For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గురించి మనం నమ్మలేని నిజాలు....

ప్రభుదేవా కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా నటుడిగా.. కోరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా కూడా తనదైన ముద్ర వేశాడు.

|

మన దేశంలో నాట్యానికి కొత్త నడకను నేర్పిన ఆచార్యునిగా ప్రభుదేవా పేరు తెచ్చుకున్నారు. డ్యాన్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ప్రభుదేవా కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా నటుడిగా.. కోరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా కూడా తనదైన ముద్ర వేశాడు. తన తండ్రి సుందరం మాస్టరు కూడా ఎన్నో చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేశారు. మరో విశేషమేమిటంటే ప్రభుదేవా సోదరులు రాజ్ సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా డ్యాన్స్ మాస్టర్లు కావడం విశేషం.

Happy Birthday Prabhu deva Intersting Facts about Indian Michael jackson

అయితే ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ''చికు బుకు చికు బుకు రైలే'' అంటూ ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన ఈ ఇండియన్ మైఖెల్ జాక్సన్ పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 3వ తేదీ).

Happy Birthday Prabhu deva Intersting Facts about Indian Michael jackson

అప్పట్లో ప్రేమికుడు సినిమాలో నగ్మతో కలసి నాట్యంలో అదరగొట్టిన నాటి నుండి తాజాగా స్ట్రీట్ డ్యాన్స్ వరకు సాగించిన ఆయన జీవితంలో కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రభుదేవా జననం..

ప్రభుదేవా జననం..

ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కర్నాటక-చెన్నై సరిహద్దులోని మైసూరులో 1973 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మహదేవమ్మ, సుందరం మాస్టర్. చిన్నతనంలో ప్రభుదేవాకు డ్యాన్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదట. ఆయనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టముండేదట.

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా..

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా..

అయితే తన తండ్రి ప్రేరణతో డ్యాన్స్ లో అడుగుపెట్టిన ప్రభుదేవా చిన్నప్పుడే భరత నాట్యంలో మంచి శిక్షణ పొందాడు. అంతేకాదు వెస్ట్రన్ స్టైల్ లో కూడా మంచి తర్ఫీదు పొందాడు. అతని స్టెప్పులు చూసిన చాలా మంది తనకు ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్‘ అని బిరుదు ఇచ్చేశారు.

ఆ సినిమాతో కోరియోగ్రాఫర్ గా..

ఆ సినిమాతో కోరియోగ్రాఫర్ గా..

ప్రభుదేవా తన పదహారేళ్ల వయసులో అంటే 1989లో కమల్ హాసన్ నటించిన వెత్రి విజా సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టారు. అప్పటి నుండి తన సినీ ప్రస్థానంలో సుమారు వంద సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా చేశాడు. అంతేకాదండోయ్ తన నాట్యంతో ఎందరో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

ఆ చిత్రంతో నటుడిగా..

ఆ చిత్రంతో నటుడిగా..

ప్రభుదేవా కేవలం డ్యాన్స్ చేస్తూ కొరియాగ్రాఫర్ గా ఆగిపోలేదు. తన జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 1994లో ఇంధు అనే చిత్రం ద్వారా వెండితెరకు నటుడిగా పరిచమయ్యాడు. ఈ చిత్రానికి పవిత్రన్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా రోజా నటించారు. అప్పుడే తనలోని నట విశ్వరూపం కూడా చూపించారు ప్రభుదేవా. అందుకే ఆ చిత్రం నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది.

తన కల నిజమైన వేళ..

తన కల నిజమైన వేళ..

ప్రభుదేవాకు ఎప్పటి నుండో ఒక కల ఉండేదట. అది బాలీవుడ్ లో అడుగుపెట్టాలని, అక్కడ అమితాబ్ బచ్చన్ తో కలిసి పని చేయాలని ఎంతో ఆశగా ఉండేదట. అయితే ఆ కలను నిజం చేసుకున్నాడు మన ఇండియన్ మైఖేల్ జాక్సన్. అంతేకాదు సల్మాన్, జాకీ ష్రాఫ్ తో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులతో ప్రభుదేవా కొత్త కొత్త స్టెప్పులు వేయించారు.

తెలుగులోనూ...

తెలుగులోనూ...

మన టాలీవుడ్ లోనూ చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణతో ఎందరో హీరోలతో కొత్త కొత్త స్టెప్పులు వేయించారు. అంతేకాదు తెలుగులో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. తన డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా‘ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు సైతం లభించాయి.

ముక్కాబులా.. ముక్కాబులా..

ముక్కాబులా.. ముక్కాబులా..

తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చిపెట్టిన ‘ముక్కాబులా ముక్కాబులా‘ పాటను మరియు డ్యాన్సును మరోసారి బాలీవుడ్ లో ప్రయోగించారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గా..

ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గా..

ప్రభుదేవా ఇప్పటివరకు ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గా రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీటితో పాటు ఇతర అవార్డులను అనేకం గెలుచుకున్నాడు.

పద్మశ్రీ ప్రభుదేవా..

పద్మశ్రీ ప్రభుదేవా..

డ్యాన్స్ లో మరియు సినిమా రంగంలో ఈయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రభుదేవాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గత ఏడాదే ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేత ప్రభుదేవా ఈ అవార్డును అందుకున్నారు.

కొన్ని వివాదాలు..

కొన్ని వివాదాలు..

ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొన్నాడు. హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని.. అందుకే తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడన్న వార్తలు బాగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య ఏదో విషయంలో వివాదం వచ్చి.. మళ్లీ విడిపోయినట్లు తెలిసింది.

English summary

Happy Birthday Prabhu deva Intersting Facts about Indian Michael jackson

Here we talking about interesting facts about indian michael jackson prabhudeva. Read on
Desktop Bottom Promotion