For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shane Warne:తన స్పిన్ తో షేన్ వార్న్ ప్రపంచ క్రికెట్ నే శాసించాడు...

ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

అతను బంతి పట్టుకున్నాడంటే.. ఎలాంటి బ్యాట్స్ మెన్ అయినా బోల్తా పడాల్సిందే.. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. ఎంత హిట్టర్ అయినా.. తన స్పిన్ మాయాజాలం ముందు తలోంచాల్సిందే.. దాదాపు 15 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్లో తన మణికట్టుతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వారిలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒకరు.

Interesting facts about Australia cricket legend Shane Warne in Telugu

లెగ్ స్పిన్ తో ఆసీస్ కు అన్నివేళలా అద్భుతమైన సేవలందించాడు. కేవలం ఈ ఒక్క క్రికెటర్ వల్లే చాలా మందికి ప్రపంచ కప్ కల కల్లగానే మిగిలిపోయింది. ఆసీస్ ఖాతాలో ఎన్నో విజయాలు దక్కాయంటే అందులో షేన్ వార్న్ పాత్ర కచ్చితంగా ఉండేది.

Interesting facts about Australia cricket legend Shane Warne in Telugu

తన అసాధారణ ప్రతిభతో అనేక అవార్డులను అలవోకగా గెలుచుకున్నారు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఎప్పటికీ చెరిగిపోలేని ముద్ర వేసుకుని.. తనకు ఇష్టమొచ్చినట్టు బతికిన క్రికెటర్లలో ఈ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఒకరు. ఈయన మార్చి 4వ తేదీన శుక్రవారం నాడు హఠాన్మరణం చెందారు. థాయ్ లాండ్లో కోహ్ సమూయ్ లో ఉన్న తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ప్రపంచ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

రూ.కోటి ఆఫర్ ను కాదనుకుంది.. కొత్త కంపెనీ పెట్టింది... సక్సెస్ సాధించింది.. ఇంతకీ తను ఎవరంటే...రూ.కోటి ఆఫర్ ను కాదనుకుంది.. కొత్త కంపెనీ పెట్టింది... సక్సెస్ సాధించింది.. ఇంతకీ తను ఎవరంటే...

ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

షేన్ వార్న్ రిటైర్ అయిన తర్వాత కూడా తనలో టాలెంట్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. అందుకు నిదర్శనమే మన దేశంలో నిర్వహించిన ఐపీఎల్. 2008 సంవత్సరంలో తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తనే కెప్టెన్ గా ఉన్నారు. ఏమాత్రం అనుభవం లేని కుర్రాళ్లతో కలిసి తొలి టైటిల్ సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. తన అనుభవంతో యువ ఆటగాళ్లతో స్ఫూర్తి నింపారు. ప్రతి దశలోనూ అందరినీ ప్రోత్సహించడం.. వారిని విజయ పథంలో నడిపించడం విశేషం.

ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్..

ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్..

ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్ ఎవరంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు షేన్ వార్న్ దే. ఎందుకంటే తను వేసే బంతి, పిచ్ పై పడిన వెంటనే బ్యాట్స్ మెన్ గమనించేలోపే స్టంప్స్ లోపలికి దూసుకెళ్లేది. చాలా సందర్భాల్లో బ్యాటర్లు తాము ఎలా అవుటయ్యామా అని ఆశ్చర్యపోయేవారు. ఏ మాత్రం జీవం లేని పిచ్ ల్లో సైతం తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడు.

స్పిన్ కు కొత్త జీవం..

స్పిన్ కు కొత్త జీవం..

ఒకప్పుడు బౌలింగ్ అంటే కేవలం పేసర్లకే.. స్పిన్నర్లకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. అలాంటి సమయంలో తన మణికట్టుతో స్పిన్ బౌలింగుకు కొత్త జీవం పోసిన వారిలో షేన్ వార్న్ ముందుంటాడు. తన చేతి నుండి ఎప్పుడు లెగ్ బ్రేక్, ఫ్లిప్పర్, జూటర్, స్లయిడర్, టాపీ, బ్యాక్ స్పిన్నర్.. ఇలా ఏ పేరుతో వచ్చినా.. బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టాల్సిందే.

బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...

యాషెస్ లో అద్భుతం..

యాషెస్ లో అద్భుతం..

