For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోగా బ్యూటీ అనుష్క శెట్టి సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..

|

అనుష్క శెట్టి అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేవి సైజ్ జీరో.. లేడీ డాన్.. యోగా గురు. అంతేకాదు ఆమెకు ఎప్పుడు స్లిమ్ గా ఉండాలో.. ఎప్పుడు ఫ్యాట్ లుక్ లో కనిపించాలో బాగా తెలుసు. తన శరీరానికి తగ్గట్టు హాట్ శారీస్, స్కర్ట్స్ తో పాటు అనేక రకాల రంగు రంగుల దుస్తుల్లో కనిపించి అందరి కంటే తాను ఎందుకు ప్రత్యేకమో నిరూపిస్తుంది. అంతేకాదండోయ్ ఈ యోగా బ్యూటీ ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది.

క్వాలిటీ ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. వీటి వల్లనే ఆమె ఆరోగ్యంగా ఉంటుదట. ఇక తను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ మరియు తేనే తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లు అనుష్కనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలా తనకు సంబంధించిన కొన్ని రహస్యాలను అందరితోనూ పంచుకుంది. నవంబర్ 7వ తేదీన అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆ హీరోయిన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

అనుష్క అసలు పేరు ఏంటంటే..

అనుష్క అసలు పేరు ఏంటంటే..

అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. తన తొలి తెలుగు సినిమా ‘సూపర్‘ సినిమా సెట్స్ లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట. అందుకే ఆమె చాలా పుస్తకాలు, నవలలు చదివిన తర్వాత, ఆమె తనకు అనుష్క శెట్టిగా నామకరణం చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఆ పేరు కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు వేచి ఉన్నట్లు కూడా ఈ పొడుగు కాళ్ల సుందరీ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే తను తల్లిదండ్రులతో మరియు సోదరులతో ఇంగ్లీషులోనే మాట్లాడుతుందట.

యోగా బ్యూటీ చాలా స్మార్ట్..

యోగా బ్యూటీ చాలా స్మార్ట్..

చాలా మంది సెలబ్రెటీలు సింపుల్ గా ఉంటారని తెలుసుకున్న అనుష్క, తాను కూడా వినయంగా మరియు సాఫీగా సాగే జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుందట. ఎంత అందం ఉన్నా ఆమెకు ఎలాంటి గర్వం అనేది ఉండదట. ఆమె వినయ పూర్వకమైన వైఖరి వల్లే ఆమెకు సినిమాల్లో అనేక అవకాశాలు లభించాయి. అందుకే అనుష్క అంటే స్మార్ట్ అని అందరూ అంటుంటారు.

 నటి అవుతానని అస్సలు అనుకోలేదు..

నటి అవుతానని అస్సలు అనుకోలేదు..

ఒక ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పటికీ అనుకోలేదట. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. ఈ కాలేజీలోనే ప్రముఖ నటులు దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేవారు. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ, ఆమె తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేవారు.

 యోగాను వృత్తిగా..

యోగాను వృత్తిగా..

అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత బాగా శిక్షణ పొందిన తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ఆ తర్వాత ముంబైలో యోగా సెషన్లను నిర్వహించేది. యోగా నేర్పించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అది తన జీవితంలో మరపురాని దశ అని ఆమె చెప్పింది. ఈ అందాల భామ వైద్యులు, ఇంజనీర్ల కుటుంబం వచ్చినందున, యోగా కోసం వెళ్లడం సాహసమనే చెప్పాలి. కానీ అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

యోగా క్లాసుల్లో బిజీగా ఉన్న సమయంలో..

యోగా క్లాసుల్లో బిజీగా ఉన్న సమయంలో..

యోగా టీచర్ గా ఆమె చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ మహిళలతో పాటు అనుష్కకు కూడా తెలుగు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఆనాటి నుండి నేటి ‘సైరా‘ వరకు ఆమె తిరుగు లేకుండా దూసుకుపోతుంది.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

జక్కన్న డైరెక్షన్ లో ఛాన్స్ కొట్టిన అనుష్క ఆ తర్వాత వరుసగా విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె నటనకు అందరితోనూ ప్రశంసలు అందుకుంది. అంతేకాదు లేడీ ఓరియెంటేడ్ గా నటించిన ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఎత్తైన నటిగా..

ఎత్తైన నటిగా..

టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు.

ఒత్తిడి తగ్గించుకునేందుకూ..

ఒత్తిడి తగ్గించుకునేందుకూ..

అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేసేదట. అదేంటంటే తనకు అత్యంత ఇష్టమైన, ఆసక్తికరంగా ఉన్న సామెతలను రాసుకుంటుందట. ఎప్పుడైతే ఆమె ఒత్తిడిగా ఫీలవుతుందో అప్పుడు వాటిని చదువుతుందట. అంతే వెంటనే ఆమె రిలాక్స్ మూడ్ లోకి వచ్చేస్తుందట. ఈ ట్రిక్ ఏదో బాగుందీ కదూ. మీరు కూడా ఈ సింపుల్ ట్రిక్ ని ట్రై చేసి చూడండి.

సమయ పాలన..

సమయ పాలన..

అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. అందుకే తను ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటానని చెబుతుంది. రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని ఈ స్విటీ తన సీక్రెట్ ను ఓ ఇంటర్వ్యూలో రివిల్ చేసింది. మీరు కూడా ఈ యోగా బ్యూటీ డైట్ అండ్ టైమింగును ఫాలో అవ్వండి. మీరు అందంగా మరియు ఆరోగ్యంగా తయారవ్వండి.

ఇంగ్లీష్ లో కవితలు..

ఇంగ్లీష్ లో కవితలు..

ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట.

English summary

Happy Birthday Anushka Shetty: Interesing facts about her

Anushka Shetty, the actress who has a solid fan base of her own, needs no introduction. It is a big day for her fans as the talented actress is celebrating her birthday today (November 7).
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more