For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ కాకుండా మీకు ఆనందాన్ని కలిగించే కొన్ని చిన్న చిన్న విషయాలెంటో తెలుసా..

|

ఈరోజుల్లో సంతోషం, సుఖంగా ఉండటం అనేది కేవలం శృంగారంలో మాత్రమే దొరుకుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అంతకుమించినవి మన జీవితంలో చాలానే ఉన్నాయి.

Little Things That Will Make You Happy

అంతేకాదు మీ ముఖంలో చిరునవ్వును చిందించే విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఓ సంస్థ మీకు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినప్పుడు, మీరు ఇల్లు లేదా కారు వంటివి కొనుక్కున్నప్పుడు, లేదా పెంపుడు జంతువు కూడా మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇవే కాకుండా మీకు ఆనందాన్ని కలిగించే అనంతమైన విషయాలను తెలుసుకునేందుకు కింది వరకు స్క్రోల్ చేయండి.

1. ఫ్రెష్ మార్నింగ్..

1. ఫ్రెష్ మార్నింగ్..

మీరు ఉదయాన్నే లేచి మీ బాల్కనీలో లేదా బయట నిలబడి మీ ముఖం మీద కూల్ మార్నింగ్ ఎయిర్ (గాలి)ని అనుభవించినప్పుడు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇది నిజంగా మీ రోజును ప్రారంభించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ప్రకృతి ఎల్లప్పుడూ చికిత్స వంటిది. అందుకే మీరు శక్తివంతంగా తయారవుతారు. ఇది మీ మనసు, శరీరం, ఆత్మను తాజాదనంతో నింపుతుంది.

2. మీ పాత దుస్తుల్లో డబ్బును కనిపెట్టండి..

2. మీ పాత దుస్తుల్లో డబ్బును కనిపెట్టండి..

మీరు మీ పాత బట్టల్లో నుండి ఎప్పుడైనా మరచిపోయిన డబ్బులను కనిపెట్టారా? అయితే అలాంటివి చేయండి వెంటనే వెతకడం ప్రారంభించండి. అది మీకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ ముఖాన్ని మరింత వెలిగిస్తుంది. ఈ భావన స్వర్గం కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి రూపాయీ ప్రత్యేకమే.

3. రేడియోలో మీకు ఇష్టమైన పాటను ప్లే చేయండి..

3. రేడియోలో మీకు ఇష్టమైన పాటను ప్లే చేయండి..

రేడియోలో మీకు ఇష్టమైన పాటను ప్లే చేయండి. ఇది కూడా మీకు నవ్వడానికి ఒక కారణం అవుతుంది. మీరు సంతోషంగా ఉండటానికి అధిక అవకాశం ఉంది. మీరు మీ చింతలను మరచిపోతారు.

4. మీకు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్..!

4. మీకు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్..!

మీరు ఎక్కడికో అత్యవసరంగా వెళుతున్నారు. కానీ మీరు ట్రాఫిక్ గురించి ఆందోళన చెందుతున్నారు. మీరు క్రాసింగ్ కు చేరుకున్న వెంటనే, మీరు వెయిట్ చేయడానికి బదులుగా, ట్రాఫిక్ లో గ్రీన్ సిగ్నల్ కనబడితే, ఇది కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఇంటర్వ్యూలకు, లేదా పరీక్షలకు లేదా ఇంకా ఇతర ప్లేసులకు వెళ్లేటప్పుడు ఇలాంటివి మంచి ఆశీర్వాదంగా పనిచేస్తాయి.

5. ఎక్కువ గంటల నిద్ర..

5. ఎక్కువ గంటల నిద్ర..

మనలో చాలా మంది పడుకునే ముందు అలారం పెట్టుకుంటారు. ఇందులో కూడా కొంచెం మార్పులు చేసుకుందాం. మనలో చాలా మంది మేల్కొనేందుకు గాను రెండు లేదా మూడు అలారాలను సెట్ చేసుకుంటారు. అయినా కూడా మనం మేల్కొనడంలో విఫలమవుతాం. మీరు అలారం తాత్కాలికంగా ఆపివేసి, నిద్రలోకి తిరిగి వెళ్లొచ్చు. ఇది ఎందుకు జరుగుతుందంటే మీ రోజును ప్రారంభించడానికి ఇంకా తగినంత సమయం ఉందని తెలుసుకున్నప్పుడు మీరు నిద్రలోకి తిరిగి వెళతారు. ఇది అత్యుత్తమ అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, అలారం సౌండ్ మీ నిద్రకు భంగం కలిగిస్తే, అప్పుడు మీరు మేల్కొంటే అప్పుడు ఏదో సాధించినట్లు అనిపిస్తుంది.

6. మట్టివాసనతోనూ సంతోషం..

6. మట్టివాసనతోనూ సంతోషం..