1993 సంవత్సరంలో జూన్ 4వ తేదీన తొలి యాషెస్ టెస్టు మ్యాచ్ లో షేన్ వార్న్ వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాటర్ గ్యాటింగ్ ను బౌల్డ్ చేసేశాడు. అంతే ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంతే అది క్రికెట్ చరిత్రలో దాన్ని ‘బాల్ ఆఫ్ ద సెంచరీ'గా నిలిచిపోయింది. అలా షేన్ వార్న్ ప్రస్థానం మొదలైంది.

ఒక వికెటే..

ఒక వికెటే..

తొలి టెస్టులో 45 ఓవర్లు వేసినా.. కేవలం ఒక వికెటే దక్కింది. తర్వాతి మ్యాచ్ లో 23 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత స్పిన్ కు అనుకూలమైన లంకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తన తొలి 18 టెస్టులో వార్న్ బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ ఉండేది కాదు. కానీ యాషెస్ సీరిస్ ప్రపంచానికి అసలైన వార్న్ ను పరిచయం చేసింది. అంతే ఆ తర్వాత వార్న్ అస్సలు వెనుదిరిగి చూడలేదు.

వన్డేల్లోనూ అద్భుత ప్రదర్శన..

వన్డేల్లోనూ అద్భుత ప్రదర్శన..

షేన్ వార్న్ కేవలం టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. 1996, 1999 వన్డే వరల్డ్ కప్ సీరిస్ లో తన పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా వెస్టీండిస్ తో జరిగిన సెమీఫైనల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ లలో కూడా తన స్పిన్ తో మాయ చేశాడు. అందుకే తనకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మరియు ‘మ్యాన్ ఆఫ్ ద సీరిస్' కూడా లభించాయి.

చరిత్రలో సగానికి పైగా ప్రపంచాన్ని నాశనం చేసిన భయంకరమైన యుద్ధాలివే...చరిత్రలో సగానికి పైగా ప్రపంచాన్ని నాశనం చేసిన భయంకరమైన యుద్ధాలివే...

కొన్ని వివాదాలు..

కొన్ని వివాదాలు..

షేన్ వార్న్ క్రికెట్ జీవింతో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. పిచ్ గురించి నివేదికలను అందజేసి డబ్బులు తీసుకోవడం, లంకేయులపై తీవ్రమైన కామెంట్లు చేసి రెండు మ్యాచుల సస్పెన్షన్ కు గురయ్యాడు. అంతేకాదు 2003 వరల్డ్ కప్ కు ముందు నిషేధిత కెమికల్స్ ను వాడి డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో ఏడాది పాటు సస్పెండ్ కు గురయ్యాడు.

పర్సనల్ లైఫ్ లోనూ గొడవలు..

పర్సనల్ లైఫ్ లోనూ గొడవలు..

ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో కూడా సామ్యూల్ తో గొడవ పడి మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అంతేకాదు తన వ్యక్తిగత జీవితంలోనూ అనేక వివాదాలతో సావాసం చేశాడు. ఇతర అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్ లు పంపడం, పంపకూడని ఫొటోలను చూపించి వంటివి చేయడంతో తన ఫ్యామిలీకి చాలా నష్టం చేకూరింది. పదేళ్ల మ్యారేజ్ లైఫ్ తర్వాత తన భార్య సిమోన్ తో 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బ్రిటీష్ యాక్టర్ ఎలిజిబెత్ హార్లీతో వివాహానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి కారణాల వల్లే ఆసీస్ టీమ్ కు కెప్టెన్ కాలేకపోయాడు.

FAQ's
  • ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఎప్పుడు మరణించారు?

    దాదాపు 15 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్లో తన మణికట్టుతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వారిలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒకరు. ఈయన మార్చి 4వ తేదీన శుక్రవారం నాడు హఠాన్మరణం చెందారు.ఆసీస్ ఖాతాలో ఎన్నో విజయాలు దక్కాయంటే అందులో షేన్ వార్న్ పాత్ర కచ్చితంగా ఉండేది. తన అసాధారణ ప్రతిభతో అనేక అవార్డులను అలవోకగా గెలుచుకున్నారు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఎప్పటికీ చెరిగిపోలేని ముద్ర వేసుకుని.. తనకు ఇష్టమొచ్చినట్టు బతికిన క్రికెటర్లలో ఈ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఒకరు.

English summary

Interesting facts about Australia cricket legend Shane Warne in Telugu

Here we are talking about the interesting facts about australia cricket legend shane warne in Telugu. Have a look
Desktop Bottom Promotion