Just In
- 4 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- 6 hrs ago
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- 14 hrs ago
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- 15 hrs ago
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
Don't Miss
- Finance
పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్: ఆన్లైన్లో డబ్బులు ఇలా జమ చేయండి
- News
రామతీర్థం చుట్టూ మరో వివాదం: జగన్ సర్కార్‌పై విమర్శలకు టీడీపీ మళ్లీ అవకాశం దొరికినట్టే
- Sports
Gabba Test: సుందర్, శార్దుల్ రికార్డు భాగస్వామ్యం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 253/6
- Movies
వదిన మాట వింటాడా..? అఖిల్ కోసం భారీ ప్లాన్ సెట్ చేసిన సమంత
- Automobiles
ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రతన్ టాటా బర్త్ డే స్పెషల్ : ఆఫర్ వదులుకున్నాడు.. అవకాశం ఇవ్వాలనుకున్నాడు..
భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి.. నిరాడంబరతకు మారు పేరు.. జంతువులంటే చచ్చేంత ప్రేమ.. ఒత్తిడిని అవలీలగా అధిగమించడం.. క్లిష్ట సమయాల్లో 'కీ'లక పాత్ర పోషించడం వంటి పాత్రలు పోషించడం వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే దక్కుతుంది. ఏదైనా కంపెనీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా... నష్టాల్లో ఉన్నా.. ఆయన అడుగు పెడితే చాలు అవి అన్నీ లాభాల పట్టాల్సిందే.
అది ఆయన గొప్పతనం. అంతేకాదు తమ కంపెనీ నుండి వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం ధానధర్మాలు చేయడం ఆయన స్వభావం. ఇప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉంటూ సింపుల్ గా ఉండే రతన్ టాటా గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలియజేస్తున్నాం...

తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన టాటా..
రతన్ నావల్ టాటా చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సూని టాటా రతన్ కు ఏడు సంవత్సరాలు ఉన్న సమయంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషేడ్ జీ టాటాను దత్తత తీసుకున్నారు. అప్పటినుండి రతన్ తన అమ్మమ్మ నవాజీబాయ్ వద్ద పెరిగారు.

ఆ ఆఫర్ ను వదులుకొని..
రతన్ టాటా యుఎస్ లోని కార్నెల్ యూనివర్సిటీలో బిఎస్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. అలాగే హర్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంటు కోర్సును కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఆయనకు ఐబిఎం సంస్థ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఎంతో మంది ఆ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. టాటా మాత్రం తిరిగి భారత్ కు వచ్చాడు. అంతేకాదు టాటా గ్రూపులో చేరాడు.

నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి..
1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కు డైరెక్టర్ నియమితులయ్యారు. అప్పటికే ఆ సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. కానీ రతన్ టాటా ఆ కంపెనీ దశనే మార్చేశారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్లో 25 శాతం వాటా దక్కించుకుని లాభాల బాట పట్టింది.

టాటా గ్రూప్ వారసుడిగా..
ఆ తర్వాత 1981లో టాటా గ్రూప్ వారసుడిగా రతన్ పేరును జెఆర్ డి టాటా ప్రకటించారు. అయితే ఆయన వయసు చాలా తక్కువగా ఉండటం.. ఆయనకు అంత పెద్ద బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. అయినా అవేవీ లెక్క చేయకుండా రతన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కంపెనీనీ ఎంతో విస్తరింపజేశారు. అలా ఆయన రిటైర్ అయ్యేసరికి టాటా గ్రూపు లాభాలు 50 రెట్లు పెరిగాయి.

కార్ల విభాగంలో కొన్ని కష్టాలు..
1998లో కార్ల పరిశ్రమలోకి టాటా కంపెనీ అడుగుపెట్టింది. అయితే తొలుత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇండికా కారు అందరిని ఆకట్టుకోలేకపోయింది. అంతే కాదు ఆ కంపెనీని ఫోర్డుకు అమ్మేద్దామనుకున్నారు. అయితే వారితో జరిగిన మీటింగులో ఆయన మనసు కొంచెం నొచ్చుకుంది. దీంతో తిరిగి మళ్లీ దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

స్వల్ప మార్పులతో..
మళ్లీ ఇండికా కార్లను స్వల్పమార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో టాటా కంపెనీ వెనుదిరిగి చూడలేదు. సఫారీ, సుమో వాహనాలు కూడా మార్కెట్లో టాటాను నిలబెట్టాయి. మరోవైపు జాగ్వర్, ల్యాండ్ రోవర్ ను కొన్న ఫోర్డు వాటిని నిర్వహించలేక 2008లో టాటా గ్రూపుకే విక్రకయించింది.

ధానధర్మాలు అధికమే..
రతన్ టాటా ఎంత నిరాండంబరగా జీవిస్తారంటే.. ఆయన సాధించిన లాభాల్లో దాదాపు 65 శాతం టాటా ట్రస్టులకే విరాళం ఇచ్చేస్తారు. అలాగే ఆయన విమానాల్లో కూడా బిజినెస్ క్లాసులోనే ప్రయాణిస్తారు.

పాకిస్థాన్ ను పక్కనపెట్టేశారు..
రతన్ టాటాకు దేశ భక్తి చాలా ఎక్కువే. 2011లో ముంబైలో తాజ్ హోటల్ పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దానిని బాగు చేయించేందుకు టెండర్లు పిలిచారు. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన వారికి అపాయిట్ మెంట్ ఇవ్వాలని కోరగా, వారిని అక్కడి నుండే తిట్టి పంపిచేశాడు. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం సుమోల కోసం పెట్టిన ఆర్డర్ ను సైతం పక్కన పెట్టేశారు. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేసేది లేదని తేల్చి చెప్పేశారు.

యువతకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం...
రతన్ టాటా యువతను కూడా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. తాను టాటా కంపెనీల నుండి వైదొలిగినా కూడా తన వద్ద ఉన్న సంపదతో వివిధ స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడి పెడుతూ యువతను ప్రోత్సహిస్తాడు. ఇటీవలే ఓ కుర్రాడిని తన అసిస్టెంటుగా కూడా నియమించుకున్నాడు. ఆ కుర్రాడు చేసిన చిన్నపని తనను అంతలా మెప్పించింది అని తానే స్వయంగా చెప్పాడు.

రతన్ టాటాకు అనేక అవార్డులు..
రతన్ టాటాకు మన దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. యూకే గవర్నమెంట్ కూడా టాటాకు గౌరవ నైట్ హుడ్ ను ఆయనకు బహుమానంగా ఇచ్చింది. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటానే.