesting facts about the Telugu Bigboss Host

ఇప్పటికీ తన చూపులతో 'సోగ్గాడే చిన్ని నాయనా' అని అనిపించుకునే నవ మన్మథుడు నాగార్జున ఒక్క నటుడిగానే కాకుండా నిర్మాతగా, బిగ్ బాస్ హోస్ట్ గా, బుల్లితెర యాంకర్ గా సత్తా చాటి నాగ్ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 29వ తేదీ). ఈ సందర్భంగా అక్కినేని వారసుడి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

నాగ్ బాల్యం..

నాగ్ బాల్యం..

నాగార్జున తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు 1959 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. ఈయన ప్రాథమిక విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. మద్రాసులోని మిచిగాన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగును పూర్తి చేశారు.

తెరంగేట్రం ఇలా..

తెరంగేట్రం ఇలా..

నాగార్జున తొలి సినిమా ఏదంటే ‘విక్రమ్' అని మాత్రమే తెలుసు. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. తను చిన్నప్పుడే ప్రముఖ దర్శకుడు తీసిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుడిగుండాలు' సినిమాలో బాలనటుడిగా కనిపించారు. అంతకుముందు ‘వెలుగు నీడలు' అనే సినిమాలో పసిపిల్లాడిగానే తెరపై కనిపించారు.

‘విక్రమ్’తో హీరోగా..

‘విక్రమ్’తో హీరోగా..

తను పెద్దయ్యాక మధుసూదనరావు దర్శకత్వం వహించిన ‘విక్రమ్' సినిమాతో నాగార్జున హీరోగా మారారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ‘మజ్ను'లో నటించిన నాగ్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి.

1984లో వివాహం..

1984లో వివాహం..

అక్కినేని నాగార్జున ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.

అమలతో రెండో పెళ్లి..

అమలతో రెండో పెళ్లి..

వారిద్దరూ విడిపోయిన తర్వాత 1992లో నాగార్జున ‘శివ' సినిమాలతో తనతో కలిసి నటించిన ప్రముఖ నటి అమలను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగచైతన్య, అఖిల్. వీరిద్దరూ కూడా హీరోలుగా సినిమాల్లో తన టాలెంట్ ను పరీక్షించుకుంటున్నారు.

చలనచిత్ర శాస్త్రవేత్త..

చలనచిత్ర శాస్త్రవేత్త..

నాగార్జునను సినిమా రంగంలో ఉండే వారు ఆయనను చలనచిత్ర శాస్త్రవేత్త అని పిలిచేవారంట. ఎందుకంటే కింగ్ నాగార్జున వివిధ రకాల స్క్రిప్టులతో ప్రయోగాలను చేస్తూ ఉండటం వల్లనే ఆయనకు అలాంటి పేరొచ్చింది.

‘మనం’ ప్రత్యేకం..

‘మనం’ ప్రత్యేకం..

నాగార్జున కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసినప్పటికీ.. ‘మనం' సినిమా మాత్రం ఎప్పటికీ ఓ మధురమైన జ్ణాపకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని వారి మూడు తరాల వారు నటించారు. ఈ చిత్రం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

బుల్లితెరపైనా సత్తా చాటిన నాగ్..

బుల్లితెరపైనా సత్తా చాటిన నాగ్..

నాగార్జున కేవలం వెండితెరపై ఒక్కటే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ‘యువ' అనే సీరియల్ తో నిర్మాతగా బుల్లితెరపై అడుగుపెట్టాడు. మా టీవీని స్టార్ నెట్ వర్క్ విక్రయించే ముందు నాగార్జున ఆ ఛానెల్ కు ప్రధాన వాటాదారుడిగా ఉండేవారు. ఆ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'కు నాగార్జున హోస్ట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-4కు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

అంబాసిడర్ గానూ..

అంబాసిడర్ గానూ..

నాగార్జున కేవలం వెండితెర, బుల్లితెరలో కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు కొన్నింటికీ అంబాసీడర్ గా వ్యవహరిస్తున్నాడు. 2012లో 36, 2013లో 43వ స్థానంలో ఫోర్బ్స్ ఇండియా యొక్క టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో నిలిచాడు.

స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిగా..

స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిగా..

నాగార్జున ఆనిమల్ వెల్ఫెర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన ‘బ్లూ క్లాస్ ఆఫ్ హైదరాబాద్' అనే ఆనిమల్ వెల్ఫేర్ సొసైటీకి నాగార్జున-అమల సహ వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

నాగార్జున కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. నటుడిగా..నిర్మాతగా.. కూడా ఆయన అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు. అంతేకాదు సంతోషం సినిమాకు నాగార్జున బెస్ట్ యాంకర్ గా అవార్డు తీసుకోవడం విశేషం.

English summary

Happy Birthday Nagarjuna : Interesting facts about the Telugu Bigboss Host

Here we talking about happy birthday Nagarjuna : Interesting facts about the Telugu Bigboss Host. Read on
Desktop Bottom Promotion