For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ పురుషుల వారోత్సవం 2019 : మగవారు కన్నీళ్లు కార్చడంలో ఎలాంటి తప్పు లేదన్న సచిన్

ఒక పురుషుడు తండ్రిగా, భర్తగా, మంచి స్నేహితుడిగా, సోదరుడు వంటి పాత్రలతో పాటు అనేక ఇతర పాత్రల్లో పురుషుడు కీలకంగా వ్యవహరిస్తారు.

|

ఇటీవల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ముగిసింది. ఇప్పుడు అంతర్జాతీయ పురుషుల వారోత్సవం 2019 కూడా ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్, భారత క్రికెట్ దేవుడు అని పిలువబడే సచిన్ టెండూల్కర్ మగవారి కోసం ఒక బహిరంగ లేఖను రాశాడు. ఈ లేఖ 2013 నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ రిటైర్ మెంటును సూచిస్తోంది.

Sachin Tendulkar

ఈ ప్రపంచంలో మగవారు కూడా కన్నీళ్లను బయటపెట్టడంలో ఎలాంటి తప్పు లేదని.. తన జీవితంలో బహిరంగ లేఖ రాయడం ఇదే మొదటిసారి అని రాసుకొచ్చాడు. పురుషులు ఎలాంటి భావోద్వేగాలను అయినా నిస్సందేహంగా బహిరంగంగా వ్యక్తపరచాలని సూచించాడు. సచిన్ రమేష్ రాసిన ఆ లేఖలో ఇంకా ఏయే వివరాలు ఉన్నాయో మీరే చూడండి...

అనేక పాత్రల్లో పురుషులు..

అనేక పాత్రల్లో పురుషులు..

ఒక పురుషుడు తండ్రిగా, భర్తగా, మంచి స్నేహితుడిగా, సోదరుడు వంటి పాత్రలతో పాటు అనేక ఇతర పాత్రల్లో పురుషుడు కీలకంగా వ్యవహరిస్తారు. ఇందు కోసం చాలా ధైర్యం కావాలి. వారు ధైర్యంగా ఉంటేనే కఠినమైన జీవితంలోనూ నిలదొక్కుకుంటారు. ‘‘మీరు త్వరలో తల్లిదండ్రులు మరియు భర్తలు అవుతారు. సోదరులు మరియు స్నేహితులుగా ఉంటారు. సలహాదారులు మరియు టీచర్లుగా కూడా బతుకుబండిని నడిపించబోతున్నారు. ఇందుకోసం మీరు ధైర్యంగా, శక్తివంతంగా ఉండబోతున్నారు. కానీ ధైర్యవంతులకు కూడా భయం, సందేహాలు ఉంటాయి. అందుకే మీరు కూడా వాటిని అనుభవించండి‘‘. అన్నాడు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2019 : ఈ చిట్కాలు పాటిస్తే పురుషులు ప్రత్యేకంగా ఫీలవుతారని తెలుసా..!అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2019 : ఈ చిట్కాలు పాటిస్తే పురుషులు ప్రత్యేకంగా ఫీలవుతారని తెలుసా..!

విఫలమైన సమయాలు..

‘‘పురుషులకు కూడా ఇతరుల లాగా విఫలమైన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు మీకు పెద్దగా ఏడవాలనిపిస్తుంది. కానీ ఏడవలేరు. పంటి బిగువన బాధను భరిస్తూ కన్నీళ్లను దాచుకుంటు ఉంటారు. బయటకు మాత్రం కవరింగ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎందుకంటే కన్నీళ్లు మగవారిని బలహీనులను చేస్తుందని నమ్మాం. అదే నిజమని నేను కూడా అనుకున్నాను‘‘.

నా బాధలు, కష్టాలే..

నా బాధలు, కష్టాలే..

‘‘ కానీ అది తప్పు అని తెలుసుకున్నాను. అందుకే ఈ లేఖను రాస్తున్నాను. నా కష్టాలు, ఒత్తిడి, బాధలే నన్ను ఇంతటి వాడిని చేశాయి. నన్ను మెరుగైన వ్యక్తిగా మార్చాయి.‘‘ అని సచిన్ పేర్కొన్నాడు.

కన్నీరు కారిస్తే తప్పే కాదు..

కన్నీరు కారిస్తే తప్పే కాదు..

‘‘మనం మన బాధను అందరి ముందు ప్రదర్శించాలంటే అందుకు చాలా ధైర్యం కావాలి. ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తున్నట్టే మనం కూడా కష్టాల నుండి శక్తివంతులుగా మారిపోతాం. అందుకే ఇలాంటి అపోహాల నుండి బయటపడండి. కన్నీరు వస్తే బయటపెట్టేయండి. భావోద్వేగాలను నిస్సందేహంగా వ్యక్తపరచండి. ఏడుపు వచ్చినప్పుడు కన్నీరు కార్చడంలో ఎలాంటి తప్పు లేదు‘‘ అని సచిన్ సూచించాడు.

తన పదవీ విరమణ గురించి..

తన పదవీ విరమణ గురించి..

ఈ సందర్భంగా తన పదవీ విరమణ గుర్తు చేసుకున్నాడు. తను ఆరోజు చాలా ఉద్వేగానికి లోనయిన విషయం గురించి వెల్లడించాడు. ‘‘ఆరోజు మైదానంలో విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచించాను. చివరి సారిగా అవుటైన నేను పెవిలియన్ బాటిన పట్టిన నేను కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయాను. నా గొంతు మూగబోయింది. నా బ్రెయిన్ లో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. నేను వాటిని దాచుకోలేకపోయాను. వాటితో కనీసం పోరాటం కూడా చేయలేకపోయాను.‘‘

ఏదేమైనప్పటికీ...

ఏదేమైనప్పటికీ...

‘‘ఏది ఏమైనప్పటికీ ప్రపంచం ముందుకు వెళ్లాలని నిర్ణయించున్నాను. కానీ అప్పుడు నాకు ఆశ్చర్యకరంగా ప్రశాంతంగా అనిపించింది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు ఎంతో సంతోషంగా కూడా అనిపించింది‘‘ అని సచిన్ వివరించాడు.

మూస పద్ధతులకు గుడ్ బై చెప్పాలి..

మూస పద్ధతులకు గుడ్ బై చెప్పాలి..

‘‘పురుషులంతా మూస పద్ధతులకు గుడ్ బై చెప్పాలి. పురుషులు ఏమి చేయగలరు లేదా ఏమి చేయలేరు అన్న విషయాలను అధిగమించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే. నేను మీకు ధైర్యం రావాలని కోరుకుంటున్నాను‘‘ అని సచిన్ రాసిన లేఖ ఎందరినో ఆకట్టుకుంది. అతని అభిమానులు సచిన్ ఆలోచనలను చాలా మెచ్చుకున్నారు. అందుకే సచిన్ ను తాము అంతలా ఆరాధిస్తామని చెప్పారు. సచిన్ ఇచ్చిన సందేశంతో సమాజంలో సానుకూల మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం.

English summary

International Men's Week 2019: Here's What Sachin Tendulkar Wrote For Men In His Open Letter

Sachin Tendulkar has recently written an open letter for boys and men in order to celebrate the International mens week. In the letter he has mentioned the reason behind why is it normal and okay for men to cry.
Desktop Bottom Promotion