For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Mother's Day 2022 : అమ్మపై మీకెంతో ప్రేమ ఉందో చెప్పే సమయం వచ్చేసింది...

మే 8వ తేదీన మదర్స్ డే సందర్భంగా, అందులోనూ ఎండాకాలంలో అమ్మను ఎలా ఆశ్చర్యపరచాలో అని ఆలోచిస్తున్నారా?

|

అందరి గురించి తనకు అనవసరం..
ఎవరేమీ అనుకున్నా పిల్లల ఎదుగుదలే ఆమెకు ముఖ్యం..
ఆ తర్వాతే అన్నీ అనుకునే మనస్తత్వం..
అందరి కంటే తన పిల్లలే గొప్ప అనుకునే అమాయకత్వం..
ఈ భూమి మీద అమ్మకు మాత్రమే ఇది సాధ్యం..
అందుకే అమ్మంటే అందరికీ ఇష్టం..

Mothers Day During The Coronavirus Lockdown

ఈ ప్రపంచంలో ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క తల్లి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి భావాలను తల్లి ఎప్పటికీ వ్యక్తపరచదు. ఆమె ప్రార్థనలకు పిల్లలు ఎన్నిసార్లు కష్టాల కడలి నుండి ఒడ్డుకు వస్తారో తెలియదు. తల్లి ప్రేమ మరియు సంరక్షణ యొక్క రుణాన్ని ఎవ్వరూ చెల్లించలేరు.

Mothers Day During The Coronavirus Lockdown

అయితే మదర్స్ డే రోజు తల్లి కోసం ఓ చిన్న ప్రయత్నం చేయడం ద్వారా, ఆమె ముఖం మీద విలువైన చిరునవ్వును తీసుకురాగలదు. ఈ లాక్ డౌన్ సమయంలో మీ తల్లిని ఎలా ఆశ్చర్యపరచాలా? ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచినలు వస్తుంటాయి.

Mothers Day During The Coronavirus Lockdown

అలా మీరు ఏదైనా ఒక సర్ ప్రైజ్ తల్లికి ఇస్తే ఆమె మీరు చేసిన ప్రయత్నానికి చాలా గర్వపడుతుంది. అది కూడా మీరు మదర్స్ డే రోజున అలాంటి ప్రయత్నం చేస్తే, తల్లులందరూ ఎంత మంచి అనుభూతి చెందుతారో ఒక్కసారి ఊహించుకోండి. లాక్ డౌన్ కారణంగా ఖరీదైన బహుమతులు కొనే అవకాశం లేకపోయినా, మీరు ఇంట్లో ఉండే ఆమెను ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అమ్మకు ఒక్కరోజేనా? కాదు... ప్రతి రోజూ ఆమెదే.. అందుకే అమ్మను మనసారా హత్తుకునే కోట్స్ ను షేర్ చేయండి..అమ్మకు ఒక్కరోజేనా? కాదు... ప్రతి రోజూ ఆమెదే.. అందుకే అమ్మను మనసారా హత్తుకునే కోట్స్ ను షేర్ చేయండి..

స్వయంగా చాక్లెట్ చేయడం..

స్వయంగా చాక్లెట్ చేయడం..

మీరు మీ అమ్మకు చాక్లెట్ తో పాటు అందమైన గ్రీటింగ్ కార్డు ఇవ్వొచ్చు. అయితే ఈ కార్డులను కొనేందుకు మార్కెట్ కు వెళ్లే అవసరం లేదు. ఈ కార్డులను మీరే తయారు చేసుకోవచ్చు. దానిపై మీ టాలెంట్ ను కూడా చూపొచ్చు. ఈ కార్డులో మీ అమ్మ కోసం ప్రత్యేకమైన కవితలు, ఆకట్టుకునే కోట్స్, సందేశాలను రాయొచ్చు.

కేక్ తయారీ..

కేక్ తయారీ..

