For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mahashay Dharampal Gulati : ‘మసాలా రాజు’ కథ గురించి తెలుసా...

మసాల రాజు గురించి మనం నమ్మలేని నిజాలేంటో తెలుసా.

|

ప్రముఖ దిగ్గజ మసాలా సంస్థ మహాశయా డి హట్టి (MDH) అధినేత మహాశయా ధరమ్ పాల్ జీ గురువారం నాడు కన్నుమూశారు. ధరమ్ పాల్ గులాటి 98 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచి మన లోకం నుండి వదిలి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ రాగా.. దాని నుండి అతను కోలుకున్నాడు.

Interesting Facts about MHD Owner Mahashay Dharampal Gulati in Telugu

అయితే గురువారం ఉదయం గులాటికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, దీంతో ఆయన మరణించారని తెలుస్తోంది. గత సంవత్సరమే ఆయనకు ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఆయన మరణంపై దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'మసాలా రాజు'గా పేరు తెచ్చుకున్న ఆ గొప్ప వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

విభజన తర్వాత..

విభజన తర్వాత..

కొన్నేళ్లుగా మహారాష్ట్ర ధరమ్ పాల్ గులాటి ఎండిహెచ్ మసాలా దినుసుల ప్రకటనలలో కనిపించేవారు. ఈయన తండ్రి ధరమ్ పాల్ గులాటి 1922లో పాకిస్థాన్ లోని సియాల్ కోట్ లోని ఒక చిన్న దుకాణంతో ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే భారతదేశం, పాకిస్థాన్ విడిపోయిన తర్వాత, అతని కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. 1919లో పాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో జన్మించిన ధరమ్ పాల్ గులాటి 1947లో విభజన తర్వాత భారతదేశానికి వచ్చారు. అతని తండ్రి ఎండిహెచ్ వ్యవస్థాపకుడు మహశయా చున్నీలాల్ గులాటి. వీరి కుటుంబం అమ్రుత్ సర్ లోని శరణార్థుల శిబిరంలో కొంత సమయం గడిపింది. తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ధరమ్ పాల్ గులాటి తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు, అతని వద్ద కేవలం రూ.1500 రూపాయలు మాత్రమే ఉన్నాయని సమాచారం.

వ్యాపారం పెరుగుతూ..

వ్యాపారం పెరుగుతూ..

1959 నాటికి, మహశయ్ ధరమ్ పాల్ ఢిల్లీలోని చాందిని చౌక్ మరియు కరోల్ బాగ్లలో రెండు మూడు దుకాణాలను ప్రారంభించారు. 1959లో గులాటి కీర్తి నగర్లో మహశయన్ డి హట్టి యొక్క తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి తన వ్యాపారం పెరుగుతూ వచ్చింది. క్రమంగా, ధర్మపాల గులాటి యొక్క సుగంధ ద్రవ్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు, ప్రజలు వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం ప్రారంభించారు. 2017 సంవత్సరంలో, అతను భారతదేశంలో ఏ ఎఫ్ఎంసిజి కంపెనీకి అత్యధిక పారితోషకం తీసుకునే సిఇఒగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈయన ఎంతవరకు చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈయన కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.

1953లో అద్దె దుకాణం..

1953లో అద్దె దుకాణం..

ఢిల్లీ చేరుకున్న గులాటి కుటుంబ పోషణ కోసం ఒక ధంగాను మహశయా ధరమ్ పాల్ గులాటి కొనుగోలు చేశారు. అతను కన్నాట్ ప్లేస్ మరియు ఢిల్లీలోని కరోల్ బాగ్ మధ్య నడిచేవారు. ఆ తర్వాత 1953లో టాంగా అమ్మడం ద్వారా చాందినిచౌక్ లో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ దుకాణానికి మహాశయ డి హట్టి (MDH) అని పేరు పెట్టారు. ఇక్కడే వారి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభమైంది. ఢిల్లీలోని కరోల్ బాగ్ లో చాందిని చౌక్ లో అజ్మన్ ఖాన్ రోడ్డులో మసాల దుకాణాన్ని ప్రారంభించారు.

90 శాతం విరాళంగా..

90 శాతం విరాళంగా..

గులాటి సంస్థ బ్రిటన్, యూరప్, కెనడాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు భారతీయ సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తోంది. ఈ సంస్థ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో భారత ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పౌర గౌరవమైన పద్మభూషణ్ తో సత్కరించింది. MDH చెప్పిన కథనం ప్రకారం, ధరమ్ పాల్ గులాటి తన జీవితంలో 90 శాతం విరాళంగా ఇచ్చేవాడు.

English summary

Interesting Facts about MHD Owner Mahashay Dharampal Gulati in Telugu

Here we talking about the interesting facts about mhd owner mahashay dharampal gulati in Telugu. Read on.
Story first published:Thursday, December 3, 2020, 13:57 [IST]
Desktop Bottom Promotion