For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి : స్వాతంత్య్ర సమరయోధుడి గురించి ఆసక్తికరమైన విషయాలివే...

|

''ఇప్పటికీ మీ రక్తం మరగకపోతే.. అది మీ సిరల్లో ప్రహించే నీరు'' అనే అద్భుతమైన కోట్ ను చంద్రశేఖర్ ఆజాద్ రాశారు. విప్లవాత్మక నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు.. దేశం గర్వించదగ్గ మహాపురుషుల్లో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఒకరు. 1906లో జులై 23వ తేదీన మధ్యప్రదేశ్ లోని భాబ్ర అనే చిన్న గ్రామంలో జన్మించారు.

ఎంతో ధైర్యసాహసాలు కలిగిన ఈ నాయకుడు జలియన్ వాలాబాగ్ సమయంలో తీవ్రంగా స్పందించాడు. 15 సంవత్సరాల వయసులోనే మహాత్మగాంధీ ప్రేరణతో 1920లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అయితే ఈ వీరుడు దేశం కోసం 1931, జులై 27న తన ప్రాణాలను అర్పించాడు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 24 ఏళ్లే. ఈరోజు ఆయన వర్థంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం...

ఆజాద్ తల్లిదండ్రులు..

జాగ్రణి దేవి, సీతారాం తివారీ దంపతులకు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. 1921లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లాడు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. అంతేకాదు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అప్పుడు తన పేరు ఆజాద్ అని పరిచయం చేసుకున్నాడు. హిందీలో ఆజాద్ అంటే స్వతంత్రత అని అర్థం.

హిందూస్థాన్ రిపబ్లికన్ స్థాపన..

ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసొసియేషన్ లో చేరతారు. అనంతరం ఆజాద్ 1925లో కకోరి రైలు దోపిడీలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ దోపీడి ఉద్దేశ్యేమిటంటే ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచివెళ్లాలని. అలాగే విప్లవాత్మక కార్యకలాపాలలో ఉపయోగించే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు చంద్రశేఖర్ ఆజాద్ తన దళంతో కలిసి ఈ పనులు చేసేవారట.

బ్రిటీష్ అధికారిని..

1927లో లాలా లజ్ పతి రాయ్, స్వాతంత్య్ర సమరయోధుడు మరణించిన తర్వాత, అందుకు ప్రతీకారంగా చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటీష్ పోలీస్ అధికారి జెపి సాండర్స్ ను కాల్చి చంపాడు.

రైలు దోపీడి తర్వాత..

కకోరి రైలు దోపిడీ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వ అధికారులు రోషన్ సింగ్; అష్పకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి వంటి స్వాతంత్య్ర సమరయోధులను అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. అయితే చంద్రశేఖర్ ఆజాద్ ను పట్టుకోవడంలో విఫలమ్యారు. అనంతరం ఈయన భగత్ సింగ్ మరియు ఇతర విప్లవ నాయకులతో కలిసి హెచ్ ఆర్ ఏను మళ్లీ పునర్వ్యవస్థీకరిస్తారు.

పోలీసులకు శపథం..

అంతేకాదు చంద్రశేఖర్ ఆజాద్ పోలీసుల అధికారులకు ఎప్పటికీ సజీవంగా పట్టుబడనని శపథం సైతం చేశాడు. ఒకసారి ప్రస్తుత ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) లో ఓ పోరాటంలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు మార్గం లేకపోవడంతో తన తుపాకీలోని బుల్లెట్ తో తనను తాను కాల్చుకున్నాడు.

ఆజాద్ పార్కుగా మార్పు..

ఆ స్వాతంత్య్ర సమరయోధుడు మరణించినందుకు, ఆయనకు నివాళిగా చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా మార్చారు. ప్రస్తుతం మన దేశంలో చంద్రశేఖర్ ఆజాద్ పేరిట చాలా వీధులు, బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. ''మేము శత్రువుల బుల్లెట్లను ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము చాలా స్వేచ్ఛగా ఉంటా'' అని అన్నాడు.

English summary

Interesting Facts about Chandra Shekar Azad

Chandrashekhar Azad, the famous freedom fighter widely praised for sacrificing his life during the freedom struggle of India, died on 27 February 1931. On his death anniversary, we are here with some facts about the brave hero of India.
Story first published: Thursday, February 27, 2020, 14:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more