వర్షపు నీరు మొదట తాకే మట్టి నేల, ఎండిన నేల మీద వర్షం కురిసినప్పుడు వచ్చే మట్టి వాసన బాగుంటుంది. ప్రకృతికి వాస్తవమైన దగ్గరగా ఉన్నపుడు మన మనసును ప్రశాంత పరుస్తుంది. అంతేకాదు మనల్ని సంతోష పరుస్తుంది.

7) మీకు ఇష్టమైన దుస్తులపై భారీ డిస్కౌంట్ వస్తే..

7) మీకు ఇష్టమైన దుస్తులపై భారీ డిస్కౌంట్ వస్తే..

మీకు ఇష్టమైన దుస్తులను ఎంత ఖరీదైనా కొనాలనుకున్నప్పుడు అవి భారీ డిస్కౌంటుతో లభిస్తే అప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీరు దుస్తుల కోసం డబ్బును ఆదా చేస్తున్న సమయంలో మీరు డిస్కౌంట్ ను గమనిస్తే మీరు ఆనందానికి అవధులు అనేవే ఉండవు.

8. మీ చిన్ననాటి ఫొటో కనిపిస్తే..

8. మీ చిన్ననాటి ఫొటో కనిపిస్తే..

మీరు మీ సెల్ఫ్ ను శుభ్రపరిచేటప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది. మరియు అకస్మాత్తుగా మీ చిన్ననాటి ఫొటో కనిపిస్తే మీకు మంచి మధురమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. దాన్ని చూసి మీరు ఒక్క క్షణం ఆనందంగా నవ్వుకుంటారు.

9. కొత్త బేబీ మీ ఒడిలోకి వచ్చినప్పుడు..

9. కొత్త బేబీ మీ ఒడిలోకి వచ్చినప్పుడు..

ఓ కొత్త బేబీ మీ ఒడిలోకి వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్ గా చిరునవ్వులు చిందిస్తారు. ఎవ్వరినైనా సంతోషపెట్టడానికి ఇది సరిపోతుంది. మీ బేబీ మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్లు మీరు ఆనందపడిపోతారు.

10. దుప్పట్లోకి దూరేయడం..

10. దుప్పట్లోకి దూరేయడం..

శీతాకాలంలో దుప్పట్లోకి దూరేస్తే మీకు కావాల్సిన సుఖం లభిస్తుంది. మీకు రోజంతా దుప్పటిలోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మీకు హాయిగా, వెచ్చగా అనిపిస్తుంది.

11.పబ్లిక్ బస్సులో లేదా రైలులో విండో సీటు దొరికితే..

11.పబ్లిక్ బస్సులో లేదా రైలులో విండో సీటు దొరికితే..

మన దేశంలో పబ్లిక్ బస్సుల్లో, మరియు రైళ్లో ప్రయాణించే వారికి విండో సీటు అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ఎంతలా అంటే ఆ విండో సీటు కోసం ఎన్నోసార్లు ఎంతోమంది గొడవ పడిన సంఘటనలున్నాయి. పెరుగుతున్న జనాభాతో బస్సులు, ట్రైన్లు వంటివి రద్దీగా ఉన్న సమయంలో మీరు మీ హెడ్ ఫోన్ తో పాటలు వింటూ ఏదో ఒక మూల నిలబడే ఉండే సమయంలో సడన్ గా విండోసీటును గుర్తిస్తే మీకు ఆశ్చర్యం, ఆనందం వేస్తుంది. బోరింగ్ ప్రయాణం కూడా అకస్మాత్తుగా ఆసక్తికరంగా మారిపోతుంది.

12. ఎగ్జామ్ లో అన్ని తెలిసినవే వస్తే..

12. ఎగ్జామ్ లో అన్ని తెలిసినవే వస్తే..

ఎగ్జామ్ లో మనం చదువుకున్నవి, మనకు తెలిసిన ప్రశ్నలే వస్తే మనం పడే ఆనందం అంతా ఇంతా కాదు. అక్కడే ఎగిరి గంతేయాలని అనిపిస్తుంది. వాటికి సమాధానాలన్నీ టకటకా రాసేస్తే విద్యార్థులకు ఓ పెద్ద యుద్ధంలో విజయం సాధించినట్టు అనిపిస్తుంది.

13) కొత్త పుస్తకం వాసన..

13) కొత్త పుస్తకం వాసన..

పుస్తకాలను చదవడానికి ఇష్టపడే వ్యక్తులు పుస్తకాలను ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొత్త పుస్తకం పేజీల వాసన కూడా దీనికి ఒక కారణం కావచ్చు.. పుస్తకాలు చదవడానికి ఇష్టపడకపోయినా ఈ వాసనను ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు.

English summary

Little Things That Will Make You Happy, And No, It’s Not Sex!

Most of us sound the alarm before going to bed. Let us make some changes. Most of us set two or three alarms to wake up. Yet we fail to wake up. You can turn off the alarm and go back to sleep. This is why you go back to sleep knowing that there is still enough time to start your day. It makes you feel the best.
Desktop Bottom Promotion