For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరూ ఇంట్లో ఉంటే అదే నాకు పెద్దగిఫ్ట్ అంటున్న బర్త్ డే బాయ్ రామ్ చరణ్

|

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ 'చిరుత' సినిమాలో హీరోగా తనెంటో నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలోని 'మగధీర'సినిమా ద్వారా చెర్రీ రెంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాతో బాక్సాఫీసు రికార్డులన్నింటినీ తిరగరాశాడు.

అయితే తొలి రోజుల్లో చెర్రీని చాలా ఈ హీరో మెగాస్టార్ కాదని, చిరంజీవికి తగ్గ తనయుడు కాదని విమర్శలను ఎదుర్కొన్నాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రంగస్థలం' సినిమా ద్వారా తన నటనలో ఎంతలా మార్పు వచ్చిందో చూపించాడు. అలా తన ఇమేజ్ రోజురోజుకు పెంచుకున్నాడు. అయితే రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో చాలా సౌమ్యుడిగా ఉంటాడు.

వెండితెరపైనే కాకుండా తెరవెనుకలా కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు దానం చేయడంలోనూ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటానని అంటున్నాడు. వీటన్నింటి సంగతి పక్కనపెడితే మార్చి 27వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరినీ ఓ కానుక కూడా అడిగాడు. అయితే అది కూడా కరోనా వైరస్ కు సంబంధించినది. ఇంతకీ రామ్ చరణ్ అభిమానులను ఏమి గిఫ్ట్ అడిగాడు.. ఎందుకని అడిగాడు అనే విషయాలతో పాటు.. చెర్రీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

మద్రాసులో జననం..

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు రామ్ చరణ్ 1985 మార్చి 27వ తేదీన జన్మించాడు. రామ్ చరణ్ కు ఇద్దరు సోదరీమణులు సుస్మిత, శ్రీజ ఉన్నారు.

ప్రేమ వివాహం..

ప్రేమ వివాహం..

రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో అందరిలా పెద్దలు నిర్ణయించిన పెళ్లిని చేసుకోలేదు. తను కూడా చాలా సినిమాల్లో చూపించిన విధంగా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. 2012లో జూన్ 12న అపొలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు.

చిరుతతో సినీ ప్రస్థానం..

చిరుతతో సినీ ప్రస్థానం..

ఏ కళాకారుడికి అయినా వారసత్వం అనేది వెండి తెర పరిచయం వరకూ పనికి వస్తుంది. అయితే టాలెంట్ ఉంటేనే పది కాలాల పాటు రాణించగలరు. అది లేనివారు సినీ రంగంలో మనుగడ కొనసాగించడం కష్టమే. ఇదే విషయాన్ని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ వారసులపై అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని.. అదే సందర్భంగా తమపై ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నాడు.

ప్రత్యేక శైలి..

ప్రత్యేక శైలి..

నిజానికి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి తమ ప్రతిభ నిరూపించున్న వారే చాలా లక్కీ అని చెబుతున్నాడు. అందుకే తాను కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకునేందుకు, ఇప్పటికీ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నానని చెప్పాడు. అందుకే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన నిర్ణయాలు ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నాయని చెప్పాడు.

అల్లూరి సీతారామరాజుగా..

అల్లూరి సీతారామరాజుగా..

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అవార్డులు..

అవార్డులు..

రామ్ చరణ్ తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అనేక అవార్డులను అందుకున్నాడు. తన తొలి చిత్రంతోనే స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. అదే సినిమాకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్ గా ఫిలింఫేర్ కూడా అందుకున్నాడు. అంతేకాదు 2010లో ‘మగధీర‘కి ఫిలిం ఫేర్ సౌత్ అవార్డును అందుకున్నాడు.

ఉత్తమ నటుడిగా..

ఉత్తమ నటుడిగా..

2019లో ‘రంగస్థలం‘ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, సంతోషం అవార్డులను కూడా అందుకున్నాడు. అంతేకాదు టిఎస్సార్ టీవీ9 నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డులను కూడా అందుకున్నాడు. వీటితో సినిమా, జీ సినిమా అవార్డులు సైతం ఆయన ఖాతాలో పడ్డాయి.

గుర్రపు స్వారీ..

గుర్రపు స్వారీ..

రామ్ చరణ్ కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమట. అంతే కాకుండా వ్యాపార రంగంలోనూ చెర్రీకి మంచి అనుభవమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో పోలో రీడింగ్ క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. 2015లో ట్రూ జెట్ అనే సొంత ఎయిర్ లైన్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. దీంతో పాటు డెవిల్స్ సర్క్యూట్స్ కి యజమానిగా, స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఆసక్తికర ట్వీట్..

ఆసక్తికర ట్వీట్..

తన పుట్టిన రోజు సందర్భంగా తాను కూడా ట్విట్టర్ ఖాను ప్రారంభించాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత కలవరపెడుతుందో అందరికీ తెలిసిందే. అందుకే తను కరోనా వైరస్ పై పోరాటానికి తన వంతుగా 70 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు తొలి ట్వీట్ చేశాడు.

తొలి ట్వీట్ తోనే..

తొలి ట్వీట్ తోనే..

ట్విట్టర్ ప్రారంభించిన కొద్ది క్షణాల్లో లక్షలాది మంది ఫాలోయర్స్ సంపాదించుకున్న రామ్ చరణ్.. తన పుట్టినరోజు సందర్భంగా కరోనాను తరిమికొట్టేందుకు అభిమానులందరినీ ఓ కానుక అడిగాడు. అదేంటేంటే.. అందరూ లాక్ డౌన్ ఉన్న సమయం వరకు దయచేసి ఇంట్లోనే ఉండాలని, అదే తనకు మీరిచ్చే అతిపెద్ద కానుక అని చెప్పాడు. దీంతో ఈ ట్వీట్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. అంతేకాదు ‘‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను‘ అని ఓ ట్వీట్ కూడా చేశాడు.

English summary

Intersting Facts about RRR Actor Ramcharan

Here we talking about interesting facts about rrr actor ramcharan. Read on
Story first published: Friday, March 27, 2020, 17:09 [IST]