For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : కరోనా దెబ్బకు కుటుంబాలన్నీ కలసిపోతాయా?

కుటంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

|

ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా చిన్నా, పెద్ద, ముసలి ముతకలతో అంతా కలిసి ఉండేవారు. ఒకప్పుడు ఇలాంటి మంచి కుటుంబాలు చాలా ఎక్కువగా కనిపించేవి. ఈర్ష్య, ఈసడింపులు, విరబూసిన మమతలు.. కలబోసిన మనసులు.. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా.. మచ్చలేని మనషుల కారణంగా కుటుంబసభ్యులంతా కలిసిమెలసి జీవించేవారు.

International day of families date, history and significance

అయితే ఇలాంటి చక్కటి కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలే చిచ్చు పెట్టాయి. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలన్నీ ముక్కలైపోయిన విషయం వాస్తవమే. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా కాల పరీక్షలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. కొందరికి ఇల్లు ఒక పాఠశాల.. అణువణువు అనుభూతి పొందే ఓ కోవెల.. వాకిట్లో నిల్చొని చూసే ఇంధ్రదనస్సు రంగులు.. నట్టింట్లో కలిసుంటే నవ్వుల వైభోగాలు.. సకుటుంబ సపరివార సమేతంగా మనముంటే చింతలన్నీ చిన్నబోవాల్సిందే... కష్టాల కడలిని అవలీలగా ఈదోచ్చు..

International day of families date, history and significance

అరుగులపై అందరూ కలిసి కథల్ని, కలల్ని, మాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావి కన్యల్ని, ఆడపిల్లల గురించి అన్ని వివరాలు చెప్పేదే కుటుంబం. మన సాంప్రదాయ భారతీయ సమాజానికి పటిష్టతనూ దృఢత్వాన్నీ అందిస్తున్న శక్తి.. శతాబ్దాలుగా మనందర్నీ కలిసికట్టుగా ఉంచిన ఒక శక్తివంతమైన బంధం.. మన సుసంపన్నమైన సామాజిక యవనికను వైవిధ్యంగా మార్చి ఒక సమగ్ర రూపంగా మార్చేదే కుటుంబ వ్యవస్థ.

International day of families date, history and significance

అలాంటి కుటంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం మే 15వ తేదీన జరుపుకునే ఈ దినోత్సవాన్ని 1994 నుండి ప్రతి ఏడాది మే 15వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది.. ఎవరు దీన్ని ఆమోదించారు అనే ఆసక్తికరమైనవిషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబ ప్రాముఖ్యత..

కుటుంబ ప్రాముఖ్యత..

మన బాధతలను తగ్గించడానికి, భయాలను అధిగమించడానికి కుటుంబం ఒక మూలస్తంభంలా సహకరిస్తుంది. కుటుంబం మన ఆనందాల, దు:ఖాల భాగం. యుఎన్ జనరల్ అసెంబ్లీలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి 1993లో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. నిర్మలమైన అత్యంత ముఖ్యమైన అంశం. కుటుంబ వ్యవస్థలో ఉన్న అడ్డంకులను పరిష్కరించుకోవాలి.

బాధలను తగ్గించేందుకు..

బాధలను తగ్గించేందుకు..

1995లో బీజింగ్, కోపెన్ హాగన్ సమావేశాల్లో కుటుంబ ప్రాముఖ్యతను గురించి.. దాని పాత్ర గురించి వక్కాణించి చెప్పాయి. వ్యక్తుల శ్రేయస్సు కోసం కుటుంబం అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రపంచదేశాలన్నీ అంగీకరించాయి. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వంటి ఆపద సమయంలో కుటుంబ ఆసరా, ప్రాముఖ్యతను గూర్చి దేశాలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి.

కుటుంబానికి ప్రాధాన్యత..

కుటుంబానికి ప్రాధాన్యత..

ప్రస్తుత సమాజంలో కరోనా వంటి మహమ్మారి కారణంగా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. సైకాలజిస్టులు, ఫిలాసఫర్ల ప్రకారం ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమని చెబుతున్నారు. కుటుంబం కారణంగా జీవితంలో చాలా మార్పులు జరుగుతుతాయి. అయితే మన సంబంధాలలో ఎలాంటి ప్రతికూలతలు ఉండవంటున్నారు.

కుటుంబ దినోత్సవ వేడుకలు..

కుటుంబ దినోత్సవ వేడుకలు..

మన దేశంలో ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. వివిధ సంస్థలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటాయి. అయితే ఈ సందర్భంగా వీరి ముందు కొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి. కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచడం, కంపెనీలు తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కంపెనీ యొక్క సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, సంస్థలోని ఇతర వ్యక్తులతో బంధాలను ఏర్పరచటానికి అనుమతిస్తుంది. ఇలాంటి సమయంలోనే కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కూడా నిర్వహిస్తారు.

గొప్ప అవకాశం..

గొప్ప అవకాశం..

సమాజంలోని ఏ వర్గానికి చెందిన వారైనా తమ కుటుంబాలతో బలమైన సంబంధాన్ని పెంచుకుంటారు. వాస్తవానికి చాలా మంది భారతీయులు ఇప్పటికీ పిత్రుస్వామ్య జీవితం ఆధారంగా ఉమ్మడి కుటుంబంలోనే నివసిస్తున్నారు. భారతీయ సమాజంలో కుటుంబాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అవగాహన అనేది చాలా అవసరం. ఇది ఒక గొప్ప అవకాశంగా నిరూపించబడింది.

ఎలా జరుపుకుంటారంటే..

ఎలా జరుపుకుంటారంటే..

తీపి తీపి దరహాసాలూ.. చేదు చేదు పరిహాసాలు.. పులుపు పులుపు పులపాఠాలు.. వగరు వగరు గుణపాఠాలు.. ఇలాంటి రుచులన్నీ కలిసి మీ కుటుంబంతో గడపడానికి ఒక గొప్ప రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటలు, ఆటల పోటీలు, మరెన్నో కార్యక్రమాలతో ఈరోజు కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించవచ్చు. ఏవైనా కుుటంబ సమస్యల గురించి కూడా మాట్లాడమని చెప్పొచ్చు. అప్పుడు అందరూ వాటికి పరిష్కారం కూడా సూచించవచ్చు.

మధుర క్షణాలను గుర్తు చేసుకోవడానికి..

మధుర క్షణాలను గుర్తు చేసుకోవడానికి..

ఈ రోజున ఆనాడు అందరం కలిసిన మధుర క్షణాలను గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు కుుటంబ సభ్యులతో కలిసి ఒక ఫొటో షూట్ ప్లాన్ చేయండి. మీ చుట్టుపక్కల వారితో, ఇతర కుటుంబాలతో కలిసి సామాజిక దూరం పాటిస్తూ కరోనాపై అవగాహన కల్పించేందుకు మీరే ముందడుగు వేయండి.

వసుదైక కుటుంబం..

వసుదైక కుటుంబం..

మనం వేల ఏళ్ల క్రితం నుంచి చెబుతన్నదే. నేటి ఆధునిక ప్రపంచం ‘కుటుంబం‘ విలువేమిటో కరోనా కారణంగా మరోసారి ఇప్పుడిప్పుడే అందరికీ బోధపడుతూ ఉంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే మన దేశంలో అల్లుకున్న కుటుంబ బంధం అంత సులువుగా తెగిపోయేది కాదు. కొన్నేళ్ల క్రితం ‘చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం‘ అన్న ప్రకటన జనాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ పరిస్థితిలో మార్పులొస్తున్నాయి. చాలా మంది ఉమ్మడి కుటుంబం గురించి అనుభవంలో తెలుసుకుంటున్నారు. అందుకే కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి నడుం బిగించింది.

స్వర్గ ధామంగా మార్చుకుందాం..

స్వర్గ ధామంగా మార్చుకుందాం..

అనాది నుంచీ మన తాత్విక ద్రుక్పథమైన వసుదైక కుటుంబంలో మానవత్వం, ఆర్ర్దత, విశాలమైన మనసు, సహనం మొదలైన భావాల స్ఫూర్తి ఉంది. ఈ స్ఫూర్తితోనే ఈ శతాబ్దిలో మనం ప్రపంచాన్ని శాశ్వతంగా మనం జీవించే ఒక అత్యుత్తమ స్వర్గధామంగా మార్చుకుందాం.

English summary

International day of Families 2020 date, history and significance

Here we taking International day of families date, history and significance. Read on
Desktop Bottom Promotion