For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Joe Biden:బైడెన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు.. తనకెంత మంది సంతానం ఉన్నారో తెలుసా...

జో బైడెన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం.

|

అమెరికా లాంటి సంపన్న రాష్ట్రంలో ఓ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన జో బైడెన్ మొక్కవోని దీక్షతో ఎదుగుతూ అగ్రరాజ్య పీఠం అధిష్టించబోతున్నాడు. అత్యంత బలమైన అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో నువ్వానేనా అన్నట్టు సాగిన పోటీలో చివరికి విజేతగా నిలిచాడు.

Joe Biden: Some Lesser Known Facts About This US President 2020

ఇప్పటికే తాను ఆరుసార్లు సెనెటర్ గా (సుమారు 36 సంవత్సరాలు) కూడా పని చేశాడు. రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా కూడా కీలక సేవలందించాడు. ఇక జీవిత లక్ష్యం అయిన అధ్యక్ష పదవిని 77 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నాడు.

Joe Biden: Some Lesser Known Facts About This US President 2020

అయితే ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ లైఫ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బైడెన్ జననం..

బైడెన్ జననం..

జో బైడెన్ 1942 నవంబర్ 20వ తేదీన అమెరికాలోని స్కాంటన్ పెన్సిల్వేనియాలో జన్మించాడు. తను పుట్టిన సమయంలో బైడెన్ తండ్రి ధనవంతుడు. కానీ ఆ తర్వాత కొన్ని ఆర్థిక దెబ్బల కారణంగా వారి కుటుంబం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది.

బైడెన్ విద్య..

బైడెన్ విద్య..

బైడెన్ డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆ తర్వాత సిరక్యూస్ యూనివర్సిటీలో న్యాయ పట్టా(1968లో) అందుకున్నాడు. 1970లో న్యూ కాజిల్ కంట్రీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. అమెరికా చరిత్రలో అతి పిన్న వయస్కుడైన(29 ఏళ్లు) వారిలో ఆరో సెనెటర్ గా ఎంపికయ్యారు. అనంతరం 2008 ఎన్నికల్లో ఒబామా హయాంలో అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం దక్కించుకున్నారు. అప్పుడే తనదైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కేవలం విద్యలోనే కాదు.. క్రీడల్లోను తను సత్తా చాటేవారట.

బైడెన్ ప్రేమ కథ..

బైడెన్ ప్రేమ కథ..

బైడెన్ టీనేజీలో ఉన్నప్పుడు ఒకసారి బహుమాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్ వచ్చారు. బైడెన్ ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారట. ఆమెనే 1966లో వివాహం కూడా చేసుకున్నారు. 1971లో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటికే బైడెన్, నీలియా దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. వారి పేర్లు జోసఫ్(బ్యూ), హంటర్, నవోమీ(అమీ). కుటుంబపరంగా.. రాజకీయ పరంగా అంతా సవ్యంగా నడుస్తున్న సమయంలో బైడెన్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

కారు ప్రమాదంలో..

కారు ప్రమాదంలో..

బైడెన్ 1972లో రెండోసారి డెలావర్ కు సెనెటర్ గా ఎన్నికై ఆనందపడుతున్న సమయంలో, అదే ఏడాది క్రిస్మస్ కు వారం రోజుల ముందు వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైడెన్ భార్య నీలియా, ఏడాది వయసున్న కుమార్తె అమీ మరణించారు. వారి కుమారులు బ్యూ, హంటర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

పిల్లల ఆలన పాలనంతా..

పిల్లల ఆలన పాలనంతా..

అప్పుడు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో వాషింగ్టన్ లో జరిగిన సెనెటర్ల ప్రమాణ స్వీకారానికి బైడెన్ వెళ్లలేకపోయాడట. అయితే ప్రత్యేక అనుమతి తీసుకుని ఆసుపత్రి గదిలోనే ఆ పని పూర్తి చేశారట. పిల్లల కోసం విల్మింగ్టన్ లోనే ఎక్కువగా గడిపేవారట. వాషింగ్టన్ మధ్య అమ్ట్రాక్ ట్రైనులో డైలీ సర్వీస్ చేసేవాడట. సెనెటర్ గా విధులు నిర్వర్తిస్తూనే తల్లి లేని పిల్లలకు అన్నీ తానై పెంచారట. ఆ సమయంలో ఒక దశలో సూసైడ్ కూడా చేసుకుందామనుకున్నాడట. కానీ పిల్లల కోసం ధైర్యంగా ముందడుగు వేశాడంట.

రెండో పెళ్లి..

రెండో పెళ్లి..

1977లో బైడెన్ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సమయంలో బైడెన్ కు జిల్ ట్రేసి జాకబ్స్ అనే టీచర్ పరిచయమవ్వగా.. అతి తక్కువ సమయంలో వారిద్దరూ బాగా దగ్గరయ్యారు. దీంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కుమార్తె పుట్టింది. ప్రస్తుతం బైడెన్ వెంట కనిపిస్తున్న మహిళ జాకబ్సే. ఆమె కూడా తన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారని బైడెన్ చెబుతుంటారు.

English summary

Joe Biden: Some Lesser Known Facts About This US President 2020

Joe Biden is giving a tough competition to Donald Trump in the US Presidential Elections 2020. If you are wondering who This person is and why people are so fond of him, then scroll down the article to read more.
Desktop Bottom Promotion