లాక్ డౌన్ సమయంలో మీరు ఇప్పటికే కొన్ని రకాల కొత్త వంటకాలను ప్రయత్నించి ఉండొచ్చు. ఇంకా కొత్తవి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అయితే మీరు మదర్స్ డే రోజున కేక్ తయారీ పద్ధతిని ప్రయత్నించండి. మీ సొంత చేతులతో మీ తల్లికి కేక్ తయారు చేయండి.మొదట కొంచెం గజిబిజిగా ఉన్నప్పటికీ, మార్కెట్ కేక్ కంటే తల్లికి మీరు స్వయంగా చేసిన కేకునే ఇష్టపడుతుంది.

కేక్ లేకపోతే..

కేక్ లేకపోతే..

లాక్ డౌన్ కారణంగా చాలా మందికి కేక్ కు సంబంధించిన వస్తువులు అందుబాటులో ఉండటం కష్టమే. కాబట్టి మీ వంటగదిలో ఉన్న వస్తువులతోనే ఏదైనా ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేయండి. అందులో ఒక తియ్యని పదార్థాన్ని కచ్చితంగా సిద్ధం చేయండి. ఈరోజు మీ తల్లికి వంటగది నుండి విశ్రాంతి ఇవ్వండి. మీరే స్వయంగా విందు మరియు భోజనానికి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయండి.

వీడియో చేయండి..

వీడియో చేయండి..

ఈ రోజుల్లో చాలా మందితో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మీ ఫ్యామిలీతో దిగిన ఫొటోలతో కలిపి, ముఖ్యంగా మీ అమ్మతో కలిసి దిగిన ఫొటోలను కలిపి ఒక వీడియో చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆమె కచ్చితంగా ఎమోషనల్ అవుతుంది. ఈ లాక్ డౌన్ లేదా మరే ఇతర కారణాల వల్ల మీరు వారితో లేకపోతే, మీరు ఈ వీడియోలను వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా షేర్ చేసుకోండి.

ఓ మెసెజ్ రాయండి..

ఓ మెసెజ్ రాయండి..

ఒక ప్లాస్టిక్ లేదా గాజు కూజా తీసుకోండి. ఇప్పుడే దాన్ని అందంగా అలంకరించండి. దీని తరువాత, మీరు రంగురంగుల కాగితం తీసుకొని దానిపై చిన్న ప్రేమ సందేశాలను వ్రాసి మడవాలి. తల్లికి ప్రేమ చూపించడం కూడా అంత సులభం కాదు. ఈ సందేశాల ద్వారా, మీరు తల్లిగా ఉండటం ద్వారా మీరు ఎంత అదృష్టవంతులు అయ్యారో ఖచ్చితంగా చెప్పగలరు.

పార్లర్ సెషన్

పార్లర్ సెషన్

వేసవి కాలంలో మీ తల్లికి మీరే పార్లర్ వంటి విశ్రాంతిని ఇవ్వాలి. ఆమె జుట్టుకు నూనె రాయడం ద్వారా హెడ్ మసాజ్ ఇవ్వాలి. మీ చేతులతో ఆమె పాదాలకు చికిత్స చేస్తూ.. ఆమె మసాజ్ ఫీలింగ్ కలిగించండి. దీంతో వారు చాలా రిలాక్స్ గా ఫీలవుతారు.

దూరంగా ఉంటే..

దూరంగా ఉంటే..

మీరు ప్రస్తుతం మీ తల్లికి దూరంగా ఉంటే, మీరు మదర్స్ డేను జరుపుకోలేరు. వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడండి. మీరు ఈ కాల్‌లో మీ కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా చేర్చవచ్చు. మీరు ఒకరితో ఒకరు మాట్లాడటం ద్వారా అందరికీ దగ్గరవుతారు.

FAQ's

English summary

How to Celebrate Mother's Day During The Coronavirus Lockdown

Every year the second Sunday of May is observed as Mother’s Day. Today, we are here with some cool gift ideas to surprise your mother in this lockdown.
Desktop Bottom Promotion