For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీల కంటే పురుషులే అబద్ధాలు ఎక్కువగా చెబుతారట... ఎన్నిసార్లో తెలిస్తే షాకవుతారు...!

మగవారి గురించి కొన్ని ఫన్నీ విషయాలను తెలుసుకుందాం.

|

ఈ భూలోకంలో అమ్మాయిలను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమని.. అది అంత సాధారణమైన విషయం కాదని అందరూ నమ్ముతారు. అయితే పురుషులలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయట.

Interesting fun facts about men in telugu

ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. అందుకే వారి స్వభావం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే కొందరు అబ్బాయిలు కూడా చాలా భిన్నంగా ప్రవర్తిస్తారట.

Interesting fun facts about men in telugu

ముఖ్యంగా అమ్మాయిలను ముగ్గులోకి పడేయడంలో.. వారిని పొగడ్తలతో ముంచెత్తడంతో కొందరు పురుషులు అందవేసిన చెయ్యిగా వ్యవహరిస్తారట. ఈ సందర్భంగా మగవారి గురించి కొన్ని వాస్తవాలను మేము మీకు చెబుతాం.. ఎందుకంటే ఆ విషయాలు కూడా మీకు కూడా తెలియకపోవచ్చు...

స్త్రీల తొలి ప్రాధాన్యత..

స్త్రీల తొలి ప్రాధాన్యత..

చాలా మంది అమ్మాయిలకు ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. అబ్బాయిలు ఎక్కువగా సన్నగా ఉండే అమ్మాయిలను ఇష్టపడరని అనుకుంటారు. కానీ ఈ విషయం గురించి కెనడా విశ్వవిద్యాలయానికి చెందిన బ్లాంకా ఒర్టెగా-రోల్డాన్ ఒలివా అధ్యయనం చేశారు. వారి పరిశోధనలో పురుషులు ఆరోగ్యంగా కనిపించే సన్నని స్త్రీలను ఇష్టపడతారని నిరూపించారు. ఉదాహరణకు ఎవరైనా అమ్మాయి ఆరోగ్యకరమైన బరువు ఉంటే, వారిని ఎక్కువగా ఇష్టపడతారట. అయితే జీరో సైజ్ లేదా తక్కువ బరువు ఉండే అమ్మాయిలను చాలా అరుదుగా ఇష్టపడతారట.

చాలా సందర్భాలలో..

చాలా సందర్భాలలో..

ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయి పట్ల ఆసక్తి ఉంటే, తను ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు అనుకోకుండా రకరకాల కోణాల్లో ప్రయత్నిస్తాడట. ముఖ్యంగా ఆమెను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడట. సాధారణంగా తన ప్యాంట్ బెల్ట్ మీద బొటనవేలిని ఉంచి స్టైల్ గా నిలబడటానికి ప్రయత్నించి.. వింతగా ప్రవర్తిస్తాడట. అయితే ఇది చాలా సందర్భాలలో జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో వివరించడం కొంచెం కష్టమని ఆ టీమ్ సభ్యులు తెలిపారు.

వివిధ మార్గాలు..

వివిధ మార్గాలు..

సాధారణంగా అమ్మాయిని అబ్బాయి ఇంప్రెస్ చేయాలన్నా.. అబ్బాయిని ఎవరైనా అమ్మాయి ఆకట్టుకోవాలన్నా.. ఇద్దరూ విభిన్న మార్గాలను ఎంచుకుంటారని మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా సందర్భాల్లో అమ్మాయిలు ఒంటరిగా కూర్చుని ఉంటే.. పురుషులు వారు ఉండే చోటుకు ఏదైనా గిఫ్టులు లేదా వస్తువులను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అయితే దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ ఇది స్త్రీ, పురుషుల దుస్తుల వల్ల జరిగిందని నమ్ముతారు.

ఎక్కువగా తింటారు..

ఎక్కువగా తింటారు..

వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు. ఇది వాస్తవమని ఆ పరిశోధన వివరించింది. ఒక పురుషుడు స్త్రీతో కలిసి భోజనం లేదా విందు చేస్తున్నప్పుడు సాధారణ ఆకలి కంటే కొంచెం ఎక్కువగా తింటారట. కార్నెల్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కెవిన్ నిఫిన్ తన పరిశోధనలో ఈ విషయం గురించి తెలుసుకున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, అమ్మాయిలను ఆకట్టుకునేందుకు పురుషులు ఇలా చేస్తారు. ఇది కొంచెం వెర్రితనంగా అనిపించొచ్చు. కానీ ఇది నిజమంటున్నారు.

అబద్ధాలు ఎక్కువగా..

అబద్ధాలు ఎక్కువగా..

సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు మాట్లాడుతారని చాలా మంది భావిస్తారు. అంతేకాదు ‘అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారని.. అందుకే నిజం చెప్పకుండా అబద్ధాలు ఎక్కువగా చెబుతారు' అనే డైలాగులు కొన్ని సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం. అయితే ఇది వాస్తవానికి పూర్తి విరుద్ధం. ఎందుకంటే 20వ శతాబ్దంలో ఫాక్స్ హోమ్ ఎంటర్ టైన్మెంట్ నిర్వహించిన 2009 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం, సగటు మనిషి తన సహచరులు, యజమాని లేదా భాగస్వామికి రోజుకు ఆరుసార్లు అబద్ధం చెప్పగా.. మహిళలు మూడు సార్లు మాత్రమే అబద్ధం చెప్తారట. దీని ప్రకారం, అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా అబద్ధాలు చెబుతారు.

English summary

Interesting fun facts about men in telugu

Here are the Interesting Fun Facts About Men in Telugu. Read on.
Story first published:Monday, November 30, 2020, 15:22 [IST]
Desktop Bottom Promotion